తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు | krishna pushkaralu 2016 starts in telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు

Published Fri, Aug 12 2016 6:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

krishna pushkaralu 2016 starts in telugu states

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ సంతరించుకుంది. విజయవాడలోని దుర్గాఘాట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు చీర,సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా గొందిమళ్లలో సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమరావతి, శ్రీశైలం, విజయవాడతోపాటు మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద పుష్కరస్నానం ఆచరించేందుకు భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement