కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నాయి.
నల్లగొండ: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు బుధవారం నాగార్జునసాగర్‌లో సమావేశమయ్యారు. సాగర్‌లోని విజయవిహార్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన డీఐజీలు అకున్ సబర్వాల్, సంజయ్‌లతోపాటు పుష్కర ఘాట్లు ఉన్న జిల్లా ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు సుమారు 50 మంది పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ సమస్యపై వారు చర్చిస్తున్నారు.