పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
Published Wed, Aug 3 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఆర్టీసీతో పాటు టీఎస్టీడీసీ ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు
ఆగస్టు 12 నుంచి 23 వరకు సర్వీసులు
మహబూబ్‌నగర్ క్రైం: కృష్ణా పుష్కరాల కోసం జిల్లా ఆర్టీసీతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సంబంధిత డిపో కేంద్రాల పరిధిలో ప్రధాన బస్‌స్టేçÙన్ల నుంచి పుష్కరఘాట్లకు ప్రయాణికులను చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 9డిపోల పరిధిలో మొత్తం 430బస్సులు నడుపుతున్నారు.
ఆన్‌లైన్ బుకింగ్..
కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు మందస్తుగా తమ టికెట్లును ఆర్టీసీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. పుష్కరాలకు కుటుంబసమేతంగా లేదా స్నేహితులు 36మంది మించితే ముందస్తుగా ప్రత్యేక బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లాలోని ఆయా డిపోల మేనేజర్లను సంప్రదించాల్సి ఉంటుంది. పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సిద్ధం చేసింది. రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నదీ తీరంలో పుణ్యస్నానాలాచరించేందుకు వస్తుంటారు. పుష్కరయాత్రికల కోసం టీఎస్టీడీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఆగస్టు 12నుంచి 23వరకు పుష్కరాల కోసం హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేకంగా 25బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. మహబూబ్‌నగర్, అలంపూర్, సోమశిల, బీచుపల్లికి ప్రత్యేక సర్వీసులు నాన్ ఏసీ బస్సును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి బీచుపల్లి పుష్కరఘాట్‌తో పాటు అలంపూర్ జోగులాంబ దేవాలయం దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇందుకోసం టూర్ ప్యాకేజీలు పెట్టారు.
హైదరాబాద్ టు బీచుపల్లి...
హైదరాబాద్ నుంచి బీచుపల్లి, అలంపూర్ పర్యాటక ప్రాంతాలకు టీఎస్టీడీఎసీ ప్రత్యేక వోల్వో, ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరిన బస్సు మధ్యాహ్నం వరకు బీచుపల్లి ఘాట్‌కు చేరుకుంటుంది. అక్కడ పుష్కరస్నానం చేసిన తర్వాత భక్తులు స్థానిక ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అలంపూర్ జోగులాంబ దేవాలయానికి వెళ్లి అటు నుంచి తిరిగి రాత్రి హైదరాబాద్ చేరుకునే విధంగా ప్యాకేజీ తయారు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి సోమశిలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.700లుగా టికెట్ ధరను నిర్ణయించారు.
Advertisement
Advertisement