
ఆటో డ్రైవర్ల ఉదారత
గట్టు : గట్టు నుంచి మద్దెలబండ వరకు ఉన్న పంచాయతీ రాజ్ తారు రోడ్డుపై ఏర్పడి గుంతలను ఆదివారం ఆటో నడుపుతున్న ఆరగిద్ద డ్రైవర్లు పూడ్చి వేశారు. ఎవరో వస్తారని... ఏదో చేస్తారని... ఎదురు చూసి మోస పోకుమా... నీకు నీవే సహాయ పడుమా... అంటూ ఓ కవి అన్న మాటలను ఆరగిద్ద గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు నిజమని నిరూపించారు.
గట్టు, ఆరగిద్ద స్టేజీ, మద్దెలబండ, మల్దకల్ వరకు ఉన్న తారు రోడ్డుపై ఏర్పడ్డ గుంతను పూడ్చి వేయాలని పంచాయతీ రాజ్ అధికారులకు అనేక పర్యాయాలు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని గట్టు, ఆరగిద్ద, పెంచికలపాడు గ్రామాలకు చెందిన వారు ఆరోపించారు. ఈ రోడ్లుపై నిత్యం తిరిగే వాహాన దారులు అధికారులను తిట్టుకోని రోజంటూ ఉండదూ. అంతగా ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. గట్టు నుంచి మల్దకల్ చేరుకునే సరికి వాహానానికి ఏది ఉంటుందో... ఏదీ ఊడుతుందో తెలియని పరిస్థితి. అంతగా ఈ రోడ్డు అడుగడుగునా గుంతల మయంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ఏవరి ఇష్టం వచ్చినట్లు వారు రోడ్డును తవ్వేశారు. పోని తవ్విన చోట పిడికెడు మట్టి కూడా వేయకుండా వదిలేశారు.
ఈ నేపద్యంలో ఈ రూట్లో ప్రయాణం వాహాన దారులకు నరకాన్ని తలిపిస్తుంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేపట్టలేక పోయారు. రోడ్డు మరమ్మత్తుల గురించి కాలం వెల్లదీస్తున్న తరుణంలో ఆరగిద్ద గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు స్వంత ఖర్చులతో రోడ్డుపై అక్కడక్కడ ఏర్పడ్డ గుంతను పూడ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఆటో డ్రైవర్లు రాజు,వీరేష్, .రాము, వీరాచారి. ఉరుకుందు తదితరులు ఆరగిద్ద గ్రామం నుంచి పెంకలపాడు, మద్దెలబండ వరకు రోడ్డుపై ఏర్పడ్డ గుంతను స్వచ్చందంగా మట్టితో పూడ్చి వేశారు. ఈ గుంత కారణంగా వాహానాలు తరచు మరమ్మత్తులకు వస్తున్నాయని, వీటిని గురించి ఏ అధికారి కూడా పట్టించుకోక పోవడంతో ఇక చేసేదేదమి లేదని తామే గుంతలున్న చోట మట్టిని వేసి తత్కాలికంగా రోడ్డు మనమ్మత్తులను చేపట్టినట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. వీరు చేసిన పనులను వాహాన దారులు మెచ్చుకున్నారు.