వ్యవసాయానికి 13 గంటల విద్యుత్‌ | 13hours power for agriculture | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి 13 గంటల విద్యుత్‌

Published Sat, Aug 6 2016 1:37 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వ్యవసాయానికి 13 గంటల విద్యుత్‌ - Sakshi

వ్యవసాయానికి 13 గంటల విద్యుత్‌

రన్‌లో భాగంగా సరఫరా
 గుర్రంపోడు : వ్యవసాయ రంగానికి ఇకపై 13 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. అక్టోబర్‌ నుంచి తొమ్మిది గంటల పగటిపూట నిరంతర కరెంటు అందించే క్రమంలో నిర్వహిస్తున్న ట్రయల్‌ రన్‌ ద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి పదమూడున్నర గంటల కరెంట్‌ అమలు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వర్షాలు కురుస్తున్న కరెంట్‌ వినియోగానికి డిమాండ్‌ తగ్గడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే అక్టోబర్‌ వరకు ఇదే తరహాలో కొనసాగిస్తామని, వర్షాలు తగ్గి విద్యుత్‌ డిమాండ్‌ పెరిగితే 13 గంటల సరఫరా నిలిపివేసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నుంచి మండలంలో 8 సబ్‌స్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement