సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీదేవి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో సావనీర్ రూపొందించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. సావనీర్ రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సేకరించి త్వరితగతిన సావనీర్‌ను ప్రచురించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై రూపొందించనున్న సావనీర్‌పై ఏర్పాటు చేసిన కమిటీ అధికారులతో సమీక్షించారు.
ముఖ్యంగా సావనీర్‌లో కృష్ణా పుష్కరాల నిర్వహణకు చేపట్టిన అన్ని చర్యలతో పాటు ప్రచురణలు, ఫొటోలు, ముఖ్యమైన అంశాలన్నీ వచ్చే విధంగా సావనీర్‌ను రూపొందించాలని కమిటీ సభ్యులకు సూచించారు. సావనీర్ వచ్చే పుష్కరాలకు ఒక మంచి రెఫరెన్సు రికార్డులా ఉపయోగపడాలని సూచించారు. సావనీర్‌లో కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన ప్రతీ అంశం, ప్రతీ అనుభవం వచ్చేలా తయారు చేయాలని అన్నారు. డీఆర్‌ఓ భాస్కర్, సెట్మా సీఈఓ హన్మంతురావు, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్‌రెడ్డి‡, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేందర్, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, డీఐఓ డాక్టర్ కృష్ణ, తెలుగు పండిత్ గిరిజారమణ సావనీర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.