ముగ్గురు పంజాబ్‌వాసులు గల్లంతు  | Three from Punjab washed away in NSP canal At Khammam District | Sakshi
Sakshi News home page

ముగ్గురు పంజాబ్‌వాసులు గల్లంతు 

Published Wed, Dec 8 2021 4:09 AM | Last Updated on Wed, Dec 8 2021 4:09 AM

Three from Punjab washed away in NSP canal At Khammam District - Sakshi

మనీందర్‌

ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామ సమీపాన నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో పడి ముగ్గురు పంజాబ్‌వాసులు గల్లంతయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన సాజన్‌ (19), మనీందర్‌కుమార్‌(28), గురునాంచంద్‌(28) మేడేపల్లి, కట్టకూరు గ్రామాల్లో వరికోత మిషీన్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి సాగర్‌ కాలువ వద్ద బహిర్భూమికి వెళ్లిన వీరిలో ఒకరు కాలువలోకి జారి పడ్డారు.

ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఇద్దరు కూడా వరద ఉధృతికి గల్లంతైనట్లు తెలుస్తోంది. మం గళవారం ఉదయం కాలువవద్దకు వెళ్లిన గ్రామ స్తులకు ద్విచక్రవాహనం, పాదరక్షలు కనిపించడంతో ఎన్‌ఎస్పీ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు నీటి ఉధృతి తగ్గేలా చర్యలు చేపట్టగా, ఖమ్మం రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ నాగరాజు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం మనీందర్‌కుమార్‌ మృతదేహం లభ్యం కాగా, మిగతా ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement