
సాక్షి, గద్వాల జిల్లా: బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో వాల్వో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటల్లో చిక్కుకుని మహిళ సజీవదహనం అయ్యింది.. 10 మందికి గాయపడ్డగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
బస్సు హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా ఆ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు అద్దాలగొట్టి బయటపడ్డారు.