beechupally
-
గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్
-
Gadwal Bus Fire Accident: బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
సాక్షి, గద్వాల జిల్లా: బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో వాల్వో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటల్లో చిక్కుకుని మహిళ సజీవదహనం అయ్యింది.. 10 మందికి గాయపడ్డగా, వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా ఆ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు అద్దాలగొట్టి బయటపడ్డారు. -
మళ్లీ రా.. గణేశా!
‘సాక్షి’నెట్వర్క్: భక్తుల ఆటాపాటలు, భజన కోలాటాలతో గణేశ్ నిమజ్జనం వైభవంగా సాగింది. ఎటుచూసినా కోలాహలమే కనిపించింది. వర్షం కురుస్తున్నా యువకులు చిందులు వేస్తూ ఉత్సాహంగా ఏకదంతుడికి వీడ్కోలు పలికారు. ఎప్పటిలాగే నారాయణపేటలో శోభాయాత్ర వినూత్నంగా సాగింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఊరేగింపు గురువారం అర్ధరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. నిమజ్జనంలో సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలపై ఉత్సవకమిటీలు పోటీ పడి అలంకరణ చేశారు. అయిజ, కొడంగల్, షాద్‌నగర్, కొల్లాపూర్, ఆత్మకూరు, మక్తల్ పట్టణాలతో పాటు పలు మండలకేంద్రాల్లోనూ ఉత్సాహంగా నిమజ్జనం నిర్వహించారు. బీచుపల్లి, పెబ్బేరు కృష్ణా తీరంలో భారీగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
పుష్కర స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలు చివరి రోజు పుష్కరస్నానం కోసం బీచుపల్లికి వెళ్లి, 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. షాద్‌నగర్ మండలం బుర్గుల పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన మూడవత్తు దస్రు (55) మంగళవారం బీచుపల్లిలో పుష్కరస్నానం చేశాడు. సాయంత్రం స్వగ్రామానికి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సూచనమేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య దస్తి, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. కుమారుడు రామ్‌జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటిక్యాల ఏఎస్ఐ జిక్కిబాబు పేర్కొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో వృద్ధుడు.. కొడంగల్ రూరల్(కోస్గి): కోస్గి మండలకేంద్రానికి చెందిన జలంధర్‌రెడ్డి(71)మంగళవారం ఇంటి నుంచి పుష్కరాలకు వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఎర్రవల్లి చౌరస్తాలో దిగి మరో బస్సును ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అక్కడి పోలీసులు కోస్గిలోని జలంధర్‌రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం ఉదయం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
ఆర్టీసీతో పాటు టీఎస్‌టీడీసీ ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు ఆగస్టు 12 నుంచి 23 వరకు సర్వీసులు మహబూబ్‌నగర్ క్రైం: కృష్ణా పుష్కరాల కోసం జిల్లా ఆర్టీసీతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సంబంధిత డిపో కేంద్రాల పరిధిలో ప్రధాన బస్‌స్టేçÙన్ల నుంచి పుష్కరఘాట్లకు ప్రయాణికులను చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 9డిపోల పరిధిలో మొత్తం 430బస్సులు నడుపుతున్నారు. ఆన్లైన్ బుకింగ్.. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు మందస్తుగా తమ టికెట్లును ఆర్టీసీకి సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. పుష్కరాలకు కుటుంబసమేతంగా లేదా స్నేహితులు 36మంది మించితే ముందస్తుగా ప్రత్యేక బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లాలోని ఆయా డిపోల మేనేజర్లను సంప్రదించాల్సి ఉంటుంది. పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సిద్ధం చేసింది. రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నదీ తీరంలో పుణ్యస్నానాలాచరించేందుకు వస్తుంటారు. పుష్కరయాత్రికల కోసం టీఎస్‌టీడీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఆగస్టు 12నుంచి 23వరకు పుష్కరాల కోసం హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేకంగా 25బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. మహబూబ్‌నగర్, అలంపూర్, సోమశిల, బీచుపల్లికి ప్రత్యేక సర్వీసులు నాన్ ఏసీ బస్సును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి బీచుపల్లి పుష్కరఘాట్‌తో పాటు అలంపూర్ జోగులాంబ దేవాలయం దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇందుకోసం టూర్ ప్యాకేజీలు పెట్టారు. హైదరాబాద్ టు బీచుపల్లి... హైదరాబాద్ నుంచి బీచుపల్లి, అలంపూర్ పర్యాటక ప్రాంతాలకు టీఎస్టీడీఎసీ ప్రత్యేక వోల్వో, ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరిన బస్సు మధ్యాహ్నం వరకు బీచుపల్లి ఘాట్‌కు చేరుకుంటుంది. అక్కడ పుష్కరస్నానం చేసిన తర్వాత భక్తులు స్థానిక ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అలంపూర్ జోగులాంబ దేవాలయానికి వెళ్లి అటు నుంచి తిరిగి రాత్రి హైదరాబాద్ చేరుకునే విధంగా ప్యాకేజీ తయారు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి సోమశిలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.700లుగా టికెట్ ధరను నిర్ణయించారు. -
బీచుపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు
ఇటిక్యాల: గతేడాది నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోయిన కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు వదలడంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు కింద ఉన్న శ్రీశైలంకు చేరుతుంది. బీచుపల్లి వద్ద నూతనంగా నిర్మించే పుష్కరఘాట్లను ఆనుకుని నదిలో నీటì ప్రవాహం ఉండటంతో గురువారం సందర్శకులు కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్నారు. వచ్చేనెల 12నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బీచుపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు
ఇటిక్యాల: గతేడాది నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోయిన కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు వదలడంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు కింద ఉన్న శ్రీశైలంకు చేరుతుంది. బీచుపల్లి వద్ద నూతనంగా నిర్మించే పుష్కరఘాట్లను ఆనుకుని నదిలో నీటì æప్రవాహం ఉండటంతో గురువారం సందర్శకులు కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్నారు. వచ్చేనెల 12నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.