krishna pushkaralu 2016
-
అందరి కృషి వల్లే ‘పుష్కర’ విజయం
– ఎస్పీ రెమా రాజేశ్వరి మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన కృష్ణా పుష్కరాలను అందరి సహకారంతో విజయవంతం చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. కృష్ణా పుష్కర విధులలో పాల్గొన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందికి సోమవారం ఎస్పీ కార్యాలయంలో రెమా రాజేశ్వరి ప్రశంసపత్రాలతో పాటు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లలో దాదాపు 1.80కోట్ల మంది పుణ్యస్నానం చేశారని, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ను దారి మళ్లించడంతో పాటు ఎక్కడా రద్దీగా ఉండకుండా క్లియర్ చేయడంలో పూర్తిగా విజయం సాధించినట్లు తెలిపారు. జిల్లాకు పుష్కరస్నానంలో భాగంగా దాదాపు 5.50లక్షల వాహనాలు వచ్చాయని, వాటన్నింటినీ ఆయా ఘాట్లకు పంపించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం అయినా, అందులో పూర్తిస్థాయిలో విజయం సాధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సిబ్బందితో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని జిల్లాలో చిన్న సంఘటన జరగకుండా చూడటం పోలీస్‌శాఖ ఉన్నతికి నిదర్శనమన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఎస్పీ గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో ఓఎస్డీ కల్మేశ్వర్ సింగనవార్, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలపై సావనీర్ రూపొందించాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో సావనీర్ రూపొందించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. సావనీర్ రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సేకరించి త్వరితగతిన సావనీర్‌ను ప్రచురించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై రూపొందించనున్న సావనీర్‌పై ఏర్పాటు చేసిన కమిటీ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా సావనీర్లో కృష్ణా పుష్కరాల నిర్వహణకు చేపట్టిన అన్ని చర్యలతో పాటు ప్రచురణలు, ఫొటోలు, ముఖ్యమైన అంశాలన్నీ వచ్చే విధంగా సావనీర్‌ను రూపొందించాలని కమిటీ సభ్యులకు సూచించారు. సావనీర్ వచ్చే పుష్కరాలకు ఒక మంచి రెఫరెన్సు రికార్డులా ఉపయోగపడాలని సూచించారు. సావనీర్లో కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన ప్రతీ అంశం, ప్రతీ అనుభవం వచ్చేలా తయారు చేయాలని అన్నారు. డీఆర్ఓ భాస్కర్, సెట్మా సీఈఓ హన్మంతురావు, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్‌రెడ్డి‡, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేందర్, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, డీఐఓ డాక్టర్ కృష్ణ, తెలుగు పండిత్ గిరిజారమణ సావనీర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. -
జిల్లాలో 1,84,94,164మంది పుష్కరస్నానం
కృష్ణవేణి ఒడిలో తరించిన భక్తులు ముగిసిన పుష్కర మహోత్సవాలు నదీమతల్లికి సంధ్యాహారతితో వీడ్కోలు పలికిన భక్తులు బీచుపల్లిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి, అలంపూర్‌లో కలెక్టర్ పూజలు సోమశిలలో హారతి ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి చివరిరోజూ ఘాట్లకు పోటెత్తిన జనం లక్షలాది మంది పుణ్యస్నానం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు ముగిశాయి. జిల్లాలో 12రోజులపాటు అత్యంత వైభవంగా సాగాయి. పండితుల వేదమంత్రాల మధ్య మళ్లొస్తాం అంటూ మంగళవారం కృష్ణవేణికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణ పుష్కరాలు జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో అత్యంత వైభోవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 12వ తేదీన అలంపూర్‌లోని గొందిమళ్లలో ఉదయం 5.58 నిమిషాలకు అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ అనురాగ్‌శర్మ, జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్, అడిషన్ డీజీ అంజనికుమార్, డీఐజీ అకున్ సబర్వాల్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తదితరులు అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పంచదేవ్‌పహాడ్, మరుముల, గుమ్మడం, మూనగాన్దిన్నె, కృష్ణ, పాతాళగంగ వంటి పుష్కరఘాట్లలో లక్షలాదిగా భక్తులు చివరిరోజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అనేక మంది పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. 12వ తేదీనుంచి 23వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఘాట్లలో 1,84,94,164 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖుల పూజలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్ బీచుపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. రంగాపూర్ ఘాట్‌లో సినీ నిర్మాత రామ యాదిరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఛైర్మన్ బండారు భాస్కర్, కలెక్టర్ టికె.శ్రీదేవి రంగాపూర్, బీచుపల్లి పుష్కరఘాట్లను సందర్శించారు. గొందిమళ్లలో సీఎం పుష్కరాలను ప్రారంభించిన ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పుష్కరాలను ముగింపు ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలను క్షేమంగా చూడాలంటూ పండితులు వేద ఆశీర్వాదం చేశారు. బీచుపల్లిలో జరిగిన పుష్కరాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక గంగ హారతి ఇచ్చారు. 12 రోజులపాటు పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మంత్రులు అభినందనలు తెలిపారు. సోమశిలలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం అభినందించారు జిల్లాలో కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, 48 శాఖల ఉద్యోగ, సిబ్బంది సహాయ సహాయ సహకారాలతో పుష్కరాలు జయప్రదం అయ్యాయి.’’ – కలెక్టర్ టీకే శ్రీదేవి -
ఉప్పొంగిన జన కృష్ణమ్మ
పుష్కర మహోత్సవ వేళ పాలమూరు కృష్ణాతీరం జనసంద్రాన్ని తలపించింది. సెలవు రోజుల్లో జనం రద్దీ అనూహ్యంగా పెరిగింది. విశిష్ట స్థల పురాణం ఉన్న ఘాట్లకు భక్తులు పోటెత్తారు. 12రోజుల పాటు జోగుళాంబ(గొందిమల్ల), సోమశిల, బీచుపల్లి, రంగాపూర్ ప్రధాన ఘాట్లు భక్తులతో రద్దీగా మారాయి. వీటితో పాటు నదీ అగ్రహారం, పసుపుల, కృష్ణ, పాతాళగంగ ఘాట్లు కూడా కిటకిటలాడాయి. జోగుళాంబలో 20 లక్షలు జోగుళాంబఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలు ప్రారంభోత్సవానికి అలంపూర్ సమీపంలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్ వేదికైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను ప్రారంభించారు. గవర్నర్, మండలి చైర్మన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రస్థాయి అధికారులు, నాయకులు, సినీ స్టార్లు ఇక్కడే పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల 12రోజులపాటు దాదాపు 20 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు కలకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, విద్యుత్ శాలు విధులు సమర్థవంతంగా నిర్వహించి, సదుపాయాలు కల్పించారు. 12 రోజులపాటు ప్రశాంత వాతావరణంలో పుష్కరాలు నిర్వహించడంలో అధికారులు సఫలమయ్యారు. సోమశిలలో 27.81లక్షలు సోమశిల పుష్కరఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల ఘాట్‌లో మొత్తం 27.81లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 12వ తేదీ 53వేలు, 13న 90వేలు, 14న 1,22,200, 15న 1.52లక్షలు,16న 86,600, 17న 1.60లక్షలు, 18న 1.52లక్షలు, 19న 1,39,300, 20న 4.43లక్షలు, 21న 5.91లక్షలు, 22న 4.81లక్షలు, 23న 3.11లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. తొలి 8 రోజులు భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగింది. ఆ తర్వాత నాలుగురోజులు అనూహ్యంగా పెరిగింది. ట్రాఫిక్‌ను పోలీసులు సమర్థవంతంగా నియంత్రించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎంలు దామోదర రాజనర్సింహ్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పుణ్యస్నానాలు చేశారు. మంచాలకట్టలో 5.5లక్షలు, అమరగిరిలో 6 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రంగాపూర్‌లో 45లక్షలు రంగాపూర్ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలను పన్నెండు రోజుల పాటు రంగాపూర్‌ఘాట్‌లో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ ఘాట్‌లోనే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలో దాదాపు 2 కోట్ల మంది పుష్కరస్నానం చేస్తే అందులో 45లక్షల మంది అతి విశాలమైన రంగాపూర్లోనే స్నానమాచరించారు. మొదటి రెండు రోజులు జనం పలుచగా ఉన్నా నెమ్మదిగా పుంజుకుని చివరి నాలుగు రోజులు లక్షల్లో పోటెత్తారు. 10వ రోజే ఏకంగా 9 లక్షల మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. పోలీసులు, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరోత్సవాలను విజయవంతం చేశారు. రంగాపూర్ఘాట్కు వీఐపీల తాడికి అంచనాలకు మించి ఉన్నట్లు ఘాట్ ప్రత్యేకాధికారులు ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డ్వామా పీడీ కట్టా దామోదర్రడ్డి, ఆర్డీఓ రామచందర్ తెలిపారు. బీచుపల్లిలో 39.50 లక్షలు బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాల్లో 12రోజుల పాటు ఇటిక్యాల మండలం బీచుపల్లిలో 38.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పునీతులయ్యారు. పుష్కరఘాట్ ఇన్చార్జ్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ప్రత్యేకాధికారులు జేసీ రాంకిషన్, గంగారెడ్డి అనునిత్యం ఎప్పటికప్పుడు ఘాట్లను పర్యవేక్షిస్తూ పుష్కరాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగ్విజయంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో 1200మంది పోలీసులు నిఘా సారించారు. ప్రధానంగా ఘాట్లన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల్లో అపరిశుభ్రత నెలకొనకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని నిరూపించారు. ఈ నెల 12న తెల్లవారుజామున నదీహారతితో ప్రారంభమైన పుష్కరాలు మంగళవారం సాయంత్రం 7గంటలకు నదీహారతితో ముగించారు. -
భక్తజన ప్రభంజనం
11వ రోజు 20,90,778మంది పుష్కరస్నానం పెరిగిన వీఐపీల తాకిడి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వరుసగా 11వ రోజు సైతం భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలతో పోలిస్తే కొంత భక్తుల రద్దీ తగ్గినప్పటికీ సోమవారం సైతం అన్ని పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. మొత్తం 20,90,778మంది భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. తెల్లవారుజాము ఐదు గంటల నుంచే పుష్కరఘాట్లు జనసంద్రంగా మారాయి. పుష్కర స్నానానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో వీఐపీలతో సహా సాధారణ ప్రజలు పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి బారులు తీరారు. జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో కొందరు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా హైదరాబాద్, కర్నూలు జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించగా ఎస్పీ రెమా రాజేశ్వరి పర్యవేక్షించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచ్పల్లి, రంగాపూర్, సోమశిల, నదీఅగ్రహారం, కృష్ణ, పస్పుల, పంచదేవ్‌పహాడ్, క్యాతూరు, గుమ్మడం, మునగాన్దిన్నె, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సోమవారం పది లక్షలకుపైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. సోమశిల పుష్కరఘాట్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టి.కె.శ్రీదేవి సాయంత్రం, బీచుపల్లిలో మరో మంత్రి లక్ష్మారెడ్డి గంగాహారతి ఇచ్చారు. రంగాపూర్ ఘాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి అలంపూర్‌లోని గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి అలంపూర్ ఆలయాన్ని సందర్శించారు. మూలమల్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. సినీనటుడు, రవితేజ తమ్ముడు రాజగోపాల్ పుణ్యస్నానం ఆచరించారు. అలంపూర్‌లో రాష్ట్ర జైళ్ల డీజీపీ గోపినాథ్‌రెడ్డి, ఐపీఎస్ అధికారి విక్రంసింగ్ తదితరులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబను దర్శించుకున్నారు. మరింత తగ్గిన నీటిమట్టం కాగా, సోమవారం అన్ని పుష్కరఘాట్లలో నీటిమట్టం మరింత తగ్గింది. ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు వరదనీరు పూర్తిగా తగ్గడంతో జూరాల నుంచి ఎగువ ప్రాంతానికి నీటి విడుదల నిలిపివేశారు. దీంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే పుష్కర స్నానాలకు ఒకేరోజు మిగిలి ఉండటంతో నీటి మట్టం తగ్గినా స్నానాలకు ఇబ్బందిలేదని అధికారులు చెబుతున్నారు. పుష్కరాల ముగింపు పర్వాన్ని బీచుపల్లి పుష్కరఘాట్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు జిల్లా మంత్రులు, ఇతర అధికారులు మంగళవారం సాయంత్రం జరిగే ముగింపు సభలో పాల్గొననున్నారు. -
పుష్కరాల్లో పురోహితులు
భక్తితో నదిలో మునిగితే పాపం హరించుకుపోతుందన్నది భక్తుల విశ్వాసం. పుష్కరుడు ఉన్న నదిలో స్నానం చేస్తే పాపం హరించడంతో పాటు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. పుష్కర స్నానానికి వచ్చినవారు నదిలో వివిధ రకాల కర్మలు, విధులు ఆచరిస్తుంటారు. సంకల్పం చెప్పుకోవడం నుంచి పితృదేవతలకు పిండ ప్రదానాల వరకు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పురోహితులు తప్పనిసరి. ఆలయాల్లోని అర్చకులతో పాటు భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద ప్రత్యేకంగా పురోహితులను అందుబాటులో ఉంచారు. పుష్కర విధుల్లో ఉన్న పూజారులు మనోగతం వారి మాటల్లో.. – పుష్కరఘాట్ల నుంచి ‘సాక్షి’ బృందం భక్తులకు అవగాహన పెరిగింది – గురురాజాచార్యులు, భక్తాంజనేయస్వామి ఆలయ అర్చకుడు, రంగాపూర్ గతంలో పుష్కరస్నానాలపై భక్తులకు అవగాహన లేకపోవడంతో గ్రామాల నుంచి బయటికి వచ్చి పుష్కరస్నానాలు చేయలేదు. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రభుత్వ ప్రచారంతో పుష్కరస్నానంపై అవగాహన వచ్చింది. రంగాపూర్ పుష్కరఘాట్ వద్ద కొన్ని లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. పూజలు చేయడం అదృష్టం రంగాపూర్ ఘాట్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవాలయంలో రెండోసారి అశేష భక్తుల కోసం పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. రోజుకు 50వేల మంది భక్తులతో పూజలు చేయిస్తున్నాను. స్వరాష్ట్రంలో జరుగుతున్న తొలి కృష్ణా పుష్కరాలకు భక్తుల ఊహించని విధంగా వస్తున్నారు. నవగ్రహ పూజలు, పంచామృతం, హారతులు, అభిషేకాలు చేస్తూ ఆశీర్వదిస్తున్నాను. – ఎం. గురురాజాచారి, పూజారి, పెబ్బేరు కొత్త అనుభూతి.. కృష్ణా పుష్కరాల సమయంలో మేము దేవాలయంలో భక్తులతో పూజలు చేయించే అవకాశం రావడం మా అదృష్టం. ఇంత మంది భక్తులు కృష్ణా పుష్కరాలకు వచ్చి పుణ్య స్నానాలు చేయడం మరిచిపోలేము. కొత్త అనుభూతిని ఇస్తుంది. –మారుతీశర్మ, బీచుపల్లి పూజలతో సంతృప్తి .. భక్తుల రద్దీ బాగా పెరుగుతుంది. పవిత్ర కృష్ణా పుష్కరాల్లో స్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తులు వారి పెద్దల ఆత్మశాంతి కోసం వందల సంఖ్యలో పిండ ప్రదానాలు చేస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో భక్తులు వస్తుండటంతో వారిచే పూజలు చేయించడం సంతృప్తినిస్తుంది. – శేషాచార్యులు, ప్రధాన అర్చకుడు, ఆత్మకూర్ ఎంతో ఆనందం.. కృష్ణా పుష్కరాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ పుణ్యస్నానాలు చేసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మూలమల్ల ఘాట్‌లో 60మందికిపైగా పూజారులు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు పుష్కరాల విశిష్టత గురించి చెబుతూ పూజలు చేస్తుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. – రాఘవేందర్రావు, ఆత్మకూర్ -
పుష్కరవేణి సాక్షిగా రక్షా బంధనం
-
పుష్కర సేవలో నాలుగో సింహం
బీచుపల్లి ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: ‘మీరు ఎక్కడి వెళ్లాలి.. ఘాట్‌లోకి అయితే ఇలా వెళ్లండి.. పార్కింగ్‌కు అయితే ఇలా.. బస్టాండ్‌కు అయితే ఇలా వెళ్లండి’ అంటూ ఎప్పటికప్పుడు సూచనలు.. సలహాలు ఇస్తూ భక్తులకు సమాచారం ఇవ్వడంతో పాటు వారికి సహకరిస్తున్నారు. కృష్ణా పుష్కరాలలో పోలీస్ శాఖలో ఎస్పీ స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ భక్తుల సేవలో పాల్గొంటున్నారు. జిల్లాలో 185కిలోమీటర్ల జాతీయ రహదారిపై పోలీసులు పహారా ఉంది. ప్రతి 10అడుగులకు ఓ హోంగార్డు, ఓ కానిస్టేబుల్ చొప్పున అనుక్షణం అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వహిస్తుండటంతో భక్తులు సాఫీగా పుష్కరయాత్ర పూర్తి చేసుకుంటున్నారు. రోడ్లు దాటిస్తున్నాం పుష్కరాల కోసం హైదరాబాద్ వైపు నుంచి వేలమంది భక్తులు వస్తున్నారు. అలాంటి వాళ్లను ప్రత్యేకంగా రోడ్డు దాటించడం కోసం పని చేస్తున్నాను. రోజుకు కొన్ని వేల మందిని ఈ రోడ్డు అవతల వైపునకు వాహనాలు ఆపుతూ పంపిస్తున్నా. రోడ్డుకు ఇరువైపుల నడుస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మైక్ ద్వారా ఘాట్ల సమాచారం ఇస్తున్నాం. –సీతయ్య, సీఐ భక్తులకు సమాచారం ఇస్తూ.. కృష్ణా పుష్కరాలలో భాగంగా జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పూర్తిగా పెరిగిపోవడంతో కొంత ఇబ్బందులు ఉంటాయి. అయిన వాటన్నింటినీ ఎదుర్కొంటూ భక్తులకు అవసరం అయిన సమాచారం ఇస్తూ ముందుకు పంపిస్తున్నాం. వాళ్లను రోడ్డు పక్కన ఉండకుండా ఎప్పటికప్పుడు క్యూలైన్‌కు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – గిరిబాబు, సీఐ చాలామందికి తెలియడం లేదు పుష్కరాల కోసం వచ్చే భక్తులకు చాలా మందికి రోడ్డు మార్గాలపై అవగాహన ఉండదు. ఎక్కడ వాహనం నిలపాలి అనే విషయం వారికి స్పష్టత లేదు. అలాంటి వాహనదారులను ఎప్పటికప్పుడు విషయం చెబుతూ ముందుకు పంపిస్తాం. రోడ్డుపై విధులు నిర్వహించడం చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. –రామకృష్ణ, సీఐ భయపడే వాళ్లకు సహకారం చాలామంది ఇలాంటి రద్దీ రోడ్లు అవతలి వైపు వెళ్లాలంటే వేగంగా వస్తున్న వాహనాలను చూసి చాలా భయపడుతుంటారు. ఇలాంటి వాళ్లను ప్రత్యేకంగా ఎక్కువ మందిని తయారు చేసి రోడ్లు దాటిస్తున్నాం. అటు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అవసరం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. –శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ -
వాడపల్లిలో పుష్కర స్నానానికి బారులు తీరిన భక్తులు
వాడపల్లి: కృష్ణా పుష్కరాల మూడో రోజుకే చేరుకున్నాయి. వరుస సెలవులు కావడంతో.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. పుష్కర స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి జనసంద్రమైంది. కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రాంతంగా వాడపల్లి విరాజిల్లుతుండటంతో.. ఇక్కడ పుష్కర స్నానం చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. -
కృష్ణమ్మకు మహా హారతి
-
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు
హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ సంతరించుకుంది. విజయవాడలోని దుర్గాఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు చీర,సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్లలో సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి, శ్రీశైలం, విజయవాడతోపాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద పుష్కరస్నానం ఆచరించేందుకు భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. -
ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీ
విజయవాడ: విద్యుత్ వెలుగుల్లో కృష్ణమ్మ అందాలు ద్విగుణీకృతమయ్యాయి. కరెంట్ కాంతుల్లో 'పుష్కర కృష్ణా' సప్తవర్ణ శోభితంగా కనువిందు చేస్తోంది. వివిధ వర్ణాల్లో మెరిసిపోతూ హోయలు పోతున్న కృష్ణమ్మ అందాలను చూసి జనం మంత్రముగ్దులవుతున్నారు. ఈ నెల 12 నుంచి జరగనున్న కృష్ణా నది పురస్కరించుకుని విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో నయనానందకరంగా మెరిసిపోతున్న కృష్ణమ్మ అందాలను 'సాక్షి' కెమెరా క్లిక్ మనిపించింది. కరెంట్ దీపాల కాంతిలో ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీని, కృష్ణా నది నీటి ప్రవాహం చూసే వారికి కనువిందు చేస్తోంది. మరోవైపు ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా నది పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. -
కృష్ణాతీరంలో నౌకావిహారం!
నౌకావిహారం... అదొక అందమైన అనుభూతి... త్యాగరాజంతటి మహానుభావుడు తన కీర్తనలలో ‘ఓడను నడిపే ముచ్చట గనరే’ అంటూ నౌకావిహారం గురించి కీర్తించాడు. శిశువుల నుంచి వృద్ధుల వరకు పడవ ప్రయాణాన్ని ఆనందించనివారు లేరు. ఒకప్పుడు చిన్నచిన్న గ్రామాలకు వెళ్లాలంటే మార్గంలో నది లేదా కాలువ ఉంటే, బల్లకట్టు దాటి వెళ్లేవారు. వారికి నీటి మీద ప్రయాణం నిత్యకృత్యం.రానురాను నీటి మీద వంతెనలు వచ్చాయి. దాంతో నీటిలో ప్రయాణించి ఆనందించే సౌకర్యం పూర్తిగా కనుమరుైగె పోయింది.ఈ గజిబిజి హడావుడి జీవితంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి అందరూ నీళ్లలో విహరించాలనుకుంటున్నారు. మాయాబజార్ చిత్రంలో సాక్షాత్తు రేవతి బలరాములు, రుక్మిణీ శ్రీకృష్ణులు, శశిరేఖా అభిమన్యులు నౌకావిహారం చేసి, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ గానామృతంలో ఓలలాడినట్లు చిత్రీకరించారు. కృష్ణాతీరంలోని నౌకావిహార ప్రదేశాలు... కృష్ణానదీ తీరంలో కనకదుర్గమ్మ కొలువుతీరిన విజయవాడ ప్రకాశం బ్యారే జీ దగ్గరలో ఉంది భవానీ ద్వీపం. ఇక్కడి అమ్మవారు భవాని కనుక, ఈ ద్వీపానికి భవానీ ద్వీపం అని పేరుపెట్టారు. విజయవాడ నగరంలో వినోదస్థలాలు చాలా తక్కువ. వినోదయాత్రలు చేయాలనుకునేవారికి ఇదొక వరం. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ కంపెనీలు భవానీద్వీపం దగ్గర కృష్ణానదిలో బోటింగ్‌లో సమావేశాలను నిర్వహిస్తూ సిబ్బందికి కొత్తకొత్త అనుభూతుల్ని కలిగిస్తున్నాయి. కృష్ణానది గర్భంలో సుమారు 133 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలోని ఈ ద్వీపంలో ప్రస్తుతం 25 ఎకరాలు మాత్రమే వినియోగిస్తున్నారు. నీటి మధ్య, పచ్చని చెట్లతో నిండి ఉన్న ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ ఉన్న నాలుగు ట్రీ కాటేజ్‌లు భవానీద్వీపం ప్రత్యేకత. చెట్ల పైఅంచులను తాకుతూ ఉండటం ఈ కాటేజ్‌ల ప్రత్యేకత. ఇంకా... పర్యాటకుల కోసం 24 డీలక్స్ ఏసీ కాటేజ్‌లు, రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉన్నాయి. విజయవాడలో కృష్ణాతీరంలో బరంపార్కును ఏపీటీడీసీ నిర్వహిస్తోంది. ఇందులో ఏసీ సౌకర్యంతో ఉన్న రూమ్‌లు, ఏసీ రెస్టారెంట్, ఫాస్ట్‌పుడ్ సెంటర్ ఉన్నాయి. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, గోవా బీచ్‌లకు దీటుగా భవానీద్వీపంలో పర్యాటకుల సాహసానికి పరీక్ష అన్నట్లు అనేక రకాల అడ్వంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి. వీటిని బెంగుళూరు ప్రీకోర్ట్ కంపెనీ ఏర్పాటు చేసింది. క్లైంబింగ్ వాల్, వాటర్ రోలర్, లో రోప్ కోర్సు, వైన్ ట్రావెర్స్, రైఫిల్ షూటింగ్ వంటి గేమ్స్ ఉన్నాయి. గోవా బీచ్‌లో ఉన్నట్లు వాటర్ స్పోర్ట్స్, ప్యారాషూట్ , స్పీడ్ బోట్, బిగ్ బోట్లు... చాంపియన్ యాచ్ క్లబ్ ఏర్పాటు చేసింది. కృష్ణానదిలో బోటింగ్ బరంపార్కుతో పాటు దుర్గాఘాట్, గుంటూరు జిల్లా లోటస్ హోటల్ నుంచి భవానీద్వీపానికి వెళ్లేందుకు బోటింగ్ సౌకర్యం ఉంది. నదిలో ఉత్సాహంగా బోటింగ్ చేసే వారి కోసం జెట్ స్కై బోట్లు, నదిలో సరదాగా కొద్దిసేపు విహరించే వారి కోసం బోధిసిరి ఏసీ బోట్లు ఉన్నాయి. ఇందులో కనీసం యాభైమంది ఒక సముదాయంగా ఉండాలి. అనేక కార్పొరేట్ కంపెనీలు బోధిసిరి బోట్లలో తమ కంపెనీ కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తూ ఉంటాయి. కేవలం ఒక కుటుంబం మాత్రమే ఆహ్లాదంగా నదిలో విహరించాలనుకుంటే, అలాంటి వారికి స్పీడ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. సరదాగా భవానీద్వీపం చూసి వద్దామనుకునేవారి కోసం భవాని, అమెరికన్ ప్యాంట్యూన్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. కృష్ణానదిలో విహరించడానికి బోటింగ్ ధరల వివరాలు: భవానీద్వీపం సందర్శించి రావడానికి: పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 అమెరికన్ ప్యాంటూన్ బోట్ (కనీసం 20 మంది) - ఒకొక్కరికి రూ.50 స్పీడ్ బోట్లు - ఆరు నిముషాలు (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు)- రూ.300 జెట్ స్కీ బోటు (వాటర్ స్కూటర్) మూడు నిముషాలు ఒకొక్కరికి ఒక ట్రిప్పు- రూ. 250 జెట్ స్కీ బోటు (వాటర్ స్కూటర్) ఇద్దరికి ఒక ట్రిప్పు- రూ. 350 బోధిసిరి ఏసీ బోటు రెండున్నర గంటల పర్యటనకు (శని, ఆది) రూ.10వేలు, (సోమ నుంచి శుక్ర) రూ.8000 అదనంగా ఒక గంట ఉపయోగించుకుంటే రూ.4000 చొప్పున చెల్లించాలి. పర్యాటకుల కోరిక మేరకు బోట్లలోనూ, ద్వీపంలోనూ అధికారులే భోజన ఏర్పాట్లు చేస్తారు. పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న సూర్యలంక బీచ్: గుంటూరు జిల్లాలోని బాపట్లకు 8 కి.మీ దూరంలో సూర్యలంక బీచ్ ఉంది. అమరావతికి వచ్చేవారు సరదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్‌కు వెళుతూంటారు. బంగాళాఖాతంలోని మిగిలిన బీచ్‌లు లోతు ఎక్కువగా ఉండి ప్రమాదభరితంగా వుంటాయి. సూర్యలంక బీచ్‌లో లోతు తక్కువగా వుండి, పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. 3.5 కి మీ మేర బీచ్ విస్తరించి ఉన్నప్పటికీ ఒక కి.మీ మాత్రమే పర్యాటక సంస్థ అభివృద్ధి చేసింది. విజయవాడ, హైదరాబాద్‌ల నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది. పర్యాటకాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీచ్ ఒడ్డున 25 ఏసీ రూమ్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వాలీబాల్, కబడ్డీ వంటి బీచ్ గేమ్స్ ఉన్నాయి. జెట్స్కీ (వాటర్ స్కూటర్) బోట్లు ఇక్కడ ప్రత్యేకం. సముద్రంలో నాలుగు నిముషాల పర్యటన కోసం రూ.250 వసూలు చేస్తారు. నాగార్జునసాగర్.... కృష్ణానదీ తీరంలో నాగార్జునసాగర్‌లో చక్కటి బోటింగ్ లాంచ్ స్టేషన్ ఉంది. సాగర్ డ్యామ్ దగ్గర లాంచ్ స్టేషన్ నుంచి నాగార్జున కొండకు పర్యాటకాభివృద్ధి సంస్థ బోట్లు నడుపుతోంది. లాంచ్ స్టేషన్ నుంచి 14 కి.మీ దూరంలోని నాగార్జున కొండకు వెళ్లేందుకు సుమారు 45 నిముషాలు బోట్లో హాయిగా విహారం చేయవచ్చు. నాగార్జునసాగర్ అందాలను చూడడానికి వచ్చిన పర్యాటకులు నౌకా విహారం చేసి నాగార్జున కొండకు వెడతారు. నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయటపడిన క్రీ.పూ 2వ శతాబ్దపు బౌద్ధ అవశేషాలను నాగార్జున కొండ ప్రదర్శనశాల (మ్యూజియం)లో భద్రపరిచారు. నది మధ్యలో ఉన్న పురావస్తుశాఖ ప్రపంచంలోని మ్యూజియాలన్నింటిలోనూ అతిపెద్ద ఐలాండ్ మ్యూజియంగా గుర్తింపు పొందింది. బుద్ధుని విగ్రహంతో పాటు బుద్ధుని దంతావశేషం, కర్ణాభరణం, ఆచార్య నాగార్జునుని యజ్ఞశాల ఇందులో దర్శనమిస్తాయి. బౌద్ధ మతగురువు దలైలామా 2003లో ఇక్కడ బోధివృక్షాన్ని నాటారు. శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి నివసించిన ప్రదేశాన్ని సింహళ విహార్‌గా వ్యవహరిస్తారు. కాగా లాంచ్ స్టేషన్‌కు 8 కి.మీ. దూరంలో ‘అనుపు’లో రంగనాథస్వామి దేవాలయం ఉంది. పర్యాటకుల రద్దీని బట్టి అనుపు దేవాలయం నుంచి నాగార్జున కొండకు బోట్లు నడుపుతారు. కేవలం 15 నిముషాల్లో అనుపు రంగనాథాలయం నుంచి నాగార్జున కొండకు వెళ్లవచ్చు. లాంచ్ స్టేషన్ నుంచి నాగార్జున కొండకు, నాగార్జున సాగర్‌లో 200 మంది కూర్చునే శాంతిశ్రీ, నాగసిరి బోట్లు, 150 మంది కూర్చునే అగస్త్య బోటు, 60 మంది కూర్చునే కృష్ణా బోటు... పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. 45 నిముషాలు నదిలో ప్రయాణించి నాగార్జున కొండకు వెళ్లడానికి రానుపోను పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.90 చెల్లించాల్సి ఉంటుంది. అమరావతిలో... అమరావతిలో అమరలింగేశ్వరుడి దర్శనానంతరం కృష్ణానదిలో పర్యాటకులు విహరిస్తూ ఉంటారు. అయితే అక్కడ ప్రత్యేకంగా బోటింగ్ పాయింట్ లేదు. జాలర్లే బోట్లు, నావలు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని కొద్దిసేపు నదిలోకి తీసుకువెళ్లి తీసుకు వస్తూంటారు. - శ్యామ్ ప్రకాష్ సాక్షి, విజయవాడ శ్రీశైలం... కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో కృష్ణానదీ తీరంలో బోటింగ్ పాయింట్ ఉంది. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న భక్తులు సరదాగా కొద్దిసేపు నౌకా విహారం చేస్తారు. 50 మంది కూర్చునే శబరి, మధుమతి బోట్లు, 25 మంది కూర్చునే భ్రమరాంబ బోటు ఉన్నాయి. ఔత్సాహికులైన పర్యాటకుల కోసం నలుగురు కూర్చునే స్పీడ్‌బోటును కూడా నడుపుతున్నారు. స్పీడు బోటులో ఐదు నిముషాల ప్రయాణానికి రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన బోట్లలో నదిలో సుమారు 20 నిమిషాల సేపు విహరించవచ్చు. ఇందుకుగాను పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.25 ఉంటుంది. -
పుష్కర దానాలు...
1. వెండి, బంగారం, భూమి, ధాన్యం దానంగా ఇవ్వాలి. 2. వస్త్రాలు, గోవులు, మణిమాణిక్యాలు, ఉప్పు దానం చేయాలి. 3. గుర్రం, పాలు, తేనె, పానకం దానమివ్వాలి 4. నెయ్యి, నూనె, పండ్లు, ఆకుకూరలు దానం చేయాలి 5. ధాన్యం, నాగలి, గేదె, ఎద్దు దానంగా ఇవ్వాలి 6. గంధం, కస్తూరి, పచ్చకర్పురం వంటి సుగంధద్రవ్యాలు దానమివ్వాలి. 7. గృహం, శయ్యాదానం. ఉయ్యాల, పీటలాంటి చెక్కతో చేసిన ఉపకరణాలను దానం చేయాలి. 8. కందమూలాలు, పువ్వులు, తియ్యటి పండ్లు దానం చేయాలి 9. రత్నాలు, కంబళ్లు దానమివ్వాలి 10. వెండి, ముత్యాలు, పగడాల దానం చేయాలి. 11. యజ్ఞోపవీతాలు, పుస్తకాలు, వస్త్రాలు, తాంబూల దానం చేయాలి. 12. దశదానాలు, షోడశ మహాదానాలు, సాలగ్రామ దానాలు, ఆమశ్రాద్ధం, అన్నశ్రాద్ధం, హిరణ్యశ్రాద్ధాలను నిర్వహించాలి. -
కృష్ణాతీరంలో పుణ్యక్షేత్రాలు
మన దేశంలో నదీతీరాలలో పుణ్యక్షేత్రాలకు కొదువ లేదు. అన్ని నదుల మాదిరిగానే కృష్ణాతీరంలోనూ అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణానది తీరం పొడవునా పలు ప్రాచీన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో తెలుగునేలలో సుప్రసిద్ధి పొందిన కొన్ని పుణ్యక్షేత్రాల గురించి కృష్ణా పుష్కరాల సందర్భంగా... బెజవాడ కనకదుర్గమ్మ కృష్ణాజిల్లా నడిబొడ్డున విజయవాడ నగరంలో కృష్ణానదీ తీరంలో కొలువుతీరి ఉంది కనకదుర్గ దేవాలయం. దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో బెజవాడ కనకదుర్గ ఆలయం ఒకటి. కనకదుర్గమ్మ ఇక్కడి ఆలయంలో స్వయంభువుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. కీలుడనే యక్షుడు ఇక్కడ తపస్సు చేశాడట. అమ్మవారిని తన హృదయంలో కొలువుండమని కోరుకున్నాడట. ఇక్కడే పర్వతాకారంలో నిరీక్షిస్తూ ఉండమని, కృతయుగంలో రాక్షసవధ తర్వాత కోరిక చెల్లిస్తానని దుర్గమ్మ బాస ఇచ్చిందట. కృతయుగంలో మహిషాసుర సంహారం తర్వాత కీలుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు కీలాద్రిపై వెలసిందట. నాటి నుంచి ఇంద్రాది దేవతలు ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజించడంతో ఈ కొండకు ఇంద్రకీలాద్రిగా పేరువచ్చిందని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ పరమేశ్వరుడిని ప్రతిష్ఠించాలని తలచి వంద అశ్వమేధ యాగాలు చేశాడట. సంతుష్టుడైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగరూపంలో వెలశాడు. బ్రహ్మదేవుడు మల్లి, కదంబ పుష్పాలతో పరమేశ్వరుడిని పూజించడంతో ఇక్కడ కొలువైన పరమశివుడు మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. ద్వాపరయుగంలో అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేయగా, పరమేశ్వరుడు అతడిని పరీక్షించదలచి కిరాతుడి రూపంలో వచ్చి ద్వంద్వ యుద్ధం చేశాడని, అర్జునుడి భక్తికి మెచ్చి అతడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాన్ని సందర్శించిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఇక్కడి జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటాన్ని గమనించి, అమ్మవారి ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునుడిని పునఃప్రతిష్ఠించారు. అప్పటివరకు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశాడు. నాటి నుంచి కనకదుర్గమ్మ శాంతస్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తోంది. శ్రీశైల మల్లన్న భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగా లలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి గల ప్రత్యేకత నిరుపమానం. కృష్ణానదీ తీరంలో సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో నల్లమల అడవుల్లో వెలసిన ఈ పురాతన పుణ్యక్షేత్రంలో పరమశివుడు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబికగా వెలిశారు. ఇక్కడి గిరిజనులు మలన్నను తమ అల్లుడిగా, భ్రమరాంబికను తమ కుమార్తెగా భావిస్తారు. మల్లన్న, భ్రమరాంబల రథోత్సవం వారి చేతుల మీదుగానే జరగడం ఇక్కడి ఆనవాయితీ. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండవులు ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారని ప్రతీతి. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారిని స్తుతిస్తూ భ్రమరాంబికాష్టకం, పరమేశ్వరుడిని స్తుతిస్తూ శివానందలహరి విరచించారని కూడా ప్రతీతి. ఇక్కడ తపస్సు చేసిన శిలాదుడనే మహర్షికి పరమశివుడి అనుగ్రహం వల్ల పర్వతుడు, నందీశ్వరుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పర్వతుడు శివుడి కోసం తపస్సు చేసి, స్వామిని మెప్పించాడట. పర్వతుడి కోరిక మేరకు అతడిని కొండగా మార్చి, పరమశివుడు అక్కడే కొలువై ఉండిపోయాడట. కైలాసంలో ఒంటరిగా మిగిలిన పార్వతీదేవి, ప్రమథ గణాలు స్వామివారిని వెదుక్కుంటూ వచ్చి, వారు కూడా ఇక్కడే కొలువయ్యారని స్థలపురాణం చెబుతోంది. అలాగే, చంద్రవంశపు రాజు చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతిని అనుగ్రహించిన పరమశివుడు ఆమె కోరిక మేరకు ఆమె అర్చించిన మల్లెపూల దండను శిరస్సుపై ధరించి, మల్లికార్జునుడయ్యాడని కూడా ప్రతీతి. మొవ్వలో మువ్వగోపాలుడు కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో మువ్వగోపాలుడు వెలశాడు. ఆయన భక్తుడైన వాగ్గేయకారుడు క్షేత్రయ్య మువ్వగోపాలుడిపై పదాలు అల్లాడు. సంప్రదాయ సంగీత ప్రపంచంలో అవి క్షేత్రయ్య పదాలుగా ప్రసిద్ధి పొందాయి. ఆ భాగవతోత్తముడికి గుర్తుగా మువ్వగోపాలుడి ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి ఎదురుగా నిలువెత్తు క్షేత్రయ్య విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. భక్తి, శృంగార రసాలతో స్వామిని కీర్తిస్తూ క్షేత్రయ్య రచించిన పదాలను సంగీతకారులు నేటికీ ఆలపిస్తూనే ఉన్నారు. ఆయన పదాలకు నర్తకులు నేటికీ నాట్యమాడుతూనే ఉన్నారు. మొవ్వ గ్రామానికి చేరువలోనే ఉన్న కూచిపూడి తెలుగు సంప్రదాయ నృత్యమైన కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లు. మొవ్వకు రెండు గంటల దూరంలో మంగళగిరికి చేరువలో ఉన్న కాజ గ్రామం నారాయణ తీర్థుల జన్మస్థలం. నారాయణ తీర్థులు విరచించిన తరంగాలు కూడా నేటికీ సంగీత, నృత్యాభిమానులను ఓలలాడిస్తూనే ఉన్నాయి. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు కృష్ణాజిల్లాలో విజయవాడకు చేరువలోని మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. సర్పదోష నివారణకు, రాహుకేతు దోషనివారణకు ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. చర్మవ్యాధులు ఉన్నవారు ఈ ఆలయంలో పూజలు చేస్తే నయమవుతాయనే నమ్మకం ఉంది. అలాగే, సంతానం లేని దంపతులు ఈ ఆలయ ప్రాంగణంలో ఒకరోజు నిద్ర చేస్తే వారికి తప్పక సంతానం కలుగుతుందని కూడా భక్తులు నమ్ముతారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు స్థలపురాణం చెబుతోంది. అగస్త్య మహర్షి ఈ క్షేత్రాన్ని దర్శించుకుని, సుబ్రహ్మణ్యేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో అర్చించుకున్నాడని ప్రతీతి. వేదాద్రి లక్ష్మీనరసింహుడు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు గ్రామానికి చేరువలో కృష్ణానదీ తీరాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరూపాత్మకుడిగా వెలశాడు. జ్వాలా సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇక్కడ పర్వతశిఖరంపై స్వామి జ్వాలానరసింహ స్వామిగా స్వయంభువుగా వెలశాడు. కృష్ణానది ఒడ్డున సాలగ్రామ నరసింహస్వామిగా, ఆలయ ప్రాంగణంలో యోగానంద నరసింహస్వామిగా, లక్ష్మీనరసింహస్వామిగా వెలసిన స్వామివారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. వేదాద్రికి చేరువలోని గరుడాద్రిపై స్వామి వీరనరసింహస్వామిగా వెలసి భక్తుల పూజలందుకుంటున్నాడు. శ్రీకాకుళ శ్రీమహావిష్ణువు కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో కృష్ణానదికి పశ్చిమ తీరాన శ్రీకాకుళం గ్రామంలో శ్రీమహావిష్ణువు శ్రీకాకుళేశ్వరుడిగా వెలశాడు. దక్షిణాదిని పరిపాలించిన తొలి తెలుగు ప్రభువులు శాతవాహనుల రాజధాని ఇదే. ఇక్కడ దక్షిణ హస్తంలో శంఖం, వామహస్తంలో చక్రం, కంఠంలో సాలగ్రామమాల ధరించిన శ్రీమహావిష్ణువు రూపం అత్యంత ప్రసన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి మెడలో కనిపించే మాల వంటి సాలగ్రామ మాలలు తిరుపతి, ర్యాలి దేవాలయాల్లో మాత్రమే కనిపిస్తాయి. అనంత దండ భూపాలుడు ఈ దేవాలయానికి రాజగోపురం నిర్మించాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయ ప్రాంగణంలోనే ‘ఆముక్తమాల్యద’ రచించాడు. కొండంత కోటప్ప గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై పరమశివుడు త్రికూటేశ్వరుడిగా వెలశాడు. నరసారావుపేటకు వాయవ్యాన 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం అసలుపేరు కొండకావూరు. జనాల వాడుకలో ఇది కోటప్పకొండగా స్థిరపడింది. ఈ క్షేత్రంలో వెలసిన 687 అడుగుల భారీ పరమశివుని విగ్రహాన్ని చూడాలంటే తల పెకైత్తాల్సిందే. గుండరాయలు అనే రాజు 18వ శతాబ్దిలో కొండపై ఉన్న ఈ ఆలయానికి 703 మెట్లతో మార్గాన్ని నిర్మించాడు. రుద్రశిఖరం, విష్ణుశిఖరం, బ్రహ్మశిఖరం అనే మూడు శిఖరాల నడుమ వెలసినందున ఇక్కడ పరమశివుడు త్రికూటేశ్వరుడిగా పేరు పొందాడు. రుద్రశిఖరం మీద ఉన్న చిన్న దేవాలయంలో త్రికూటేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. దాదాపు 1600 అడుగుల ఎత్తున ఉన్న కోటప్ప కొండపై దేవాలయానికి ఎదురుగా ఎనిమిది చిన్న చిన్న కొలనులతో పాటు కొండపై మరిన్ని కొలనులు కూడా ఉండటం విశేషం. ఈ కొండ మీదకు ఎన్నో రకాల పక్షులు వస్తూ ఉంటాయి. అయితే, ఒక్క కాకి కూడా కనిపించదు. ఒక ముని శాపం కారణంగా ఇక్కడకు కాకులు రావని చెబుతారు. మంగళగిరి పానకాల నరసింహుడు బెజవాడ కనకదుర్గ ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి కొండ మీద లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. నరసింహుడు ఇక్కడ పానకాల స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. భక్తులు ఇక్కడ నిత్యం స్వామికి పానకాన్ని నివేదిస్తారు. స్వామి సంతోషంగా పానకాన్ని సేవిస్తాడు. స్వామి పానకం సేవిస్తున్నప్పుడు గుటక వేసిన శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. స్వామి నోటిలో పోసిన పానకంలో సగం బయటకు వచ్చేస్తుంది. అయితే, స్వామి నోటిలో పోసిన పానకం ఎక్కడకు వెళుతోందో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యమే. పానకం తయారీకి నిత్యం బెల్లం వినియోగిస్తున్నా ఇక్కడ ఒక్క ఈగ కూడా కనిపించకపోవడం ఈ క్షేత్రంలోని మరో విచిత్రం. వైకుంఠవాసుడి వైకుంఠపురం కృష్ణా-గుంటూరు జిల్లాల సరిహద్దులో కృష్ణాతీరాన క్రౌంచపర్వతంపై శ్రీవేంకటేశ్వరుడు అలమేలుమంగా సమేతంగా వెలశాడు. వైకుంఠవాసుడు వెలసిన ఈ గ్రామం వైకుంఠపురంగా ప్రసిద్ధి పొందింది. కాకతీయుల కాలంలో చిన్న రమణ, పెద్ద రమణ అనే సోదరులకు వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి, అమరావతికి ఈశాన్యంగా ఉన్న కొండపై తాను వెలసినట్లు చెప్పాడట. ఉదయమే ఆ సోదరులు అక్కడకు వెళ్లి చూడగా స్వామివారు సాలగ్రామరూపంలో దర్శనమిచ్చారట. కొండపై స్వామివారు వెలసిన గుహ చుట్టూ కొండవీటి రాజులు ముఖమండపాన్ని నిర్మించారు. ఆ తర్వాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పూర్తిస్థాయిలో ఆలయ నిర్మాణం చేసి, మహారాజ గోపురం నిర్మించారు. అమరేశ్వరుడి అమరారామం గుంటూరు జిల్లాలో కృష్ణాతీరంలోని అమరావతి గ్రామంలో పరమశివుడు అమరేశ్వరుడిగా వెలశాడు. దేశంలోని పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన అమరావతినే ధాన్యకటకం అని, ధరణికోట అని కూడా పిలుస్తారు. బౌద్ధుల ప్రాభవానికి నిదర్శనంగా ఇక్కడ సుప్రసిద్ధ బౌద్ధస్థూపం నేటికీ నిలిచి ఉంది. శాతవాహనులు అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించారు. అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుడు పాలరాతి శివలింగంగా వెలశాడు. అమరేశ్వరుడు ఇక్కడ బాలాచాముండీ సమేతంగా పూజలందుకుంటున్నాడు. శివలింగం పైభాగాన ఎర్రని చారిక కనిపిస్తుంది. లింగం పెరిగిపోతుండటంతో పైన శీల వేశారని, అప్పుడు చిందిన రక్తమే నేటికీ ఎర్రగా కనిపిస్తోందని చెబుతారు. ఆలంపురి జోగులాంబ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపురంలో నల్లమల అడవులకు చేరువలో కృష్ణా, తుంగభద్రా నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో జోగులాంబ కొలువై ఉంది. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపురి జోగులాంబ ఆలయం అత్యంత పురాతన క్షేత్రం. స్కాంద పురాణంలో ఈ శక్తిపీఠం ప్రస్తావన ఉంది. ఇక్కడ పరమశివుడు బ్రహ్మేశ్వరుడిగా, అమ్మవారు జోగులాంబగా వెలశారు. శైవులకు, శాక్తేయులకు ఇది అత్యంత పవిత్ర క్షేత్రం. ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు జోగులాంబను ఆరాధించేవారని ప్రతీతి. ఆలంపురంలో జోగులాంబ శక్తిపీఠంతో పాటు, క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో బాదామి చాళుక్యులు నిర్మించిన పురాతన నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయగా, పరమశివుడు ప్రత్యక్షమై అతడికి సృష్టించే శక్తిని ప్రసాదించాడని స్కాందపురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ వెలసిన పరమశివుడు బ్రహ్మేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. కూడలసంగమనాథుడు కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో కూడలసంగమ గ్రామంలో కృష్ణాతీరాన సంగమనాథుడిగా వెలసిన పరమశివుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. అచేశ్వరుడికి, కాళేశ్వరుడికి అంకితం చేస్తూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి పురాతన శాసనాల ద్వారా తెలుస్తోంది. పన్నెండో శతాబ్దికి చెందిన జఠావేద ముని సంగమనాథుడు ఇక్కడ విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన శిష్యులైన బసవేశ్వరుడు, చన్న బసవన్న, అక్కనాగమ్మ ఈ ప్రాంతంలో వీరశైవాన్ని ప్రచారం చేశారు. కూడల సంగమనాథుని ఉద్దేశించి బసవేశ్వరుడు రచించిన వచనాలు కన్నడ సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందాయి. బీచుపల్లి ఆంజనేయుడు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి గ్రామంలో కృష్ణానదీ తీరం వద్ద ఆంజనేయుడు వెలశాడు. శ్రీకృష్ణదేవరాయల గురువుల్లో ఒకరైన వ్యాసరాయస్వామి ఉత్తరభారత యాత్రను ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో బీచుపల్లి వద్ద అనుష్ఠానాలు కావించుకుంటున్నప్పుడు యోగదృష్టితో ఒక బండరాతి కింద ఆంజనేయస్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. విగ్రహాన్ని వెలికితీయించిన తర్వాత విగ్రహానికి నదిలో స్నానం చేయించి, విగ్రహాన్ని కనుగొన్న చోటనే నిలిపి ఉంచారు. సూర్యోదయానికి ముందు ఆ విగ్రహం వద్దకు ఎవరు వస్తారో, వారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పి గ్రామస్థులను అక్కడ కాపలాగా ఉంచారు. మరునాటి వేకువన ఒక బోయ బాలుడు మేకలను తోలుకుంటూ విగ్రహం వద్దకు వచ్చాడు. గ్రామస్థులు అతడిని స్వామివారి వద్దకు తీసుకురాగా, స్వామివారు అతడికి మంత్రోపదేశం చేసి, ఆంజనేయుడికి పూజారిగా నియమించారు. అప్పటి నుంచి బోయవారే ఈ ఆలయానికి పూజారులుగా ఉంటూ వస్తున్నారు. గద్వాల రాజులు ఈ ఆలయానికి ప్రాకారాన్ని నిర్మించి, పూజారులకు జీవనభృతి కల్పించారు. మహాబలేశ్వర్‌లో కృష్ణమ్మగుడి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పడమటి కనుమల నడుమ ఉన్న మహాబలేశ్వర్ కృష్ణానది జన్మస్థానం. కొండశిఖరంపై కృష్ణానది పుట్టిన స్థలంలో రత్నగిరి రాజులు కృష్ణమ్మకు ఆలయాన్ని నిర్మించారు. కృష్ణా నదీమాతను మరాఠీలు ‘కృష్ణాబాయి’గా పిలుచుకుంటారు. అందువల్ల ఇది కృష్ణాబాయి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. అశ్వత్థమూలంలో జన్మించిన కృష్ణానది శివలింగం మీదుగా గోముఖం నుంచి వెలువడి, దిగువన నిర్మించిన రాతికుండంలోకి చేరుతుంది. అశ్వత్థమూలాన్ని విష్ణుపాదంగా భావిస్తారు. విష్ణుపాదం నుంచి పుట్టిన గంగ శివుని శిరస్సుపైకి చేరినట్లే, ఇక్కడ కృష్ణానది శివలింగాన్ని అభిషేకిస్తూ సన్ననిధారగా ప్రవహిస్తుంది. మహాబలేశ్వర్‌లోని మహాబలేశ్వర ఆలయం, దీనికి చేరువలోనే వెన్నా, కోయినా, సావిత్రి, గాయత్రి నదులు కృష్ణానదిలో చేరే చోట వెలసిన పంచగంగా ఆలయం చాలా పురాతనమైనవి. దేవగిరిని పాలించిన యాదవరాజులు ఇక్కడ పంచగంగా ఆలయాన్ని నిర్మించారు. -
విధులు - నిషేధాలు
విధులు బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే సమయంలో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలలో అందరూ ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అనేవి తెలుసుకోవాలి. పుష్కరప్రవేశ సమయంలో మూడున్నర కోట్ల నదులు అదృశ్యంగా కృష్ణానదిలో ప్రవేశిస్తాయి. కనుక పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, అన్ని కులాల వారు తప్పకుండా పన్నెండు రోజుల్లో ఒక రోజయినా పుష్కరస్నానం చెయ్యాలి. పన్నెండు రోజులూ చేస్తే మరీ మంచిది. నదిలోకి దిగబోయేటప్పుడు మూడు చిటికెలు గట్టు మీద మట్టి కృష్ణలో వేస్తూ, ‘పిప్పలాద సముత్పన్నే! కృత్సే! లోకభయంకరి! మృత్తికాంతే మయాదత్తాం ఆహారార్థం ప్రకల్పయేత్’ అనే శ్లోకం చదవాలి. స్నానానికి కృష్ణానది అనుమతి తీసుకోవాలి. ‘కన్యాగతే దేవగురౌ పితౄణాం తారణాయ చ సర్వ పాప విముక్త్యర్థం తీర్థస్నానం కరోమ్యహమ్’ అని ప్రార్థించాలి. పుష్కర స్నానం పూర్తి అయ్యాక గట్టు మీద కృష్ణకు, బృహస్పతికి, పుష్కరునికి షోడశోపచార పూజ చెయ్యాలి. మంత్రాలు, భగవన్నామస్మరణ జపం చెయ్యాలి. చేసేరోజును బట్టి దానాలు చెయ్యాలి. తరువాత తల్లిదండ్రులు లేనివారు పితృదేవతలకు పిండప్రదానం చెయ్యాలి. దూరం నుంచి వచ్చినవారు హిరణ్య శ్రాద్ధం (పదార్థాలు ఇవ్వడం) పెట్టాలి. తీరవాసులు అన్నశ్రాద్ధం పెట్టాలి. పురుషులు క్షౌరం చేయించుకుంటే పుణ్యప్రదం. స్నానం వస్త్రంతోనే చెయ్యాలి. ప్రవాహానికి ఎదురుగా మూడు మునకలు వేసి, సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రవాహానికి వాలుగా మూడు మునకలు వెయ్యాలి. దంపతులైతే ఇద్దరూ కలిసి మునగాలి. స్త్రీలు ముఖానికి పసుపు రాసుకుని స్నానం చెయ్యాలి. పసుపు, కుంకుమ రవికలగుడ్డ కృష్ణానదికి సమర్పించాలి. స్నానం చేసి దోసిట్లోకి నీళ్లు తీసుకుంటూ బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రాది దేవతలు, వాలఖిల్యాది సప్తఋషులు, పితృదేవతలు, బృహస్పతి, పుష్కరుడు, గంగాది మహానదులు, కృష్ణవేణి, వశిష్ఠాది మునులు, సూర్యుడు వీరందరినీ వరుసగా తలచుకుంటూ నీళ్లు వదలాలి. నిషేధాలు... నదిలో కాలకృత్యాలు, దంతధావనం చెయ్యకూడదు. వస్త్రాలు లేకుండా స్నానం చెయ్యరాదు. సంకల్పం తనలో తానైనా చెప్పుకోకుండా ఊరికే మునగరాదు. ఆరు నెలల లోపు శుభకార్యాలు చేసి ఉన్న వారు పుష్కర శ్రాద్ధం చేయకూడదు. గట్టు మీద మట్టి చిటికెడు మించి నదిలో వేయరాదు. నదీతీరానికి పన్నెండు మైళ్ల లోపల ఎక్కడైనా శ్రాద్ధాది కార్యక్రమాలు చేయవచ్చు. తల్లి మరణించి తండ్రి ఉన్నవారు పుష్కర శ్రాద్ధం పెట్టరాదు. పుష్కరాలను, కృష్ణానదిని హేళనగా నిందించరాదు. పుష్కర స్నానానికి వచ్చిన జన సమూహాన్ని చూసి నమస్కరించాలి కాని అవమానించరాదు. కృష్ణానది అంతటా పుష్కర ప్రవేశం జరుగుతుంది కనుక అందరూ ఒకే చోట గుమికూడి స్నానం చేసి తొక్కిసలాటలో నదిని కలుషితం, అపవిత్రం చేయరాదు. ఈ పన్నెండు రోజులు ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. దానధర్మాలు చేయటానికి సందేహించరాదు. తీర్థరాజ! నమస్తుభ్యం సర్వలోకైకపావన! త్వయిస్నానం కరోమ్యద్య భవబంధ విముక్తయే॥ - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
సారెలో బందరు లడ్డు ఉండాల్సిందే...
బందరు కోనేరు సెంటర్... ఈ పేరు చెప్పగానే ఎంతటివారికైనా నోరూరాల్సిందే...షుగర్ పేషెంట్లను కూడా ఆ వాసన విడిచిపెట్టదు...ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ రుచి చూసేద్దాంలే అనుకుంటారు...అదే బందరు లడ్డు సెంటరు.. ఒక స్వీటు ఆ ఊరి పేరుతో ప్రసిద్ధి కావడం విశేషమే కదా... బందరు లడ్డుగా ప్రసిద్ధి చెందిన ఆ లడ్డు అసలు పేరు తొక్కుడు లడ్డు. ఈ లడ్డూని శనగ పిండితో తయారు చేస్తారు. దీని తయారీకి చాలాసేపే పడుతుంది. తయారుచేసి నోట్లో వేసుకున్నాక శ్రమ అంతా మర్చిపోవలసిందే. అక్కడి తాతారావు స్వీట్ దుకాణంలో బందరు లడ్డు కొనడానికి జనం ఎగబడతారు. దుకాణానికి ముందు వైపు మోడరన్ గ్లాసుతో డిజైన్ చేసి ఉంటుంది. లోపల ఇంటీరియర్ చాలా విలక్షణంగా ఉంటుంది. ఎడమ పక్కన గోడ మీద డజన్ల కొద్దీ సర్విసెట్టి సత్యనారాయణ తాతారావు చిత్తరువులు ఉంటాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జగ్జీవన్‌రామ్... వంటి పెద్దలంతా ఆయన దుకాణంలోని బందరు లడ్డూ అభిమానులు. వారు నిత్య కస్టమర్లు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి బందరు లడ్డు మీద ఎనలేని ప్రేమ. ‘‘ఈ దుకాణాన్ని మా మామగారు 1951లో ప్రారంభించారు’’ అని చెప్పే తాతారావు బందరు లడ్డూ దుకాణాలను విస్తృత పరిచారు. విచిత్రమేమంటే ఈ లడ్డు తయారీ విధానాన్ని ఇక్కడకు తీసుకువచ్చినవారు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు. వాళ్లని సింఘ్స్ లేదా బొందిలీలు అంటారు. బందరులో స్థానికంగా ఉండేవారు వీరి దగ్గర తయారీ విధానం తెలుసుకున్నారు. వలస వచ్చిన ఉత్తర భారతీయులు ఈ లడ్డు తయారీని క్రమేపీ విడిచిపెట్టేశారు. స్థానికంగా ఉన్న బందరు వాస్తవ్యులు మాత్రం దీన్ని అందిపుచ్చుకున్నారు. ‘‘మా దగ్గర తయారయ్యే లడ్డూలు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నాయి. ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడకు మా లడ్డూలు ప్రయాణిస్తాయి. బందరు లడ్డు తయారీ సామాన్యం కాదు. చాలా శ్రమతో కూడిన పని. అసలు సిసలైన ఘుమఘుమలాడే మధురమైన రుచి రావడానికి కనీసం ఆరేడు గంటల సమయం పడుతుంది’’ అంటూ వివరిస్తారు. మామూలు రుచి రావడానికి ఎక్కువ సమయం అవసరం లేదనే విషయాన్ని పరోక్షంగా చెబుతారు తాతారావు. తయారీ విధానంలో ఎటువంటి మార్పూ తీసుకు రాకపోవడమే తన విజయ రహస్యం అంటారు తాతారావు. ఏ విధంగా తయారుచేస్తారో చూడాలనుకునేవారిని ఆప్యాయంగా వంటగదిలోకి తీసుకువెళ్లి, అన్నీ వివరిస్తూ చూపుతారు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు లేకుండా అయినా పెళ్లి అవుతుందేమోకాని, బందరు లడ్డు లేకుండా ఇక్కడ ఏ శుభకార్యమూ జరగదు అని చెబుతారు అక్కడి పనివారు. పెళ్లికి చిలకలపూడి వెళ్లాల్సిందే... బంగారం కొనాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి... మరి పెళ్లిళ్లకీ, పేరంటాలకీ నగలు లేకుండా వెళ్లడం ఎలా... మధ్యతరగతి వారికి నిరంతరం ఈ సమస్య వెంటాడుతూ ఉంటుంది...ఆ సమస్య నుంచి పుట్టినదే చిలకలపూడి బంగారం... బంగారుపూతతో తయారైన నగలకు చిలకలపూడి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 200 వరకు యూనిట్లు ఉన్నాయి. 30,000 మంది దాకా ఇందులో పనిచేస్తున్నారు. ఇక్కడ బంగారుపూతతో తయారయ్యే నగలను చిలకలపూడి బంగారు నగలు అంటారు. ఇక్కడ గాజులు, గొలుసులు, నెక్లెస్‌లు, చెవి రింగులు, జుంకీలు, డ్యాన్స్ నగలు, అన్ని రకాల రాళ్లతో తయారయిన నగలు విస్తృతంగా అమ్ముతారు. కృష్ణాజిల్లా కేంద్రం బందరు కూడా రోల్డ్‌గోల్డ్ నగలకు పేరుపొందిన పట్టణమే. బందరులో అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. రోల్డ్ గోల్డ్ నగలు ఇక్కడ విస్తృతంగా తయారుచేస్తారు. 125 సంవత్సరాల క్రితం అప్పలాచారి అనే ఒక స్వర్ణకారుడు, బందరు నుంచి చిలకలపూడికి వలస వెళ్లి అక్కడ మొట్టమొదటగా బంగారుపూతతో నగలు తయారుచేయడం ప్రారంభించారు. బంగారు నగలు కొనే స్థోమత లేనివారి కోసం ఈ నగలు తయారుచేయడం ప్రారంభించారు. 1800 ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించిన మొదట్లో వెండి మీద బంగారు పూత పూసిన నగ లు అమ్మేవారు. వాటిని ‘కట్టు నగలు’ అని పిలిచేవారు. ఆ తరువాత రాగి మీద బంగారుపూత పూసి తయారుచేసేవారు. 1940 ప్రాంతంలో తోట వెంకట సుబ్బయ్య ‘ఉమ గిల్ట్’ నగల తయారీ ప్రారంభించి దేశవ్యాప్తం చేశారు. ఆ నగలకు ‘ఉమా గోల్డ్ నగలు’ అనే గుర్తింపు తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా ఉమా నగల దుకాణాలు వెలిశాయి. ఈ ఇమిటేషన్ బంగారు నగల వ్యాపారం రూ. 500 కోట్ల టర్నోవర్ దాటింది. కానీ ప్రస్తుతం ఇవి వన్నె తగ్గుతున్నాయి. తమిళనాడు, గుజరాత్ల నుంచి ముడిసరుకు తెచ్చుకోవలసి రావడంతో లాభాలు తగ్గుతున్నాయి. ఇవే కాకుండా వీటి వన్నె తగ్గడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రపంచంలోనే మొట్టమొదటి ఇమిటేషన్ బంగారాన్ని కనిపెట్టిన ఘనత బందరుది, చిలకలపూడిది. డా.వైజయంతి వేదవ్యాసుడు రచించిన ‘స్కాందపురాణం’లోని ఆరు సంహితలలో మొదటిది సనత్కుమార సంహిత. ఇందులో మొదటి ఖండం... సహ్యాద్రి ఖండం. దీనిలో కృష్ణా నది మహాత్మ్యాన్ని అద్భుతంగా వివరించారు. -
పుష్కరాలు... ఆరోగ్య జాగ్రత్తలు
ఎక్కువ సంఖ్యలో గుమిగూడటం (క్రౌడింగ్) పుష్కర సమయంలో కొద్దిపాటి స్థలంలోనే జనం గుంపులుగా చేరతారు. దాంతో తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే కిందపడినవాళ్లు గాయపడే అవకాశమూ ఉంది. జనసమ్మర్దం కిక్కిరిసిన చోట భారీ స్థాయిలో తొక్కిసలాటలు జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలా జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు కలుషితం కావడం ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడే చోట్లలో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఇది జరిగితే ఆ కలుషితమైన నీళ్లను తాగిన వారికి నీళ్ల విరేచనాలు, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తాగే నీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం కలుషితం కావడం పెద్ద సంఖ్యలో జనం చేరిన చోట అందరికీ ఆహారం సమకూర్చడం కష్టమవుతుంది. అయితే ఆహారాన్ని అందించే హోటళ్ల వంటి చోట్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా ఉంటుంది కాబట్టి శుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు హోటళ్లు, క్యాంటిన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశుద్ధ్యం ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు పారిశుద్ధ్యం (శానిటేషన్) వసతులు కష్టం. అలాంటి పరిస్థితుల్లో పుష్కరాలకు వచ్చే జనం ఆరుబయట మలమూత్ర విసర్జనల వంటి చర్యలకు పాల్పడితే పరిసరాలు మరింత దుర్గంధమయంగా మారి కలుషితమవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తగిన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. దోమల నుంచి రక్షణ ఎక్కువ సంఖ్యలో ప్రజలు చేరే చోట్లలో నీరు మురికిగా మారి దోమల పెరుగుదలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల తగిన పారిశుద్ధ్య చర్యలు చేపడితే దోమలను, వాటి వల్ల ప్రబలే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి అవకాశం ఎక్కువ. కానీ చాలా పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఒకింత కష్టమే. అయినప్పటికీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. డయాబెటిక్ రోగులు జనాలు కిక్కిరిసి ఉండే పరిస్థితుల్లో అంటు వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. పైగా డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారిలో రోగినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్లకు వచ్చే వారిలో వృద్ధులు, పిల్లలు, డయాబెటిస్ రోగులు జాగ్రత్తగా ఉండాలి. టీకాలు ఇలాంటి చోట్ల ప్రబలే వ్యాధులను గుర్తించి ముందుగానే అవసరమైన టీకాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయవచ్చు. గుండెజబ్బులు ఉన్నవారు గుండెజబ్బులు ఉన్నవారు పుష్కరాలకు వెళ్లదలిస్తే, ముందుగా డాక్టర్లను సంప్రదించి, వారు సూచించిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీలో ఊపిరాడక గుండెజబ్బులు ఉన్నవారు స్పృహ తప్పినప్పుడు కార్డియో పల్మునరీ రీససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియను చేపట్టాలి. గర్భిణులకు / మహిళలకు ఇలాంటి ప్రదేశాల్లో గర్భిణులు గుంపులో చిక్కుబడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకు తగినన్ని సబ్బులను అందరికీ అందుబాటులో ఉంచాలి. చల్లారిన ఆహారం తీసుకోవద్దు చల్లగా ఉండే పాలు తాగకూడదు. వేడిగా ఉన్న పాలనే తాగాలి. అలాగే చల్లారిపోయిన, నిల్వ ఉన్న ఆహారాన్ని పరిహరించాలి. అందుబాటులో అంబులెన్స్‌లు గాయపడ్డవారిని, స్పృహతప్పిన వారిని సత్వరమే ఆసుపత్రికి చేర్చడం కోసం అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి. వారిని ఇలా పట్టుకోవాలి స్పృహతప్పిన వారిని ఆసుపత్రికి చేరవేసేందుకు ఎత్తినప్పుడు, మిగతా శరీర భాగాలకంటే తల కాస్త కిందికి ఉండేలా ఎత్తుకొని తీసుకురావాలి. దీనివల్ల రక్తపోటు పడిపోయిన వారికి, భూమ్యాకర్షణ వల్ల మెదడుకు తగినంత రక్తసరఫరా జరుగుతుంది. ఫలితంగా వారు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అంబూబ్యాగ్‌లు అవసరం ఊపిరి అందక స్పృహ తప్పినప్పుడు వారికి తక్షణం ఊపిరి అందేలా చేయడానికి ‘అంబూ బ్యాగ్’ అనే ఉపకరణంతో శ్వాస అందించేందుకు ప్రయత్నం చేస్తారు. జనం పెద్ద ఎత్తున చేరే చోట్లలో తగినన్ని అంబూబ్యాగ్స్ను ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. జన్మస్థానమైన మహాబలేశ్వరం వద్ద కృష్ణానదిని ‘కృష్టాబాయి’ అని పిలుస్తారు. కృష్ణా నది పుట్టుక, మహిమల గురించిన ప్రస్తావన భాగవత, మార్కండేయ, వామన, నారద, వరాహ, బ్రహ్మాండపురాణాలతో పాటు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. -
సాంకేతిక ‘పుష్కరం’
– కృష్ణా పుష్కరాలలో ఆధునిక, సాంకేతికత వినియోగం – వైఫై, ఎఫ్ఎం సేవలు – సీసీ కెమెరాలు, ఎల్ఈడీ వెలుగులు – పోలీస్‌శాఖ తయారు చేసిన యాప్‌లో సమగ్ర సమాచారం నిక్షిప్తం మహబూబ్‌నగర్ క్రైం: ఇదివరకు జరిగిన పుష్కరాలు ఒక ఎత్తయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలు మరొ ఎత్తుకానున్నాయి. జిల్లాలో 2004 నిర్వహించిన కృష్ణా పుష్కరాలలో కేవలం 3ఘాట్లు ఉంటే బీచుపల్లి, రంగపూర్, సోమశిల, అలంపూర్‌లో ప్రధానఘాట్లుగా గుర్తించారు. ఇందులో బీచుపల్లిలో మాత్రమే భక్తుల రద్దీ ఉండేది. అప్పట్లో ఫోన్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడా కనిపించేది కాదు. కానీ ప్రస్తుతం సాంకేతిక, ఆధునిక అంశాలను మేళవించి కృష్ణా పుష్కరాలను నిర్వహించేందుకు అధికారయంత్రాంగం, పోలీస్‌శాఖ సన్నద్ధమైంది. కనివినీ ఎరుగని రీతిలో పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొబైల్ యాప్.. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో స్పార్క్ 10 కంప్యూటర్ సాప్ట్వేర్ కంపెనీ సీఈఓ అటల్ మాల్వీయ, హరి భరద్వాజ్ కలిసి కొత్త యాప్‌ను తయారు చేశారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి మహబూబ్‌నగర్ కృష్ణ పుష్కరాలు 2016 టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ ఉన్న వారు యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30నుంచి 50సెకన్లలో యాప్ డౌన్లోడ్ అవుతుంది. పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన యాప్‌లో సమస్త సమాచారాన్ని పొందుపరిచారు. ఇందులో పుష్కరం అంటే ఏమిటి? పార్కింగ్ ప్రదేశాలకు, స్నానఘాట్లకు ఎలా వెళ్లాలి, జిల్లాలో ఉండే ఘాట్లు, వాటికి వెళ్లే రోడ్డుమార్గాల వివరాలు పొందుపరిచారు. ఆరోగ్య కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు, వివిధ రకాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లే విధానం, బస్సు, రైళ్ల వివరాలు 15రకాల సేవల వివరాలు ఉంటాయి. ఘాట్ల వద్ద రద్దీని తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఘాట్ల వద్ద అవసరమయ్యే అత్యవసర సేవల వివరాలు, సెల్‌ఫోన్ నంబర్లు యాప్‌లో ఉన్నాయి. ఫైర్, పోలీస్, వైద్య సేవలు ఘాట్ల వారీగా పొందుపరిచారు. ప్రతి గంటకు ఘాట్ల వద్ద ఉన్న సమాచారం యాప్ కింద స్క్రోలింగ్ తాజాల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఘాట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినుబండారాల వివరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మలపై నొక్కితే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సమాచారం వస్తుంది. ఎల్ఈడీ వెలుగులు కృష్ణానది తీర ప్రాంతమంతా ఎల్ఈడీ దీపాల వెలుగుల్లో నిండిపోనుంది. 50మీటర్ల వరకు వెలుగులు ఇచ్చేలా 16మీటర్ల ఎత్తున స్తంభాలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన 19ఘాట్లలో 150స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో దానికి 200వాట్స్ సామర్థ్యం ఉన్న ఎనిమిది ఎల్ఈడీ దీపాలను అమర్చుతున్నారు. ఫేస్బుక్లో అప్డేట్స్ స్నాన ఘాట్ల వద్ద పరిస్థితిని, భక్తుల రద్దీ ఫొటోలు, వీడియోలు, పుష్కరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఫేస్బుక్లో అఫ్లోడ్ చేయనున్నారు. ప్రస్తుతం ఘాట్ల వద్ద అభివృద్ధి పనులకు సంబంధించిన ఫొటోలు, పత్రికలు, ఛానల్స్‌లలో వచ్చే కథనాలను అప్లోడ్ చేయనున్నారు. పుష్కరాలకు రాని దేశ, విదేశాల్లో ఉన్న వారు ఇక్కడ విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పోలీస్ శాఖ నుంచి ఝ్చజ్చిbubn్చజ్చట ఞౌlజీఛ్ఛిజుటజీటజిn్చ puటజిజ్చుట్చlu2016 పేరుతో ఫేస్బుక్ ఖాతా తయారుచేశారు. ఇందులో ఘాట్స్ వాటికి వెళ్లే మార్గలు, ట్రాఫిక్, పరంగా ఎప్పటికప్పుడు సూచనలు పొందిపరుస్తున్నారు. జీపీఎస్‌తో సమాచారం పుష్కరాల సమయంలో వచ్చే బస్సుల వివరాలను జీపీఎస్ ద్వారా పరిశీలించనున్నారు. తద్వారా బస్సులు ఎక్కడ ఉన్నాయి.. ఎంత దూరంలో ఉన్నాయి ఎంత సమయానికి చేరుకుంటాయనే విషయాలను పరిశీలిస్తారు. ప్రయాణికులు బస్సుల రాకపోకల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వాచ్ టవర్లు, డ్రోన్లు జిల్లాలో ఏడు ప్రధాన ఘాట్ల వద్ద వాచ్టవర్లను ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా స్నానఘాట్ల వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో ఘాట్ల వద్ద రద్దీని, ట్రాఫిక్ పరిస్థితిని గమనిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ వాచ్టవర్లు, డ్రోన్ల ద్వారా దాదాపు అర కిలోమీటరు వరకు చూసే అవకాశం ఉండటం వల్ల జిల్లాలో ప్రధాన ఘాట్లలో 7వాచ్ టవర్లు, 2 డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించారు. సీసీ కెమెరాలు అవాంచనీయ ఘటనలు జరగకుండా, అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు వీలుగా 500సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అనుక్షణం వాటిని పరిశీలిస్తూ అధికారులు, పోలీసులకు సూచనలు ఇవ్వనున్నారు. పాత నేరస్తులు, అనుమానితులను గుర్తించేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు. మొబైల్ ఏటీఎంలు భక్తుల కోసం జిల్లా అధికార యంత్రాంగం పుష్కరఘాట్ల వద్ద ఏటీఎంలు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఉండే ప్రధాన 15ఘాట్ల వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆం«ధ్రాబ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కెనరాబ్యాంకు ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 24గంటలూ నగదు నిల్వ ఉంచనున్నారు. ఉచిత వైఫై సేవలు పుష్కరస్నానాలకు వచ్చే ప్రతి ఒక్కరికి ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తేనున్నారు. వైఫైలో ఎలాంటి సమస్య రాకుండా ఇప్పటికే కలెక్టర్ టీకే శ్రీదేవి టెలికాం అధికారులను ప్రాంతాన్ని బట్టి సిగ్నల్ సామర్థ్యం పెంచేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అధికారులు రూపొందించిన యాప్‌లను, సోషల్ మీడియా వినియోగానికి జిల్లాలోని ముఖ్యమైన ఘాట్ల వద్ద వైఫై సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఫ్ఎం సేవలు పుష్కరఘాట్లలో హైదరాబాద్‌కు చెందిన రేడియో మిర్చి ఎఫ్ఎం సేవలను భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. పుష్కరస్నానం చేయడానికి వచ్చిన భక్తులు ఉత్సాహంగా గడపడానికి ఎఫ్ఎం ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హెచ్చరికలు, ట్రాఫిక్ సమాచారం, భక్తుల రద్దీ.. తదితర సమాచారం భక్తులకు చేరవేయడానికి వాడనున్నారు. జిల్లాలో ఎక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి ఎక్కడ కంట్రోల్ రూం ఉంది.. ఎవరైన తప్పిపోయిన వారి వివరాలు చెబుతారు. పోలీసుల కోసం.. పోలీస్ కంట్రోల్ గది నుంచి పరిస్థితులను బట్టి అధికారులకు, సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాలు సంక్షిప్త సందేశాల ద్వారా మేసేజ్ పంపిచడానికి ్ఛb్చnఛీౌbuట్ట ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్పీస్థాయి నుంచి హోంగార్డు వరకు ఈ సందేశాలు వెళ్తాయి. ఘాట్ల వద్ద విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలు ఫోన్నంబర్లతో సహా ఆన్లైన్లో పెట్టనున్నారు. పోలీస్ అధికారులు సమాచారం తెలిపేందుకు సెట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందకోసం ఘాట్ల వద్ద టవర్లు, ఇప్పటికే ఏర్పాటు చేశారు. 600సెట్లు, 34 రిపీటర్లు, 3020వాట్స్ సెట్స్‌ను వినియోగించనున్నారు. జిల్లాలో ప్రధానజంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులు, వెళ్లే మార్గాలను సూచించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఘాట్లలో కృష్ణమ్మ పరవళ్లు
పుష్కరఘాట్లను ముంచెత్తిన వరద – కొన్ని ఘాట్ల వద్ద ఉధృతంగా కృష్ణా ప్రవాహం – పుష్కరపనులకు అంతరాయం – సోమశిల వీఐపీ ఘాట్‌కు చేరువలో నదీ ప్రవాహం పుష్కరఘాట్లలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడటంతో ప్రాజెక్టుకు వరద ముంచెత్తుతోంది. జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు నీటిని విడుదల చేస్తుండటంతో.. నిన్నటి వరకు రాళ్లు రప్పలతో నిండిన పుష్కరఘాట్లు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నారు. జూరాల బ్యాక్‌వాటర్‌లో ఉన్న పలు పుష్కరఘాట్లు నీటిలో పూర్తిగా ముగినిపోయాయి. మరికొన్న చోట్ల పుష్కరపనులు చేసేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. – కొల్లాపూర్/ఆత్మకూరు/గద్వాల/మక్తల్/పెబ్బేరు/మాగనూరు మక్తల్ మండలంలో ఘాట్ల వద్దకు భారీగా నీళ్లు వచ్చాయి. పసుపుల పుష్కరఘాట్ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఘాట్ మెట్లు కొంతవరకే తేలాయి. పారేవులలో కూడా నీళ్లు భారీగా వచ్చాయి. పంచదేవ్పాడు ఘాట్లలోకి నీళ్లు రావడంతో పనులకు అంతరాయం ఏర్పడుతోంది. ముస్లాయిపల్లి, గడ్డంపల్లి, అనుగొండ ఘాట్లు ఇదివరకే పూర్తిగా మునిగిపోయాయి. ఆత్మకూర్ మండల పరిధిలోని నందిమల్లడ్యాం, జూరాల, మూలమల్ల,ఆరేపల్లి, కత్తేపల్లి ఘాట్లలోకి భారీగా నీళ్లు వచ్చాయి. భక్తులు పుష్కరస్నానం చేసేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎట్టకేలకు కొల్లాపూర్ మండలం సోమశిల వీఐపీ ఘాట్‌లోకి కృష్ణానది నీరు చేరుతోంది. మరో మూడు రోజుల పాటు వరద నీరు ఇలాగే ప్రవహిస్తే జనరల్ఘాట్ వరకు నీరు వచ్చే అవకాశం ఉంది. మల్లేశ్వరం, మంచాలకట్ట, అమరగిరి, చెల్లెపాడ పుష్కరఘాట్లకు చేరువగా కృష్ణానది నీటిమట్టం ఉంది. నది నీళ్లు పెరగడంతో సోమశిల వద్దకు పర్యాటక శాఖ లాంచీని తీసుకొచ్చారు. మాగనూరు మండలంలోని కృష్ణా ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. గంటగంటలకు నీటి ప్రవాహం పెరుగుతూ ఉండటంతో పలు పుష్కరఘాట్లు పూర్తిగా నీట ముగిగాయి. కృష్ణ వద్ద ఏర్పాటు చేసిన‡ఘాట్ వద్ద దాదాపు 50మెట్ల వరకు నీరు చేరింది. గద్వాలలో నదీ అగ్రహారం ఘాట్లలో 8.91మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. మూడు వరసలు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. మరో రెండు వరుసలు తేలి ఉన్నాయి. నెట్టెంపాడు, ఉప్పేరు, రేవులపల్లి, చింతరేవుల ఘాట్లు 90శాతం మేర మునిగిపోయాయి. రేకులపల్లి, తెలుగోనిపల్లి, బీరెల్లిలో మూడు వరుసలు నదీ ప్రవాహంలో మునిగిపోయాయి. పెబ్బేరు మండలం రంగాపూర్ ఘాట్ వద్ద భారీ వరద ప్రవాహం ఉంది. ఏడు లైన్లతో ఘాట్‌ను నిర్మిస్తుండగా, నాలుగు ఘాట్లు పూర్తిగా నీటిలో ముగినిపోయాయి. వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఘాట్ వద్ద పనులు ఆశించినస్థాయిలో సాగడం లేదు. రాంపూర్, మునగమాన్ దిన్నె ఘాట్ల వద్ద కృష్ణా ప్రవాహం బాగా ఉంది. -
పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
– జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు – మొత్తం 72సర్వీస్‌లు – 11 నుంచి 24 వరకు రైళ్ల రాకపోకలు స్టేషన్ మహబూబ్‌నగర్: పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు ఈనెల 11 నుంచి 24వరకు మొత్తం 72 సర్వీస్‌లను పుష్కరాల కోసం నడపనున్నాయి. హైదరాబాద్ నుంచి 28, బొల్లారం నుంచి 24, కర్నూలు నుంచి 20 సర్వీస్‌లను ఏర్పాటు చేశారు. రైలు నంబర్ (07950/07951): హైదరాబాద్–గద్వాల రైలు. ఈ రైలు ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తి రోడ్‌తో పాటు శ్రీరాంనగర్ స్టేషన్లలో ఆగుతాయి. రైలు నంబర్ (07948/07949): కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తిరోడ్, శ్రీరాంనగర్ స్టేషన్లలో ఆగుతుంది. డెమో రైలు (07974/07975): మల్కాజ్గిరి, కాచిగూడ, ఉమద్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తిరోడ్, శ్రీరాంనగర్ స్టేషన్లలో ఆగుతుంది. డెమో రైలు(07977/07978): పోడూర్, ఇటిక్యాల, మానవపాడ్, అలంపూర్ స్టేషన్లలో ఆగుతుంది. 11వ తేదీ నడిచే రైళ్లు హైదరాబాద్–గద్వాల ఉ.5.15 ఉ.10.20 గద్వాల–హైదరాబాద్ మ.12.40 సా.5.00 12న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు సిటీ మ.3.00 రా.4.45 13న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 కర్నూల్సిటీ–గద్వాల మ.12.45 మ.1.50 14న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు æ మ.3.00 రా.4.45 కర్నూలుæ–గద్వాల మ.12.45 మ.1.50 15న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50 16న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45 17న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు æ మ.3.00 రా.4.45 కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50 18న నడిచే రైళ్లు హైదరాబాద్–గద్వాల ఉ.5.15 ఉ.10.20 గద్వాల–హైదరాబాద్ మ.12.40 సా.5.00 సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45 కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50 19న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45 కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50 20న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలుæ మ.3.00 రా.4.45 కర్నూలుæ–గద్వాల మ.12.45 మ.1.50 21న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45 కర్నూలుæ–గద్వాల మ.12.45 మ.1.50 22న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50 23న నడిచే రైళ్లు సికింద్రాబాద్–గద్వాల ఉ.11.45 మ.3.30 గద్వాల–సికింద్రాబాద్ సా.4.30 రా.9.00 బొల్లారం–గద్వాల ఉ.7.00 మ.1.00 గద్వాల–బొల్లారం మ.2.30 రా.7.45 గద్వాల–కర్నూలు మ.3.00 రా.4.45 24న నడిచే రైలు కర్నూలు–గద్వాల మ.12.45 మ.1.50 -
ఆరోగ్యమస్తు
పుష్కరాలకు సన్నద్ధం అవుతున్న వైద్యారోగ్యశాఖ – ఘాట్ల వద్ద తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు – అత్యవసర పరీక్షలకు అందుబాటులో వైద్య పరికరాలు – 635మందితో శిబిరాల నిర్వహణ – రూ.80లక్షల మందులకు ప్రతిపాదనలు మహబూబ్‌నగర్ క్రైం: కృష్ణా పుష్కరాల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోంది. కోట్ల మంది భక్తులు హాజరవుతున్న ఈ పుష్కరాలలో వైద్య ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే పుష్కరాల నిర్వహణ కోసం కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ పాత్ర విజయవంతం చేయడానికి అదనపు జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ టీకే శ్రీదేవి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తూ, కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. సభ్యులుగా అదనపు జేసీ, డీఎంహెచ్ఓ, జిల్లాసుపత్రి సూపరింటెండెంట్, ఆస్పత్రి ఈఈలున్నారు. 4 ఘాట్లలో 24గంటలూ సేవలు పుష్కరాల కోసం ఘాట్లలో 108 అంబులెన్స్‌లు 25, 104వాహనాలు 27 అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో నాలుగు ప్రధాన ఘాట్లు బీచుపల్లి, గొందిమళ్ల, పసుపుల, కృష్ణలలో 10పడకల తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఘాట్‌కు ఓ ప్రత్యేక వైద్యుడు అందుబాటులో ఉంటూ భక్తులకు 24గంటల పాటు సేవలు అందించనున్నారు. మరో ఆరు ఘాట్లలో నాలుగు పడకల ఆస్పత్రులు, 15ఘాట్లలో రెండు పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 12గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. పుష్కరఘాట్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక ఆస్పత్రులను రేకులతో నిర్మాణం చేయనున్నారు. అలాగే అత్యవసరంగా పరీక్షలు చేయడానికి పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అత్యవసర వైద్యం అందించడానికి ఓ ఐసీయూ బెడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఘాట్‌లో ఓ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి అక్కడ కావాల్సిన మందులను అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ దాదాపు రూ.80లక్షల మందులకు ప్రతిపాదనలు పంపించింది. 635సిబ్బందితో వైద్య సేవలు.. జిల్లాలో పుష్కరఘాట్లలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయబోతున్న తాత్కాలిక ఆస్పత్రులతో పాటు వైద్య శిబిరాలలో వైద్య సేవలు అందించడానికి ఆ శాఖ 635మందిని నియమించింది. ఇందులో 48మంది ప్రత్యేక వైద్యులు, 157మంది ఎంబీబీఎస్ వైద్యులు, ఇతర స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్, సిబ్బంది ఉండనున్నారు. ప్రతి అత్యవసర ఘాట్‌లో నలుగురు ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండి సేవలు చేస్తారు. అయితే పుష్కరాలలో మందుల కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మందుల బాధ్యతను జీవనధారకు అప్పగించింది. నాలుగు ప్రాంతాల్లో ఏజేన్సీ వారు వైద్య శిబిరాలను పర్యవేక్షణ చేయనున్నారు. సిబ్బంది కొరత.. పుష్కరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన విధంగా చూస్తే జిల్లాలో ఉండే సిబ్బంది సరిపోవడం లేదు. అయితే జిల్లాలో 195వైద్య పోస్టులు ఉంటే వాటికి 167మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇంకా ఇతర జిల్లాల నుంచి 300మంది వైద్యుల వరకు అవసరం ఉంది. ఇతర పారామెడికల్ సిబ్బంది 3వేల వరకు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇందులో సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అయితే ఇతర జిల్లాల నుంచి దాదాపు 700మంది సిబ్బందిని రప్పించాల్సిన అవసరం ఉంది. కసరత్తు చేస్తున్నాం.. జిల్లాలో పుష్కరాలను విజయంవంతం చేయడానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్య ఘాట్లను గుర్తించాం. కొన్ని ఘాట్లలో పది పడకలు, నాలుగు పడకలు, రెండు పడకల తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణం చేస్తాం. భక్తులను దృష్టిలో పెట్టుకుని మరింత వైద్య శిబిరాలు పెంచడానికి కృషి చేస్తాం. ప్రస్తుతం శాఖాపరంగా కావాల్సిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాం. –డాక్టర్నాగారాం, డీఎంహెచ్‌వో -
సాగర్‌లో తెలుగు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల భేటీ
నల్లగొండ: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు బుధవారం నాగార్జునసాగర్‌లో సమావేశమయ్యారు. సాగర్‌లోని విజయవిహార్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన డీఐజీలు అకున్ సబర్వాల్, సంజయ్‌లతోపాటు పుష్కర ఘాట్లు ఉన్న జిల్లా ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు సుమారు 50 మంది పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ సమస్యపై వారు చర్చిస్తున్నారు. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
ఆర్టీసీతో పాటు టీఎస్‌టీడీసీ ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు ఆగస్టు 12 నుంచి 23 వరకు సర్వీసులు మహబూబ్‌నగర్ క్రైం: కృష్ణా పుష్కరాల కోసం జిల్లా ఆర్టీసీతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సంబంధిత డిపో కేంద్రాల పరిధిలో ప్రధాన బస్‌స్టేçÙన్ల నుంచి పుష్కరఘాట్లకు ప్రయాణికులను చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 9డిపోల పరిధిలో మొత్తం 430బస్సులు నడుపుతున్నారు. ఆన్లైన్ బుకింగ్.. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు మందస్తుగా తమ టికెట్లును ఆర్టీసీకి సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. పుష్కరాలకు కుటుంబసమేతంగా లేదా స్నేహితులు 36మంది మించితే ముందస్తుగా ప్రత్యేక బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లాలోని ఆయా డిపోల మేనేజర్లను సంప్రదించాల్సి ఉంటుంది. పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సిద్ధం చేసింది. రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నదీ తీరంలో పుణ్యస్నానాలాచరించేందుకు వస్తుంటారు. పుష్కరయాత్రికల కోసం టీఎస్‌టీడీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఆగస్టు 12నుంచి 23వరకు పుష్కరాల కోసం హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేకంగా 25బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. మహబూబ్‌నగర్, అలంపూర్, సోమశిల, బీచుపల్లికి ప్రత్యేక సర్వీసులు నాన్ ఏసీ బస్సును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి బీచుపల్లి పుష్కరఘాట్‌తో పాటు అలంపూర్ జోగులాంబ దేవాలయం దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇందుకోసం టూర్ ప్యాకేజీలు పెట్టారు. హైదరాబాద్ టు బీచుపల్లి... హైదరాబాద్ నుంచి బీచుపల్లి, అలంపూర్ పర్యాటక ప్రాంతాలకు టీఎస్టీడీఎసీ ప్రత్యేక వోల్వో, ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరిన బస్సు మధ్యాహ్నం వరకు బీచుపల్లి ఘాట్‌కు చేరుకుంటుంది. అక్కడ పుష్కరస్నానం చేసిన తర్వాత భక్తులు స్థానిక ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అలంపూర్ జోగులాంబ దేవాలయానికి వెళ్లి అటు నుంచి తిరిగి రాత్రి హైదరాబాద్ చేరుకునే విధంగా ప్యాకేజీ తయారు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి సోమశిలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.700లుగా టికెట్ ధరను నిర్ణయించారు. -
మరో 20 మీటర్లు
జోగుళాంబ ఘాట్ పొడవు పెంపు నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో అధికారుల నిర్ణయం అలంపూర్: కృష్ణా పుష్కరాల్లో పనుల హడావుడి పెరిగింది. మరోవైపు నదిలో నీటి నిల్వల ఆందోళన కలిగిస్తోంది. పుష్కలంగా వర్షాలు కురిసి ఎగువు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ దిగువకు నీటిని పరిమితస్థాయిలోనే వదులుతుండటంతో కృష్ణా పుష్కరస్నానాలు చేయడానికి నిర్మించిన ఘాట్ల వద్దకు నీళ్లు చేరడం లేదు. మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న పుష్కరాలకు ఎలాంటి పరిస్థితి ఉందో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. అలంపూర్ నియోజకవర్గంలో బీచుపల్లి ఘాట్ మినహా మారమునగాల, క్యాతూర్, గొందిమల్ల గ్రామాల్లో నిర్మిస్తున్న పుష్కరఘాట్ల వద్ద మాత్రం నీళ్లు చేరలేదు. ఘాట్లకు అతి సమీపం వరకు వచ్చి ఆగిపోవడంతో పుష్కరాల వరకు నీళ్లు చేరుతాయా..లేదా అనే సందేహం ఉంది. గొందిమల్లలో నిర్మిస్తున్న వీఐపీలకు, సాధారణ భక్తులకు పుష్కరఘాట్‌ను మరో 20మీటర్లు పెంచడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గొందిమల్లలో సుమారు రూ.3.17కోట్లతో రెండుఘాట్లు నిర్మిస్తున్నారు. గతం లో ఇక్కడ ఉండే నీటి లెవల్స్ ఆధారంగా ఒకలో నదిలో లో–లెవల్ ఘాట్, నదికి భారీగా వరద వచ్చి నీటిలో ఘాట్ మునిగిపోతే ప్రత్యామ్నయంగా మరో హైలెవల్ ఘాట్ నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ 30మీ. వెడల్పు, 90మీ.పొడవుతో, హైలెవల్ ఘాట్ 20మీ. వెడల్పు, 70మీ. పొడవుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మించిన లోలెవల్ ఘాట్‌కు 10మీటర్ల దూరం వరకు నది ప్రవాహం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘాట్‌లోనే పుష్కర స్నానం చేయనున్నారు. నదిలో నీటి మట్టం లేని దృష్ట్యా ఈ ఘాట్ నదిలో మరో 20మీటర్ల మేర నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి లెవల్స్‌లోనే పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్‌ను పెంచనున్నట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి పేర్కొన్నారు. దీంతో లోలెవల్ ఘాట్ ప్రస్తుతం 30మీటర్ల వెడల్పు, 110 మీటర్ల పొడవుకు చేరుకోనుంది. -
కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అధికార యంత్రాంగం కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తోంది. గత పుష్కరాల సమయంలో పలు ఘాట్లలో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. పన్నెండేళ్ల క్రితం జరిగిన పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా బీచుపల్లి, జూరాల ప్రాంతాల్లో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిష్ఠించారు. గద్వాలలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని పుష్కరాలు సమయంలో పట్టణ ప్రధాన కూడలిలో విగ్రహాలను ఏర్పాటు చేయించారు. పుష్కరాలకు గుర్తుగా కృష్ణవేణి విగ్రహాలు గద్వాల: ‘కృష్ణానది సహ్య పర్వతాలపై పుట్టింది. శ్రీకృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన వేదగిరి వద్ద అశ్వత్థరూపంలో నిలిచినపుడు ఆ వేళ్ల నుంచి ఈ నది పుట్టిందని పురాణం చెబుతోంది. కలియుగంలో మునులంతా పాపాన్ని నశింపజేసుకోవడానికి ఈశ్వరుడిని ప్రార్థంచారు. అప్పుడు శివయ్య లింగంరూపంలో సహ్యాద్రిపై అవతరించారని, అక్కడున్న ఉసిరిచెట్టు నుంచి వేణినది పుట్టి, కృష్ణానదిలో కలవడంతో కృష్ణవేణి అయింది.’ పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాల పురస్కరించుకుని వాటి జ్ఞాపకార్థం గద్వాలలో చెరగని ముద్ర వేశారు. పుష్కరాల గుర్తుగా రెండు విడుతలగా కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మొదటిసారి 1992లో గద్వాల పట్టణం నుంచి కృష్ణానదికి వెళ్లే మార్గంలో అప్పటి న్యాయశాఖ మంత్రి డీకే సమరసింహారెడ్డి కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ విగ్రహం అలాగే ఉంది. విగ్రహం ఏర్పాట్లుతో అది కృష్ణవేణి చౌరస్తాగా మారిపోయింది. పట్టణంలో అత్యంత రద్దీ ఉండేది ఇదొక్కటే. 2016 కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే డీకే అరుణ కృష్ణవేణి విగ్రహా ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. పాత కృష్ణవేణి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మొదట సంకల్పించారు. అయితే రాజకీయ కారణాలు, సెంటిమెంట్లు అడ్డురావడంతో విగ్రహ ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది. తదనంతరం పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా నుంచి కృష్ణానదికి స్వాగతం పలికే విధంగా తొమ్మిది అడుగుల కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని డీకే అరుణ సొంత ఖర్చులతో చేయించారు. మే 4వ తేదీన కృష్ణవేణి విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజలను ఆకట్టుకునే సహజత్వంతో కృష్ణవేణి విగ్రహం ఉట్టిపడుతోంది. ప్రస్తుతం కృష్ణ పుష్కరాలకు గుర్తుగా శోభాయమానంగా మారింది. తల లేని కృష్ణమ్మ.. ఆత్మకూర్: పన్నెండేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణవేణి అమ్మవారి విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రతిషి్ఠంచి, ప్రారంభించారు. ఆ తర్వాత ఆలనాపాలన లేకపోవడంతో కృష్ణవేణి విగ్రహం ధ్వంసమైంది. ప్రస్తుతం విగ్రహానికి తల లేదు. అక్కడ నిర్మించిన ఆలయం కూలిపోయి విగ్రహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక్కడ ఉన్న గుడిని పునరుద్ధరించాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. కొత్తఘాట్లో కొత్త విగ్రహం.. ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని 2004లో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణవేణి విగ్రహాన్ని ప్రతిషి్ఠం చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్‌పై సైతం కృష్ణవేణì విగ్రహాన్ని ప్రతిషి్ఠంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.గురువు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి ముక్కోటి దేవతామూర్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. -
త్రినేత్రం
– రూ.2కోట్లతో పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాల ఏర్పాటు – 11వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు – జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా కృష్ణా పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 32పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. 11వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలకు జిల్లా పోలీస్‌శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోనే కృష్ణా పరివాహక ప్రాంతం ఉండటంతో జిల్లాలో పుష్కరఘాట్లకు దాదాపు మూడు కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 40నుంచి 45వేల మందికి ఒక సీసీ కెమెరాతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో 32 ఘాట్లను గుర్తించిన అధికారులు, అందులో అత్యంత ముఖ్యమైన 9 ఘాట్లను గుర్తించారు. బందోబస్తుపరంగా ఎక్కడ తగ్గకుండా చూస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాలను పూర్తిగా నిఘా నేత్రంతో పహారా చేయాలని భావిస్తున్న పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 32ఘాట్లలో 500సీసీ కెమెరాలు.. గుర్తించిన 32ఘాట్లలో రూ.2కోట్లతో 500సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చి పుష్కరాలకు కావాల్సిన కెమెరాలు, పోలీస్ బలగాలు, భారీ గ్రేడ్స్ ఇతర వాటికి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి జిల్లా పోలీస్ శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లింది. పుష్కరాల కోసం ఏర్పాటు చేసే కెమెరాలు 360డిగ్రీల కోణంలో తిరిగే వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.70నుంచి 80వేలను ఒక్కో కెమెరాకు ఖర్చు చేసి అత్యంత టెక్నాలజీతో కూడిన నిఘా పెట్టాలని భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగిన సకాలంలో స్పందించడానికి ఈ కెమెరాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తం 500కెమెరాలకు కలిపి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఏ ప్రదేశంలో ఎలాంటి సంఘటన చొటుచేసుకున్న స్థానిక విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం చేరవేయనున్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి రానున్న పుష్కరాల సందర్భంగా జిల్లాలో దాదాపు 185కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయరహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. హైవేపై అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. బీచుపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల రోజుల ముందే నుంచి పుష్కరఘాట్ల పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘాట్ల సమీపంలో సరికొత్త బారీకేడ్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. 11వేల మంది బందోబస్తు పుష్కరాల సమయంలో జిల్లాలో బందోబస్తు నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానికంగా ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఘాట్లు ఏర్పాటు చేయడంతో బందోబస్తు భారీస్థాయిలో ఉండాలని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల పోలీస్ సిబ్బంది ఉండటంతో అదనంగా మరో 8వేల మందిని ఇతర జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు పారా మిలిటరీ, ట్రాఫిక్ ఇతర విభాగాలు వారు ఉండనున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బందోబస్తులో 10మంచి అదనపు ఎస్పీలు, 25మంది డీఎస్పీలు, 150మంది సీఐలు, 750మంది ఎస్ఐలు ఉంటారు. -
పుష్కరస్నానంతో పునీతం
అన్ని పాపాలు తొలగిపోతాయి గురుడు కన్యారాశిలో ప్రవేశంతో ‘పుష్కర’ం ప్రారంభం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీచుపల్లి ప్రధాన అర్చకుడు ప్రహ్లాదచారి పుష్కర సమయంలో నదిలో స్నానాలు ఆచరించడం ద్వారా దీర్ఘకాలిక రోగాలు మాయమవుతాయని, కోటి జన్మలలో చేసిన పాపం తొలగిపోతుందని బీచుపల్లి పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ప్రహ్లాదచారి అంటున్నారు. కృష్ణా పుష్కరస్నానం కోసం రాష్ట్రంలో బీచుపల్లికే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పారు. ఈ క్షేత్రం వద్ద కృష్ణానది దక్షిణ వాయువ్యదిశగా ప్రవహిస్తోందని, మహాబలేశ్వరంలో నది పుట్టిన ప్రాంతం నుంచి హంసల దీవిలో సముద్రంలో కలిసే వరకు ఎక్కడా కృష్ణమ్మ ఇలా ప్రవహించదన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద ఇదే ఎంతో ప్రత్యేకమైనది పేర్కొన్నారు. పుష్కరస్నానం ఆచరించడం వల్ల ¿¶ క్తులకు కలిగే ప్రయోజనాలు, వాటి ఫలితాలు, బీచుపల్లి తదితర అంశాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.. – ఇటిక్యాల పుష్కరస్నానంపై భక్తులకు అవగాహన శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలో క్రీ.శ.1487లో ఆభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నిత్యం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. నేను అర్చకుడిగా ఉన్నప్పటి నుంచి బీచుపల్లి వద్ద మూడుసార్లు కృష్ణా పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు నిర్వహించే పుష్కరాలు నాలుగోసారి అవుతాయి. మొదట 1980లో జరిగిన కృష్ణాపుష్కరాలు కేవలం ఆధ్యాత్మిక అవగాహన ఉన్న భక్తులు మాత్రమే పుష్కరాలకు హాజరయ్యారు. 1992లో జరిగిన పుష్కరాలపై భక్తులకు అవగాహన కొరవడి ఎక్కువ సంఖ్యలో రాలేదు. కానీ 2004లో దాదాపు 80శాతం మంది భక్తులకు పుష్కర స్నానంపై అవగాహన వచ్చింది. దీంతో బీచుపల్లిలో ఆ ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజÔó ఖరరెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవానికి, ముగింపునకు హాజరయ్యారు. ప్రస్తుతం పుష్కరాలపై భక్తులకు పూర్తి అవగాహన కలిగి ఉండటంతో ఈ ఏడాది 50లక్షల మందికి పైగా బీచుపల్లిలో పుణ్యక్షేత్రంలో పుష్కరస్నానం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దేవతలతో పాటు భక్తుల పుణ్యస్నానం ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం మొదలుతో పుష్కరం ప్రారంభమవుతుంది. అదే నెల 23వతేదీ సూర్యాస్తమయం వరకు భక్తులు పుష్కరస్నానం ఆచరించవచ్చు. గురువు (బృహస్పతి) కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర సమయం ప్రారంభమవుతుంది. పుష్కర సమయం ప్రారంభంలో ముక్కోటి దేవతలు నదిలో స్నానాలు ఆచరిస్తారు. పుష్కరాలు జరిగే 12 రోజులు... ఒక్కో ప్రత్యేక రోజులుగా ముక్కోటి దేవతామూర్తులు స్నానమాచరించే సమయంలో భక్తులు సైతం పుష్కర స్నానాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. పుష్కర శ్లోకం.. పుష్కరాలలో పాల్గొనే భక్తులు ఈ శ్లోకంను స్మరించుకుంటూ పుణ్యస్నానం ఆచరిస్తే మంచి జరుగుతుంది. ‘గంగేచ యమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిమ్ సన్నిబింకుర్’ అంటూ నదిలో స్నానమాచరించే సమయంలో మనసులో స్మరించుకోవాలి. దీంతో అన్ని నదులలో పుణ్యస్నానమాచరించిన ఫలితం దక్కుతుంది. భక్తులు చేయాల్సిన దానాలు.. పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు పుష్కరాలు జరిగే 12రోజుల పాటు భక్తులు దానధర్మాలు చేయాల్సి ఉంటుంది. స్నానమాచరించిన తరువాత ఒకటో రోజు బంగారం, వెండి, ధాన్యం, భూమి, అన్నదానం చేయాలి. రెండోరోజు ఆవు, రత్నాలు, ఉప్పు, మూడోరోజు పండ్లు, కూరలు, బెల్లం, వెండితో చేసిన గుర్రం బొమ్మ, నాలుగో రోజు నెయ్యి, నూనె, తేనె, పాలు, చక్కెర, 5వ రోజు ధాన్యం, పండ్లు, గేదెలు, నాగలి, 6వ రోజు మంచి గంధపు చెక్క, కర్పూరం, కస్తూరి, ఔషధాలు, 7వ రోజు ఇల్లు, వాహనం, కూర్చొనే ఆసనం, 8వ రోజు పూలు, అల్లం, గంధపు చెక్క, 9వ రోజు కన్యాదానం, పిండ ప్రదానం, 10వ రోజు హరిహర పూజ, లక్ష్మిపూజ, నదిపూజ, గౌరిపూజ, 11వ రోజు వాహనం, పుస్తకాలు, తాంబూలం, 12వ రోజు నువ్వులు, మేకలను పేదవారికి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. -
పూర్తయ్యేనా స్వామీ!
గద్వాల: కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తున్నా.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. పుష్కరాల కోసం గద్వాల నియోజకవర్గపరిధిలోని పలు ఆలయాలకు ప్రభుత్వం రూ.64లక్షల నిధులు కేటాయించింది. మంజూరైన నిధులతో చేపట్టిన పనులు సైతం నత్తను తలపిస్తున్నాయి. ఈ నిధులతో ఆలయాలన్నింటికీ రంగులు, ఆధునికీకరణ, చలువరాళ్ల ఏర్పాటు, మండపాల ఏర్పాటు, విద్యుదీకరణ, షెడ్ల నిర్మాణం ప్రతిపాదించారు. అధికారులు ఆలస్యంగా టెండర్లు పిలవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. బిడ్లు పిలిచి ఒప్పందాలు కుదుర్చుకోవడంలోనే పుణ్యకాలం కాస్త కరిగిపోయింది. ఫలితంగా ఆలయాల పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. నెల రోజుల క్రితం ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. అలయాల అభివృద్ధికి, అధికారులు ప్రతిపాదించిన వాటికి, ప్రస్తుతం జరుగుతున్న వాటికి పొంతనలేని పరిస్థితి నెలకొంది. దివి గ్రామమైన గుర్రంగడ్డలో కొలువైన జమ్ములమ్మ అమ్మవారి ఆలయ మండప నిర్మాణంలో జాప్యం నెలకొంది. రూ.12లక్షల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం పిల్లర్లు వేసి వదలివేశారు. పుష్కరాలు పూర్తయినా నిర్మాణం పూర్తయ్యే పరిస్థితిలో లేదు. నది అగ్రహారంలోని ఆలయాల సముదాయాలకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. వీటితో స్ఫటిక లింగేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం, రామావధూతల ఆలయాలు, ఆంజనేయస్వామి, సంతాన వేణుగోపాలస్వామి తదితర ఆలయాల మరమ్మతులు కొనసాగుతున్నాయి. స్ఫటిక లింగేశ్వర ఆలయానికి షెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. సంతాన వేణుగోపాలస్వామి ఆలయ మండపం పైకప్పు వేశారు. పుష్కరకాలం నాటికి సిమెంట్ పనులు మాత్రమే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రంగులు, తదితర ఆధునికీకరణ పనులు ప్రశ్నార్థకంగా మిగిలే అవకాశం ఉంది. చింతరేవుల ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి వేసే చలువరాళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆలయం చుట్టూ పై భాగాన ఆధునికీకరణ పనులు చేపట్టారు. జమ్ములమ్మ ఆలయ ప్రాంగణంలో మాత్రమే దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. రూ.12లక్షల వ్యయంతో పుష్కర అభివృద్ధి పనులు చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో పనులు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
గడువులోగా పుష్కర పనులు పూర్తి చేయాలి కలెక్టర్ టీకే శ్రీదేవి పాతాలగంగ,(మన్ననూర్): పుష్కరాల సమయం సమీపిస్తున్నందున పనులు వేగవంతం చేసి, గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం అమ్రాబాద్ మండలం పాతాలగంగ వద్ద కృష్ణా పుష్కరాలు కోసం ఏర్పాటు చేస్తున్న ఘాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఇతర అధికారులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి మొదటిసారి సందర్శించిన కలెక్టర్ ఇక్కడి సహజమైన అందాలను చూసి పులకించిపోయారు. అంతకుముందు జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి హెలిప్యాడ్, బస్‌స్టాండ్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపుపనుల్లో జోక్యం చేసుకోకుండా ఇప్పటివరకు ప్రభుత్వం ఆదేశించిన పనుల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలన్నారు. ఈ సందర్భంగా ప్రమాదకరంగా ఉన్న పుష్కరఘాట్లలోని అడుగు భాగాన్ని పరిశీలించిన, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్, ఏఈలను ఆదేశించారు. అనంతరం పుష్కరాలకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పుష్కరాల ప్రత్యేక అధికారి, డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్, డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఎంపీపీ రామచంద్రమ్మ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ రఘునందన్, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ, డీఈ అశోక్‌కుమార్,హేమలత, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు నరేందర్, బలరాం, ఆదిత్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగొద్దు
పూర్తిస్థాయి రక్షణ ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించిన ఎస్పీ రెమా రాజేశ్వరి పలు పుష్కరఘాట్ల పరిశీలన ధరూరు: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పెద్దచింతరేవుల, రేవులపల్లి, ఉప్పేరు, నెట్టెంపాడు ఘాట్లను పరిశీలించారు. పుష్కరస్నానానికి వచ్చే భక్తులకు రక్షణగా బారీకేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. గోదావరికి ధీటుగా కృష్ణా పుష్కరాలను నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వరద నీటి కారణంగా ఆలస్యమవుతున్న పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం వరదనీటి ఉధృతి తక్కువగా ఉన్నదని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. సమయం సమీపిస్తోందని, అధికారులు దగ్గరుండి పనులు చేయించాలన్నారు. ఘాట్ల వద్ద తాగునీరు, స్నానపు గదులు, విద్యుత్, పార్కింగ్ వంటి సదుపాయాలపై ఆరీఓ అబ్దుల్ హమీద్, డీఎస్పీ బాలకోటీలతో చర్చించారు. కార్యక్రమంలో సీఐ సురేష్, ఎస్ఐ అమ్జదలి, తహసీల్దార్ సమద్ పాల్గొన్నారు. బీచుపల్లి వద్ద పార్కింగ్ స్థలాల పరిశీలన ఇటిక్యాల: బీచుపల్లి ఘాట్‌వద్ద వాహనాల పార్కింగ్ స్థలాలను ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రక్షణచర్యలు చేపట్టేందుకు పోలీసుశాఖ సిద్ధమమవుతోందన్నారు. బీచుపల్లి సమీపంలోని కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లిచౌరస్తా గ్రామాల శివార్లలోని వాహనాల పార్కింగ్ స్థలాలను గద్వాల డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్పీ పరిశీలించారు. వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలాలను చదును చేయడం, విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసుశాఖ తరఫున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, చోరీలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వాటిపై సమాయత్తం చేయాలన్నారు. బీచుపల్లి వద్ద పుష్కర విధులకు వచ్చే పోలీసు సిబ్బందికి వసతి ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. -
సకాలంలో పూర్తి చేయాలి
– మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం సోమశిలలోని హరిత హోటల్లో పుష్కరాల పనులు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర పనుల ప్రగతిని సంబంధితశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య చర్యలు, దేవాలయాల అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మిస్తున్న రహదారులపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరగకుండా చూడాల్సిన బాధ్యత గ్రామస్థాయి అధికారులపైనే ఉందన్నారు. ఎక్కడైనా కేజీ వీల్స్‌తో రోడ్లు పాడైతే అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కరాల కోసం ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే వాటి కోసం త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని, వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని వెల్లడించారు. దేవాలయాల వద్ద విద్యుద్దీపాలంకరణతో పాటు వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, దేవాదాయ శాఖల అధికారులతో పాటు ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధమవుతోంది..!
కొలిక్కి వస్తున్న వీఐపీ ఘాట్ నిర్మాణం నిర్మాణంలోనే రెండో ఘాట్ నత్తనడకన రోడ్డు నిర్మాణాలు అలంపూర్: కృష్ణా పుష్కరాల కోసం నిర్మిస్తున్న వీఐపీ ఘాట్ పనులు కొలిక్కి వస్తున్నాయి. అలంపూర్ క్షేత్రానికి అతి సమీపంలోని గొందిమల్లలో వీఐపీలకు, సాధారణ భక్తుల కోసం ఘాట్ నిర్మాణాలు చేపడుతున్నారు. నదిలో నీటి ప్రవాహాల అంచనాలకు అనుగుణంగా రెండు ఘాట్లను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఒక ఘాట్ నిర్మాణాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. కానీ నీటి ప్రవాహం పెరిగినా పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా నిర్మిస్తున్న రెండోఘాట్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు కేవలం 14రోజుల గడువు మాత్రమే ఉండటంతో పనుల హడావుడి పెరిగింది. రెండేసి ఘాట్ల నిర్మాణం.. గొందిమల్లలో నీటి నిల్వల హెచ్చు తగ్గులను దృష్టిలో ఉంచుకుని రెండు ఘాట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకటి లో–లెవల్ ఘాట్ మరొకటి హై–లెవల్ ఘాట్లను రూ.3.17 కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ పుష్కర స్నానాలు ఆచరించడానికి వీలుగా నిర్మిస్తున్నారు. 30మీటర్ల వెడల్పు, 90 మీటర్ల పొడవుతో దీని నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా ఘాట్ పనులు పూర్తి చేసి, ఘాట్‌కు రంగు బిల్లలు వేసే పనులు కొనసాగుతున్నాయి. అయితే నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటే ఘాట్‌కు దాదాపు 30మీటర్ల దూరంలో నీళ్లు ప్రవహిస్తాయి. ఇటీవల ఘాట్ పరిశీలనకు వచ్చిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు ఈ విషయమై చర్చించారు. నీళ్లు ఘాట్‌కు దూరంగా ఉంటంతో మరో 20అడుగుల ఘాట్‌ను నదిలో నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో అదనంగా పెంచాల్సిన ఘాట్ పనులపై సందిగ్ధం నెలకొంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వలు పెరిగితే ప్రస్తుతం నిర్మిస్తున్న ఘాట్ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయంగా హైలెవల్ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ ఎత్తు నుంచి ఈ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జోగుళాంబ ఘాట్‌గా నామకరణం.. అలంపూర్ క్షేత్రానికి అతీ సమీపంలో గొందిమల్లలో నిర్మిస్తున్న ఘాట్‌కు జోగుళాంబ పేరుతో పిలవనున్నారు. ఇటీవల పుష్కరఘాట్ల సందర్శనకు వచ్చిన కలెక్టర్ టీకే శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘాట్‌లో పుష్కరస్నానాలు ఆచరించే భక్తులు నేరుగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వస్వామి క్షేత్రాన్ని సందర్శించుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఘాట్‌కు జోగుళాంబ ఘాట్‌గా నామకరణం చేశారు. యాత్రికులు ఒక మార్గంలో వచ్చి రెండో మార్గంలో వెళ్లడానికి వీలుగా ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇతర సదుపాయాలపైనే ఆయా శాఖలు పనుల్లో నిమగ్నమయ్యాయి. -
గొందిమల్ల ఘాట్‌ను పరిశీలించిన మంత్రులు
అలంపూర్/అలంపూర్ రూరల్: కృష్ణానదిలో కొన్ని నీళ్లు ఉన్నా పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని గొందిమల్ల వీఐపీ ఘాట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జేసీ రాంకిషన్‌లతో కలిసి సందర్శించారు. ఘాట్ నిర్మాణ పనులు, పార్కింగ్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులపై మంత్రులు సమీక్షించారు. నదిలో నీటి ప్రవాహం దూరంగా ఉన్నప్పటికీ పుష్కరస్నానాలు చేయడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. పుష్కరఘాట్ వద్ద నదిలో మరో ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని, ఘాట్ నుంచి నదిలో ఉన్న నీటి ప్రవాహం వరకు ఇసుక, మట్టితో తాత్కాలిక రోడ్డు వేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పుష్కరాలకు రెండు, మూడు రోజుల ముందు అప్పటి నీటి ప్రవాహాన్ని బట్టి రోడ్డు వేసుకోవాలన్నారు. పుష్కరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వీరి వెంట మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణవేణి నమస్తుభ్యం
అలంపూర్‌రూరల్: దేశంలో గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి తర్వాత నాలుగో పెద్దనది కృష్ణానది. ప్రకృతిలోని అనేక వన మూలికలను తాకుతూ ప్రవహించడంతో కృష్ణానదిలోని నీరు ఔషధిసంస్కారాన్ని సంతరించుకుంది. కృష్ణానీటితో ఎన్నో క్షేత్రాలలోని అధిష్టాన దేవతలకు ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతున్నాయి. పర్వకాలాల్లో, గ్రహణ సమయాల్లో, యజ్ఞ యాగాది క్రతువుల ప్రారంభసమయంలో కృష్ణానది నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ‘‘కృష్ణవేణి ప్లవనాయ భూమౌ వాంఛతి దేవాః ఖలు మర్థ్య జన్మః తస్య ప్రభావం సకలం ప్రవక్తుం శివో హరిర్వాబ్జ భవో నశక్త ః’’ కృష్ణానదిలో స్నానం చేయడం కోసం దేవతలు సైతం మనుషులుగా జన్మించాలని భావిస్తారట. అలాంటి కృష్ణానది మహిమను వర్ణించడానికి త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణానది ప్రవహించే ప్రదేశాలన్ని కూడా పునీతం. ‘‘కృష్ణవేణి నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని త్రిలోకే పావనజలే రంగాతుంగ తరంగిణి’’ కృష్ణానదిలో మనసా, వాచ, కర్మణ త్రికరఫలశుద్ధితో పుణ్యస్నానాన్ని ఆచరిస్తే సర్వపాపాలు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఎల్లప్పుడూ ప్రవహించే నదుల దగ్గర నివసించమని శాస్త్రోక్తి. అందుకే పూర్వం ఎంతో మంది మహర్షులు వారి జీవనాన్ని నది తీరాల్లో ఏర్పరుచుకొనేవారు. జీవనదులు అనేవి భగవంతుడు ప్రసాదించిన సంపదలు. ఆ నదుల కారణంగానే నేటి మన మనుగడుకు ధాన్యం లభిస్తోంది. అనేక పుణ్యనదులు, ఉపనదులు పుట్టిన ప్రాంతం సహ్యాద్రి పర్వతం. అలాంటి పర్వతంలోనే కృష్ణానది ఆవిర్భవించింది. మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో మహాబలేశ్వరానికి ఉత్తరం వైపు, సతారా జిల్లాలోని జోన్ గ్రామానికి దగ్గరలో సముద్రమట్టానికి 1337మీటర్ల ఎత్తుగా చిన్నధారగా జన్మించింది. అలా ఆవిర్భవించిన కృష్ణమ్మ 29 ఉప నదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1400 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. 138 తీర్థాలు.. కృష్ణానది మహేబలేశ్వరం వద్ద పుట్టిన దగ్గరి నుంచి సముద్రంలో కలిసే హంసలదీవి వరకు 138తీర్థాలు ఏర్పడ్డాయి. అందులో బ్రహ్మతీర్థం, విష్ణుతీర్థం, రుద్రతీర్థం మొదలుకుని అశ్వమేధఫల తీర్థం దాక అనేకం ఉన్నాయి. ఇందులో 81వ తీర్థం అలంపూర్ జోగుళాంబ ఆలయం దగ్గర ఉన్న తుంగభద్రా తీర్థంగా పిలవబడుతోంది. మహాభారతంలో, బ్రహ్మాండ పురాణాలలో, విష్ణు పురాణాల్లో కృష్ణానది ప్రత్యేకస్థానాన్ని సంతరించుకుంది. – సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు కృష్ణానది స్నానం చేస్తే 60వేల సంవత్సరాలు గంగానది స్నానం చే సిన ఫలితం లభిస్తుందట. ప్రతి సంవత్సరం రవి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు చేసే స్నానమే అంతటి పుణ్య ఫలితాన్నిస్తుంటే ఇక 12ఏళ్లకు ఓ సారి చేసే పుష్కరస్నానం ఎన్నో రెట్ల పుణ్యఫలితం దక్కుతుంది. -
పుష్కరస్నానం కష్టమే!
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ ఘాట్లలోకి చేరిన నీళ్లు నిలిచిన పుష్కర పనులు గద్వాల: రోజురోజుకూ పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి రెండుఘాట్ల పనులు మినహా మిగిలినవి మందకొడిగా సాగుతున్నాయి. వీటి వేగం పుంజుకోవాల్సి ఉంది. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, గద్వాల మండలాల పరిధిలో మొత్తం తొమ్మిది పుష్కరఘాట్లను నిర్మిస్తున్నారు. అందులో కొన్నిఘాట్ల పనులు పూర్తి కావచ్చాయి. మరికొన్ని ఘాట్ల దగ్గర పనులు నత్తనడకన సాగు..తున్నాయి. ఐదురోజుల నుంచి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరగడంతో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు పవర్‌హౌస్ ద్వారా, కాలువల ద్వారా నీటిని దిగువకు వదిలారు. కృష్ణానదిలో పెరిగిన నీటి ప్రవాహంతో కొత్తగా చేపడుతున్న పుష్కరఘాట్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో కొన్నిచోట్ల పనులకు ఆటంకాలు ఏర్పడగా, మరికొన్ని చోట్ల పనులను నిలిపివేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని ఘాట్ల నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోనుండటంతో ఈసారి పుష్కరభక్తులకు ఇబ్బందులు తప్పవు. పెద్ద చింతరేవుల (ధరూరు మండలం) పొడవు : 60మీ., వెడల్పు: 12మీటర్లు (నాలుగు వరుసలు) పని విలువ: రూ.1.29 కోట్లు పరిశీలన: ధరూరు మండలం పెద్దచింతరేవుల వద్ద నూతన ఘాట్‌ను నిర్మిస్తున్నారు. నెలరోజుల క్రితం పనులను ప్రారంభించారు. మొదట్లో పనులు నత్తనడకన సాగాయి. ప్రస్తుతం పుష్కరాల సమయం ముంచుకొస్తుండటంతో కాంట్రాక్టర్లు ఆదరాబాదరగా ఘాట్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఈ సమయానికి పనులు కాస్త పూర్తి కావాల్సి ఉంది. నాలుగు వరుసల పుష్కరఘాట్ల నిర్మాణంలో రెండు వరుసలు మాత్రమే పూర్తయ్యాయి. మూడో వరుస పనులు సాగుతున్నాయి. మూడు రోజుల క్రితం కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఘాట్లపైకి నీళ్లు చేరాయి. దీంతో పూర్తి చేసిన రెండు వరుసల ఘాట్లలో నీళ్లు చేరడం వల్ల మెట్లను అసంపూర్తిగా నిర్మించారు. వరద ఉధృతికి అడ్డుకునేందుకు సైడ్వాల్ను నిర్మించాల్సి ఉంది. దీని కోసం పునాదులు తవ్వారు. నీటి ఉధృతి పెరగడంతో అవి కాస్త మునిగిపోయాయి. ప్రస్తుతం సైడ్‌వాల్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత పాటిస్తున్నాం.. పనులు చేపడుతున్న పుష్కర ఘాట్లలోకి నీళ్లు చేరాయని సంబంధిత ఏఈ రాంచందర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో నీళ్లు తగ్గగానే అసంపూర్తిగా ఉన్న మెట్లను పూర్తిచేస్తాం. తర్వాత సైడ్‌వాల్ నిర్మాణాన్ని నిర్మిస్తామన్నారు. పనులను పర్యవేక్షిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. జమ్ములమ్మ రిజర్వాయర్(గద్వాల మండలం) పొడవు: 30 మీ., వెడల్పు : 10 మీ. పని విలువ: రూ. 48.50 లక్షలు పరిశీలన: గద్వాల మండలం, జమ్ములమ్మ రిజర్వాయర్ ఆనకట్ట పక్కన నిర్మించ తలపెట్టిన పుష్కరఘాట్ పనులు నత్తను తలపిస్తున్నాయి. మరో 20రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న దశలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వారం రోజుల క్రితం పుష్కరఘాట్ నిర్మాణ పనుల కోసం శ్రీకారం చుట్టారు. కేవలం మట్టి పనులు మాత్రమే పూర్తయ్యాయి. సిమెంట్ కాంక్రీటు పనులు ప్రారంభం కాలేదు. జమ్ములమ్మ పుష్కరఘాట్‌పై మొదటి నుంచి అధికారులు, కాంట్రాక్టర్లు పట్టనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూరాల కాలువ ద్వారా జమ్ములమ్మ రిజర్వాయర్‌కు భారీస్థాయిలో నీళ్లు చేరాయి. దీంతో పుష్కరఘాట్ కోసం తవ్విన గుంతల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. రెండు రోజుల పాటు నీటిని మోటార్ల సహాయంతో తోడి వేసే చర్యలు చేపట్టారు. కాలువ నుంచి రోజురోజుకు నీటి ప్రవాహం పెరగడంతో పుష్కరఘాట్ల గుంతలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుత నీటి పరిస్థితి చూస్తే ఘాట్ నిర్మాణ పనులు ప్రశ్నార్థకంగా మారింది. చిన్నపాటి మట్టికట్టను అడ్డుగా ఏర్పాటు చేసి పనులు చేయాలని చూస్తున్నారు. నీటి నిల్వలోనే పనులు చేస్తే ఘాట్ ఏ మేరకు నిలుస్తుందోనని నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలికంగా నిలిపివేశాం పుష్కరకాలం నాటికి ఘాట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏఈ ఉపేంద్ర తెలిపారు. ప్రస్తుతం నీటి ఉధృతి పెరగడంతో తాత్కాలికంగా పనులను నిలిపివేశాం. నీటిని బయటకు తోడి మట్టికట్టను అడ్డంగా ఏర్పాటు చేసి ఘాట్ల నిర్మాణం చేపడతాం. నాణ్యత ప్రమాణాలతోనే ఘాట్లను నిర్మిస్తామన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాలు
గోదావరి కంటే ఘనంగా నిర్వహించేందుకు కృషి 90శాతం పుష్కరాల పనులు పూర్తి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌రూరల్: కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణా పుష్కరాలు చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్వహిస్తామన్నారు. మండలపరిధిలోని సోమశిలలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జరుగుతున్న ఘాట్ల పనులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.825కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. పుష్కరాలకు సంబంధించి దాదాపు 90శాతం పనులు పూర్తయ్యాయని, పదిశాతమే మిగిలి ఉన్నాయన్నారు. వాటిని ఈనెలాఖరు వరకు పూర్తి చేయడానికి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వచ్చేనెల 5, 6 తేదీల వరకు పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయన్నారు. పుష్కరఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే కృష్ణానదికి నీళ్లు వస్తున్నాయని, పుష్కరాల వరకు పూర్తిస్థాయిలో నదికి నీళ్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సోమశిలకు భక్తులు ఎక్కువగా వస్తారని, ఈ ప్రాంతంలో ఒక్క ప్లాస్టిక్ వస్తువు కనిపించకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పుష్కరాల ఘాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు నిత్యం పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నారన్నారు. షవర్లు ఏర్పాటు చేయాలి: మంత్రి జూపల్లి సోమశిల సమీపంలో జనరల్ ఘాట్ సమీపంలో షవర్లు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కృష్ణానదిలో మునగలేని భక్తులకు షవర్లు ఉపయోగపడతాయన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎప్పటికప్పుడు మైకుల ద్వారా ప్రజలకు అన్ని సమస్యలు, వసతులను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీ ఘాట్ దగ్గర 25ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశామని మంత్రి జూపల్లికి జేసీ రాంకిషన్ తెలిపారు. సోమశిల ఆధ్యాత్మిక ప్రాంతమైనందున ప్రతిరోజూ లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశముందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని జేసీని మంత్రి ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా సోమశిలలో ఏర్పాటు చేసే దుకాణాలను ఊరి బయటనే పెట్టాలని వ్యాపారులకు సూచించారు. అనంతరం సోమశిల జనరల్ పుష్కరఘాట్ వద్ద జంగమ్మగుడి సమీపంలో మంత్రులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, పీఆర్ డీఈ రాములు, జూపల్లి రామారావు, ఎండీ ఎక్బాల్, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం ఇటిక్యాల: కృష్ణా పుష్కరాల ఘాట్ల వద్ద నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. బీచుపల్లి వద్ద పుష్కరఘాట్ల నిర్మాణ పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లకు ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించి, పనులు యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా నిలిచేలా రాష్ట్రప్రభుత్వం కృష్ణాపుష్కరాలను నిర్వహించేందుకు కృషి చేస్తోందన్నారు. పుష్కరఘాట్ల వద్ద ఉన్న ఆలయాలను అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ ఈఓపై ఆగ్రహం బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం మంత్రులు సందర్శించారు. పుష్కర సమయం ముంచుకొస్తున్నా ఆలయం వద్ద అలాంటి వాతావరణం కనిపించక పోవడమేమిటని ప్రశ్నించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద, గర్భగుడి వద్ద ఉన్న సమస్యలు తొలగించాలని చెప్పినా అర్థం కావడం లేదా అని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ గోపురం నిర్మాణ పనులు పుష్కరాల పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు పెబ్బేరు: రంగాపూర్ ఘాట్ వద్ద మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పీ జోగుల చెన్నయ్య, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌనిబుచ్చారెడ్డి, తదితరులున్నారు. -
'చంద్రబాబుకు జీరో మార్కులు'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో రాక్షసపాలన సాగుతోందని పుంగనూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ సంధించిన 100 ప్రశ్నలకు ఇప్పటివరకు వచ్చిన సమాధానాల్లో జీరో మార్కులు వచ్చాయని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల పేరుతో 30 దేవాలయాలను కూల్చివేయించిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కృష్ణా పుష్కరాల పేరు చెప్పి చందాలు అడగడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. -
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ ఆర్ఎం రవివర్మ రాపూరు: కృష్ణా పుష్కరాలకు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం రవివర్మ తెలిపారు. రాపూరు ఆర్టీసీ డిపోలో జరుగుతున్న ప్రమాదరహిత వారోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలకు 50 సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే 150 బస్సుల వరకు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలు రూ.13.45 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తెలిపారు. రాపూరు డిపో రూ.1.35 కోట్ల నష్టంలో ఉన్నట్లు వివరించారు. నష్టాల్లోని డిపోలను పరిశీలించి ఆదాయ మార్గంలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు కలిసి కట్టుగా పనిచేసి ఆర్టీసీని లాభాలబాటలో నడిపేందుకు కృషి చేయాలని కోరారు. రాపూరు నుంచి చెన్నై, తిరుమలకు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరగా, పరిశీలిస్తామన్నారు. అనంతరం మెకానిక్‌లు శ్రీధర్, సునీల్, వేణుకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీటీఎం సత్యనారాయణ,డిఎం ఫయాజ్,ఎస్టీఐ శివయ్య,కార్మికులు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలు పవిత్రమైనవని: జయేంద్ర సరస్వతి
విజయవాడ : వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాలు చాలా పవిత్రమైనవని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర స్నానమాచరించి ప్రతి ఒక్కరూ పుణ్యం పొందాలన్నారు. పుష్కర సమయంలో 33 కోట్ల మంది దేవతలు స్నానమాచరిస్తారని తెలిపారు.