ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. సమయాన్ని బట్టి ధర..నాకు ఎంత.. పోలీసోళ్లను కూడా చూసుకోవాలి.. మా వాళ్లే అన్ని చూసుకుంటారు.. ఇబ్బంది లేకుండా.. కొంత ఎక్కువే చెప్పండి.. ఇదే కాదు, ఇంకా చాలా ఫొటోలు ఉన్నాయి.. అమ్మాయిలు మస్త్ మస్త్‌గా ఉన్నారు.. లెక్క కుదిరితే తీసుకెళ్తా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ బ్రోకర్ అదే జిల్లాకు చెందిన యువకుడితో ఇటీవల సంభాషించిన మాటలు ఇవి. జిల్లాలో వ్యభిచార దందా ఏ విధంగా సాగుతుందో దానితోపాటు ఖాకీల చెడు సావాసానికి ఇది అద్దం పడుతోంది.
న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి ‘డర్టీ పిక్చర్’ సంఘటనను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలు ఇంకా మరిపోనేలేదు. జిల్లా ప్రతిష్ట మసక బార్చేలా వ్యవహరింన తీరుపై అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యారు. అయినా ఆ శాఖలోని పలువురు అవినీతి ఖాకీలు తమ పంథాను మార్చుకోలేదు. జిల్లాలో వ్యభిచార దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనికంతటికీ ఆమ్యామ్యాల కక్కుర్తే కారణం.
అనుమానం వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తప్ప ఎలాంటిచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసాంఫిక కార్యకలాపాలపై పకడ్బందీగా నిఘా పెట్టి ఉక్కు పాదం మోపాల్సిన వారే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, లేకుంటే పరోక్షంగా సహకారం అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సృజన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వ్యభిచార దందాకు సహకరిస్తున్న కీలక పోలీసులు ఎవరు..రాజకీయ నేతల పాత్ర ఏమిటి.. ఎవరి ఒత్తిళ్లు ఏఅధికారిపై ఉన్నాయి.. అనే కోణంలో గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం.
అరోపణలు ఇలా
► ఫిబ్రవరి 19న గద్వాల పట్టణం భీం నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. వ్యభిచారకేంద్రం నిర్వాహకురాలితో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనే కేసు పెట్టారు. కానీ.. ఈ సంఘటనలో కొందరిని తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
► 2022 ఆగస్టు 7న గద్వాల బీరోలు రోడ్డు (తాయమ్మ గుడి) సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యురాలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పరారీలో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎవరి పైనా చర్యలు లేకుండాపోయాయి.
►2021 మే 6న గద్వాల పట్టణంలోని సాయిహోంకాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుపోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామునే సోదాలు చేసి ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రెండురోజుల పాటు విచారణ చేశారు. ఓ అధికారప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడితో పాటు పలువురు చోటామోటా నాయకులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ కేసు నమోదుచేయలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులుమారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
ఇతర రాష్ట్రాల నుంచి యువతులు
విజయవాడకు చెందిన ముఠాసభ్యులు గద్వాల కేరాఫ్ అడ్రాస్‌గాఎంచుకుని గుట్టుగా శివారు కాలనీలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా ఒక్కో యువతిని దిగుమతి చేసుకుంటూ.. ఇళ్లు మారుస్తూ వ్యభిచార దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా గద్వాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కర్నూలు, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరునుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పడుపువృత్తి చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment