gondimalla
-
గొందిమళ్లలో గవర్నర్ పుష్కర స్నానం
మహబూబ్‌నగర్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు శనివారం కృష్ణా పుష్కర స్నానం ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గొందిమళ్లలో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఆధికారులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు అలంపూర్ చేరుకుని.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. గురువారం విజయవాడలో పున్నమి ఘాట్‌లో గవర్నర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు దర్శించుకున్న సంగతి తెలిసిందే. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు
హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ సంతరించుకుంది. విజయవాడలోని దుర్గాఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు చీర,సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్లలో సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి, శ్రీశైలం, విజయవాడతోపాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద పుష్కరస్నానం ఆచరించేందుకు భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. -
పాలమూరు జిల్లాకు బయల్దేరిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాకు బయల్దేరారు. రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలను ఆయన ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా అలంపూర్‌కు చేరుకుంటారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి అలంపూర్‌లోని టూరిజం అతిథిగృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం గొందిమళ్లలో ఏర్పాటు చేసిన వీఐపీ పుష్కర ఘాట్‌లో స్నానమాచరించి వేదపండితులు ఏర్పాటు చేసి ప్రత్యేక హారతిలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం వేదపండితుల ఆశ్వీరచనం తీసుకుంటారు. అనంతరం జోగులాంబ దేవాలయాన్ని సందర్శించనున్నారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.