Punjabi
-
స్లిమ్‌గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!
చాలామంది వెయిట్ లాస్ జర్నీలో అంత ఈజీగా విజయవంతం కాలేరు. ఎన్నో డైట్లు, వర్కౌట్ల అనంతరం స్లిమ్‌గా మారతారు. అయితే కొందరు మాత్రం ఏదో మాయ చేసినట్లుగా తక్కువ వ్యవధిలోనే స్లిమ్‌గా అయ్యిపోతారు. అంత సింపుల్‌గా ఎలా బరువు తగ్గించుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతుంటే..వాళ్లు మాత్రం తాము ఏం చేయలేదని ఇంట్లో వండిన భోజనమే తిన్నమని సింపుల్‌గా చెబుతారు. అలాంటి కోవకు చెందిందే ఈ పంజాబీ నటి, మోడల్, గాయని అయిన హిమాన్షి ఖురానా. ఆమె వెయిట్‌లాస్ స్టోరీ తెలిస్తే కంగుతింటారు. ఆమె ఏం చేసిందంటే..హిమాన్షి ఖురానా ఒక హెల్త్ ప్రోగ్రామ్‌లో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. మానసిక ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తేనే సత్ఫలితాలను పొందగలమని నమ్మకంగా చెబుతుంది. అయితే తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి జిమ్‌కి వెళ్లలేదని తెలిపింది. వారానికి రెండు సార్లు మాత్రం పైలేట్స్ వర్కౌట్లు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. సాధారణ ఆహారంతోనే తాను 11 కేజీల వరకు బరువు తగ్గినట్లు వెల్లడించింది. అలాగే ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోనని చెబుతోంది. ఇంట్లో వండేవన్నీ తింటుందట. ముఖ్యంగా పరాఠాలంటే మహా ఇష్టమట. ప్రతిరోజు అవి తినకుండా రోజు ప్రారంభమవ్వదని అంటోంది. అయితే ఇటీవల బరువు తగ్గడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని అందుకోసం అనారోగ్యకరమైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇది అస్సలు సరైనది కాదని అంటోంది. బరువు తగ్గడం కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం అని నొక్కి చెప్పింది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తే ఆటోమేటిగ్గా బరువు తగ్గడం జరుగుతుందని అంటోంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎలా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో కూడా వివరించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు దారితీసేలా ఒత్తిడికి గురవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తే.. మొత్తం ఆరోగ్యం తోపాటు అధిక బరువు సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని చాలా సింపుల్‌గా చెప్పేసింది నటి, మోడల్ హిమాన్షి ఖురానా. View this post on Instagram A post shared by 𝓗𝓲𝓶𝓪𝓷𝓼𝓱𝓲 𝓴𝓱𝓾𝓻𝓪𝓷𝓪 (@himanshian_) (చదవండి: నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!) -
విభజన రేఖను చెరిపిన విజేతలు
దేశ విభజనానంతరం ఎన్నో పరిణామాలు సంభవించాయి. గత నలభై ఏళ్లలో – విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ భారత్, పాక్ మనుషులు ఒకేలా ఉన్నారు. ఒకే ఆహారం తీసుకుంటున్నారు. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో! బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు ‘పంజాబీయత’కు తగినంత బలమే ఉంది. ఆ బలమే... నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటానికి కారణం అయింది. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. బరిలో ప్రత్యర్థులైనా పరస్పరం సానుకూలంగా మాట్లాడటం, బాంధవ్యాన్ని పంచుకోవటం అసహజత్వానికి దూరంగా ఉన్నాయి.పంజాబీలు పాకిస్తాన్‌ను ఎలా చూస్తారనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది దేశంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. నిజానికి, బెంగాలీలు బంగ్లాదేశ్‌ను ఎలా చూస్తారనే దానిని అందుకు చాలా దగ్గరి సమాంతరంగా నేను ఊహించుకుంటాను. రెండు రాష్ట్రాలు కూడా విభజన వల్ల తమ దేశాలతో వేరైపోయినప్పటికీ, కోల్పోయిన తమ రెండో సగంతో ఉన్న ఆత్మీయతలు, ఆనాటి అమ్మ ఒడి జ్ఞాపకాలు కొడిగట్టిపోలేదు. కాకపోతే అవి తరాల నుండి తరా లకు సంక్రమిస్తున్నట్లుగా ఉంది. బహుశా అందుకే నీరజ్ చోప్రా–అర్షద్ నదీమ్‌ల కథ దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత గల వార్త అయితే, పంజాబీలకు అది – ఇందులో వింతేముందన్నంతగా – ఒక మామూలు సంగతి అయింది. నేను మరికాస్త ముందుకు వెళ్లబోయే ముందు, హరియాణా 1966 వరకు కూడా కొన్ని శతాబ్దాలపాటు అవిభక్త పంజాబ్‌లో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్న సంగతిని మీకు గుర్తు చేయనివ్వండి. లాహోర్, లూథియానా మాదిరిగానే అంబాలా, రోహ్తక్ పంజాబీ ప్రాంతాలు. కాబట్టి, నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటంలో ఆశ్చర్యం లేదు. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. ఒకరితో ఒకరికి తమ గ్రెనడా, ఐరోపా, అమెరికా సహ–అథ్లెట్ల కంటే ఎక్కువగా ఉమ్మడితనం ఉంది. ఆలింగనం, నవ్వు, ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడటం, ఒక బాంధవ్యాన్ని పంచుకోవటం ఇద్దరి మధ్య ఎంతో స్పష్టంగా, అసహజ త్వానికి దూరంగా ఉన్నాయి. ఇలా కాకపోతేనే ఆశ్చర్యం.వారి తల్లుల విషయంలో కూడా ఇది వాస్తవం. వారు తమ కొడు కుతో తలపడిన వారిని ప్రత్యర్థిగా చూడకపోవటానికి కారణం వారు తమ ‘పంజాబీయత’ను అనుభూతి చెందటమే. నిస్సందేహంగా ఇది, వారు మాట్లాడే విధానంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సారూప్యాన్ని వివరిస్తోంది. ‘‘నేను నీరజ్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను’’ అని అర్షద్ తల్లి రజియా పర్వీన్ చెప్పారు. అదే విధంగా నీరజ్ తల్లి సరోజ్ దేవి కూడా ‘‘అతను కూడా నా కుమారుడి లాంటి వాడే’’ అని చెప్పారు. ‘‘బంగారం గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే, వెండి గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే’’ అని ఆమె అన్నారు. నేనంటున్న పంజాబీ బాంధవ్యం అనే దాని గురించి మొదట నాకు 1980లో తెలిసింది. నేనప్పుడు లాహోర్‌లో ఉన్నాను. దేశ సరి హద్దుల ఆవలి ఆ తొలి పర్యటనలో నేను అటువైపు చేరుకునే వరకు కూడా పాకిస్థాన్‌ను నేను ఒక పరాయి దేశంగానే చూశాను. నిజంగా పరాయి దేశమే. కానీ అక్కడి ప్రజలైతే కచ్చితంగా పరాయి వారు కాదు. అలాగే వారికి నేను అపరిచితుడినీ కాదు, గ్రహాంతరవాసినీ కాదు. ఒక సాయంత్రం నేను పాత ‘వాప్డా’(వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ, పాకిస్తాన్) భవనంలోని సల్లూస్ రెస్టారెంట్లో కూర్చున్నాక, ఆ రెస్టారెంట్లో నేను తప్ప మరొకరు లేకపోవటం గమనించాను. ఒంటరిగానే డిన్నర్ చేసి, త్వరగా బయటికి వెళ్లి పోవటానికి సిద్ధం అయ్యాను. ఎంత పొరపాటు! నేను ఇండియా నుంచి వచ్చిన పంజాబీనని కనిపెట్టిన కొద్ది నిమిషాలకే రెస్టారెంట్ సిబ్బంది నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మీతో మాట్లాడవచ్చా అని అడిగారు. నేను అంగీకరించగానే నాతో కలిసి కూర్చున్నారు. ఎంపిక చేసిన ఆహారాన్ని నా కోసం తెప్పించారు. లాహోర్‌లో నేను తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏమిటో చెప్పారు. వెచ్చగా ఉన్న రోటీలను బలవంతంగా పక్కన పెట్టించి, తాజాగా చేయించిన పొగలు కక్కే రోటీలను నా ప్లేటులో ఒక దాని పైన ఒకటిగా వెడ్డింగ్ కేక్‌ను తలపించేలా ఇంత ఎత్తున సర్వ్ చేయిస్తూనే ఉన్నారు. అయితే నేను ఎప్పటికీ మరచిపోలేనివి మాత్రం వారు నన్ను అడిగిన ప్రశ్నలు. ‘‘మీరెప్పుడైనా జలంధర్‌లోని గల్లీ నంబర్ టెన్‌కి వెళ్లారా? అది మా తల్లితండ్రులు నివసించిన ప్రదేశం’’ అని ఒక ప్రశ్న. ‘‘మీరెప్పుడైనా అమితాబ్ బచ్చన్‌ని, రేఖను కలిశారా? నేను వారిని కలవటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను’’ అని ఇంకో ప్రశ్న. ‘‘ఇందిరా గాంధీ గురించి చెప్పండి. ఆమె గురించి ప్రతిదీ తెలుసుకోవాలని ఉంది నాకు’’ అని అత్యంత ఆశ్చర్యకరమైన మరొక ప్రశ్న. తమ తల్లితండ్రులు జీవితాన్ని గడిపిన ప్రదేశం గురించి ఆ ప్రదేశం తమది కూడా అన్నంత ఉద్విగ్నంగా, ఉత్సాహంగా వారు ఉన్నారు. భారతదేశం అన్నది వారికి వేరే దేశం అయుండొచ్చు కానీ, వారి తల్లితండ్రులు జన్మించిన ప్రదేశం ఇప్పటికీ తమ ‘ఇల్లే’. అందు వల్ల నేను వారు కోల్పోయిన దేశం నుంచి వెళ్లిన వ్యక్తినే అయినప్పటికీ, వారు మర్చిపోలేని వ్యక్తిని. ‘సల్లూస్’ ద్వారా వారు కనుగొన్న ఒక బాంధవ్య అనుసంధానాన్ని నేను. ఇప్పుడు, 1980 అంటే... నలభై సంవత్సరాలకు పైమాటే. నాటి నుంచి ఎన్నో పరిణామాలు సంభవించాయి. దేశ విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. అవి మనల్ని ఆకర్షించటం లేదు. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ మనం ఒకేలా ఉన్నాం. ఒకే భాష మాట్లాడుతున్నాం. ఒకే ఆహారం తీసుకుంటున్నాం. ఆఖరికి ఒకేలా శాపగ్రస్థులమై ఉన్నాం. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో, బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు పంజాబీయతకు తగినంత బలమే ఉంది. నీరజ్–అర్షద్‌లు ఒకరికొకరు దగ్గరయ్యేలా చేసింది ఇదే. విదేశాలలో భారతీయులు, పాకిస్తానీలు ఒకరికొకరు – వాళ్లు పంజాబీలు అయినా కాకున్నా – కలివిడిగా ఉండేందుకు కూడా కారణం ఇదే. వారు ఒకరి సమక్షంలో ఒకరు సౌకర్యవంతంగా ఉంటారు. తమ గురించి తాము వివరించాల్సిన అవసరం వారికి లేదు. తమను అర్థం చేసుకుంటారని వారికి తెలుసు. ఉమ్మడి సంస్కృతి విభజన రాజకీ యాల కంటే కూడా శక్తిమంతమైనది. ఇది మన రాజకీయ నాయకు లకు అర్థమైతే బాగుండు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పంజాబ్ ‘ఫుల్కారీ’ కళ.. అదిరిపోయే డిజైన్లు చూశారా (ఫోటోలు)
-
ఆగంతకుడి దాడి, రక్తసిక్తమైన నటుడు.. వీడియో వైరల్
కాలిఫోర్నియా: జోధా అక్బర్సహా పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించిన యువ పంజాబీ నటుడు అమన్ ధలివాల్‌పై అమెరికాలో ఒక ఆగంతకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఛాతీ, మెడ, తల, భుజంపై పలు చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. ఘటన తర్వాత అమన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం ఏమీలేదని వైద్యులు తెలిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గురువారం ఉదయం కాలిఫోర్నియా నగరంలోని గ్రాండ్ ఓక్స్ ప్రాంతంలోని ఒక జిమ్‌లో కసరత్తు చేస్తున్న అమన్పైకి ఒక ఆగంతకుడు కత్తితో దాడి చేసి బందీగా పట్టుకున్నాడు. తాగడానికి నీళ్లు కావాలని అక్కడి వారిని ఆగంతకుడు బెదిరించిన సమయంలో ఒక్కసారిగా అమన్ ఎదురుతిరిగి అతడిని పట్టుకోబోయాడు. ఈ ఘర్షణలో అమన్ గాయాలపాలై రక్తసిక్తమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన జిమ్‌లోని తోటివారు ఆ ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అమన్‌పై ఆగంతకుడు దాడి దృశ్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://twitter.com/ShekharPujari2/status/1636306115502931968 -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్(69)కన్నుమూశారు. గత మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గతేడాదిగా కోమాలో ఉన్నారు. ఈ క్రమంలో పంజాబీలోని లూథియానాలో నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. 1976లో వెండితెరకు పరిచయమైన ఆమె ‘పుట్ జట్టన్ దే’, ‘కీ బాను దునియా దా’, ‘సర్పంచ్’ తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పంజాబ్‌లో టాప్ నటిగా పేరొందిన దల్జీత్ 70 పంజాబీ సినిమాల్లో 10కి పైగా హిందీ చిత్రాల్లో నటించారు.దల్జీత్ కౌర్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
Gun Culture: పంజాబ్‌లో ముఠా సంస్కృతి.. ఇదో రకం రక్తచరిత్ర
అదో గ్రామీణ పంజాబ్ రోడ్డు. తెల్ల కారు, దాని వెనకాల నల్లజీపు. అంతలో హఠాత్తుగా తూటాల శబ్దాలు. ఎర్రగా పరుచుకున్న రక్తపు మడుగు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా తాలూకు ఓ మ్యూజిక్ వీడియోలోని దృశ్యాలివి. ఆయన హత్య జరిగిన తీరు కూడా అచ్చం ఆ వీడియోను తలపించేలా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. పంజాబ్‌లో గాయకులది, గ్యాంగ్స్టర్లది అవినాభావ బంధం. కొందరు సింగర్ల పాటలకు గ్యాంగ్ కల్చరే థీమ్‌గా ఉంటుంది. ఇంకొందరు గాయకులు తమ బకాయిల వసూలుకు గ్యాంగ్స్టర్లను నియమించుకుంటారు. మరోవైపు గ్యాంగస్టర్స్ డబ్బులు దండుకోవడానికి గాయకులను బెదిరిస్తూ ఉంటారు. మొత్తమ్మీద ఇదో రకం రక్తచరిత్ర... సిద్ధూ మూసేవాలా. ‘సో హై’ వీడియో ద్వారా 2017లో పంజాబీ పాప్ ప్రపంచంలో అడుగు పెట్టారు. చూస్తుండగానే అందనత్త ఎత్తుకు ఎదిగారు. ఆయన పాడిన పాటలన్నీ గ్యాంగస్టర్ థీమ్‌తో ఉన్నవే. రెండు చేతులకూ వజ్రాల వాచీలు, చేతిలో ఏకే 47 గన్, దాన్ని పేల్చడానికి శిక్షణ తీసుకోవడం, కారులోంచి నోట్లు వెదజల్లడం వంటి సీన్లతో సిద్ధూ పాటలు యూత్‌ను ఊపేశాయి. ఆయన హత్యకు నెల రోజుల ముందే ముఠా నేరాలకు తెర దించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను సీఎం భగవంత్ మాన్ ఏర్పాటు చేశారు. గ్యాంగస్టర్లే యూత్ ఐకాన్లు విలాస జీవితానికి అలవాటు పడ్డ గ్యాంగ్‌స్టర్స్‌కు పంజాబీ యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈ గ్యాంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టే తమ ఖరీదైన కార్లు, బైకులు, రైఫిళ్ల పోస్టులకు లెక్కలేనన్ని లైకులొస్తుంటాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గ్యాంగ్స్టర్లుగా మారిన వారు ఒక్కసారిగా వచ్చిపడుతున్న భారీ డబ్బును ఆడంబరంగా ప్రదర్శించడం రివాజుగా మారింది. అదే యూత్‌ను బాగా ఆకర్షిస్తూ పంజాబ్‌లో గన్ కల్చర్‌ను పెంచుతోంది. నిరుద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడడం, హై–ఫ్లై లైఫ్‌స్టైల్ వారిని నేర ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి. ఇది కాలేజీ దశ నుంచే మొదలవుతోంది. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ సింగర్లకు, యువ నేతలకు, గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది. లారెన్స్ బిష్ణోయి వంటి గ్యాంగ్స్టర్లు విద్యార్థి దశ నుంచే నేరాల్లో మునిగి తేలుతున్నారు. గతేడాది 70 ముఠాలకు చెందిన 500 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అయినా పలు ముఠాలు రాష్ట్రంలో చురుగ్గా ఉన్నాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు గ్యాంగ్ కల్చర్ ఎందరో గాయకుల నిండు ప్రాణాలు బలిగొంది. 2018 ఏప్రిల్‌లో పరమేశ్ వర్మ అనే గాయకున్ని డబ్బుల కోసం బెదిరించారు. ఇచ్చాక కూడా చంపేశారు. ఇది దిల్‌ప్రీత్‌సింగ్ దహాన్ అలియాస్ బాబా అనే గ్యాంగ్‌స్టర్ పనేనని విచారణలో తేలింది. డబ్బులతో కెనడా పారిపోయి అక్కడ సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉండగా అతన్ని అరెస్టు చేశారు. సిద్ధూ హత్య తమ గ్యాంగ్ పనేనని అంగీకరించిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే గ్యాంగ్‌స్టర్‌గా పేరు మోసిన అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. జస్దీప్ సింగ్ అలియాస్ జగ్గు, గౌండర్ అండ్ బ్రదర్, బాంబిహ గ్రూపులు రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని అమెరికా, కెనడా నుంచి నడుపుతుంటారు. పంజాబీ మ్యుజీషియన్ మంక్రీత్ తుల్లాఖ్ తదితరులకు కూడా ఈ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తుపాకీ స్టైలే...! పంజాబీ పాప్ గీతాల రూటే వేరు. అవి అత్యంత ఆడంబరంగా రూపొందుతాయి. గాయకులు ఖరీదైన బట్టలు వేసుకుంటారు. షూస్, వాచీలు కూడా విదేశాల నుంచి తెప్పించినవే వాడతారు. మెడ నిండా బంగారు గొలుసులు, వేళ్లకు ఉంగరాలు, వజ్రాల వాచీలు అదనపు ఆకర్షణ. చేతిలో స్పోర్ట్స్ గన్ లేదంటే రైఫిల్ తప్పనిసరి. పాటల సాహిత్యం కూడా గన్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. సింగర్ చేతిలో రైఫిల్‌తో స్టైల్‌గా చిందులేస్తూ పాడుతుంటే జనం వెర్రెత్తిపోతుంటారు. ఇలా గన్ కల్చర్ థీమ్‌తో పాటలల్లే సిద్ధూ యూట్యూబ్ చానల్‌కు కోటికి పైగా సబ్స్క్రైబర్లున్నారు! ఇన్‌స్ట్రాగాంలో ఆయనను 85 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు!! పాంచ్ గోలీ (ఐదు తూటాలు) అనే పాటలో తుపాకీ ఎలా పేల్చాలో ఐదుగురు పోలీసు అధికారులు సిద్ధుకు నేర్పే సీన్లువివాదం రేపాయి. పాటల్లో ముఠా సంస్కృతిని, హింసను ప్రేరేపిస్తున్నారంటూ సిద్ధుపై 2020లో కేసులు నమోదయ్యాయి. దేశ జనాభాలో పంజాబ్ వాటా 2 శాతమైతే దేశం మొత్తమ్మీద ఉన్న తుపాకీ లైసెన్సుల్లో 10% అక్కడే ఉన్నాయి! అక్కడ 4 లక్షల దాకా గన్ లైసెన్సులున్నాయి. వాటిని తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల శరవేగంగా పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందిలో 13 మంది దగ్గర గన్స్ ఉన్నాయి. 2020లో రాష్ట్రంలో 362 కాల్పుల ఘటనలు జరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Jeevan Jyot Kaur: ప్యాడ్ ఉమన్.. వాడిన బట్టనే వాడితే అనారోగ్యం.. అందుకే
పదిమంది తప్పుడు మార్గంలో నడుస్తున్నారని, మనం కూడా వారితో కలిసి నడిస్తేనే మనుగడ ఉంటుందనుకోవడం పొరపాటు. ఎవరి మద్దతూ లభించకపోయినా చేసేది మంచి పని అయితే ఒంటరిగా తల వంచుకుని ముందుకు సాగితే ఆ పనికి ఏదో ఒక రోజు గుర్తింపు, గౌరవ మర్యాదలు తప్పకుండా దక్కుతాయని నిరూపించింది ఆమ్ఆద్మీ పార్టీ నేత జీవన్‌జ్యోత్ కౌర్. యాభై ఏళ్ల జీవన్‌జ్యోత్ కౌర్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పుట్టింది. చిన్నప్పటినుంచి చాలా చురుకుగా ఉండే అమ్మాయి. అన్ని విషయాల్లో ఆల్‌రౌండర్‌గా ఉండడమేగాక, మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తరువాత తల్లిదండ్రులు నడుపుతోన్న ‘శ్రీ హేమ్‌కుంత్ ఎడ్యుకేషన్ సొసైటీ(ఎస్హెచ్ఈఎస్)లో పనిచేయాలని నిర్ణయించుకుంది. విద్య, ఆరోగ్య, మహిళల సంక్షేమాభివృద్ధికి పాటుపడే ఎన్జీవో ఇది. దీనిలో అనేక పనుల్లో పాలుపంచుకుంటోంది. ఇలా ఉండగా... పంజాబ్ స్కూళ్లలోని చాలామంది అమ్మాయిలు శానిటరీ న్యాప్కిన్స్ కొనుక్కోలేని పరిస్థితి. దీంతో వాడిన బట్టనే వాడుతూ అనారోగ్యాల బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుసుకుంది జీవన్. అప్పటినుంచి స్కూళ్లకు వెళ్లి ఉచితంగా బాలికలకు ప్యాడ్స్‌ను అందించేది. తరవాత జైళ్లు, ఓల్డేజ్ హోమ్‌లలో పనిచేసే వారి పంపిణీ చేసేది. ఇలా ప్యాడ్స్ పంచుతూ పంజాబీ ప్యాడ్ ఉమెన్‌గా పాపులర్ అయింది. ఇకో షీ రివల్యూషన్ పాండిచ్చేరీకి చెందిన ఇకోఫెమ్మే,, ఇంకా స్విట్జర్లాండ్ కంపెనీలతో కలసి సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రీ యూజబుల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్లను జీవన్ పంపిణీ చేస్తూనే, ఇకో షీ రివల్యూషన్ పేరు మీద రెండు గంటలపాటు రుతుక్రమం మీద అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఐదువందల స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హర్యాణ, బిహార్లలో కూడా నిర్వహిస్తోంది.ఎస్హెచ్ఈ ఎన్జీవోకు జీవన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇకో షీ రివల్యూషన్తోపాటు, ‘ఆబాద్’ బదల్వ్, ఏక్ నయీ సోచ్, ఎస్‌హెచ్‌పీ స్కూల్ వంటి ప్రాజెక్టులను నిర్వహిస్తూ బాలికలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తోంది. సీనియర్లను ఓడించి.. సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే జీవన్‌కు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అస్సలు లేదు. రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంది తను. కానీ జీవన్ తల్లి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీరాభిమాని కావడంతో ఆప్‌లో చేరమని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2015లో జీవన్ ఆప్‌లో చేరింది. పార్టీలో చేరినప్పటినుంచి కష్టపడి అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆప్‌లో అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జీవన్ తన పనితీరుతో పంజాబీ ఉమెన్ వింగ్‌కు కో–ప్రెసిడెంట్‌గానూ, తరువాత అమృత్సర్ ఆప్ ప్రెసిడెంట్‌గానూ ఎంపికైంది. 2019 నుంచి మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీ ప్రచార కోఆర్డినేటర్‌గా మారింది. తరువాత ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా మారింది. అంకిత భావంతో పనిచేస్తూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసింది. ఈ ఎన్నికల్లో ఎంతో సీనియర్ నాయకులైన నవజ్యోత్ సింగ్ సిద్ధు, అకాలీ దల్ నాయకుడు విక్రమ్ సింగ్ మజితాయ్లను ఓడించి చరిత్రాత్మక విజయం సాధించింది. మనమే పూలబాటగా మార్చుకోవాలి ‘‘ఎమ్ఎల్ఏగా గెలిచినప్పటికీ మహిళా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాను. 117 పంజాబ్ అసెంబ్లీలో స్థానాల్లో కేవలం 13 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా మహిళలను ప్రగతి పథంలో నడిపించడమేగాక, మరింతమందిని రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకురావడానికి కృషిచేస్తాను. ఏదీ కష్టమైన పనికాదు. యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. యువత రాజకీయాల్లోకి రావాలి. మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడం, నిరుద్యోగ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఎవరికి పూలబాటలు పరిచి ఉండవు, ఒక్కో ముల్లును తీసేసి మీ బాటను మీరే పూలబాటలా మార్చుకోవాలి’’ అని యువతకు బోధిస్తున్నారు కౌర్. -
పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి
-
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి
చండీగఢ్: ప్రముఖ పంజాబీ నటుడు, గణతంత్ర వేడుకల అల్లర్ల కేసులో దోషి దీప్ సిద్ధూ(37) రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం స్నేహితురాలితో కలిసి స్కార్పియో వాహనంలో ఢిల్లీ నుంచి భటిండా వెళ్లున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. కారు డ్రైవర్‌వైపు భాగమంతా ట్రక్కులోకి చొచ్చుకుపోయింది. దీంతో సిద్ధుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చదవండి: (ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత) పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్ని తదితరులు దీప్ మృతి పట్ల సంతాపం తెలిపారు. 2021 జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో రైతులు ఢిల్లీలో చేసిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని సిద్ధు వార్తల్లో నిలిచారు. ఎర్రకోటపై దాడికి రైతులను ప్రేరేపించారంటూ సిద్ధూపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 9న హరియాణాలోని కర్నాల్‌లో ఆయనను అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చినా, చార్జిషీటు దాఖలు అనంతరం మేలో మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. పంజాబ్‌లోని ముక్త్సర్కు చెందిన దీప్ నటునిగా మారకముందు లాయర్‌గా కూడా పని చేశారు. చదవండి: (ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత) -
భారత సంతతి అమృతపాల్ సింగ్ మాన్కు యూకే గౌరవ జాబితాలో చోటు !
లండన్‌కు చెందిన భారతీయ సంతతికి చెందిన రెస్టారెంట్ అమృత్‌పాల్ సింగ్ మాన్‌కి యూకే నూతన సంవత్సర గౌరవాల జాబితాలో చోటు దక్కింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సుమారు 2 లక్షల మందికి పైగా నిరుపేదలకుకి భోజనాన్ని అందించిన గొప్ప మహోన్నత పరోపకారి అమృతపాల్ సింగ్ మాన్. స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఓబీఈ అవార్డును పొందారు. (చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!) అంతేకాదు న్యూ ఇయర్ గౌరవ జాబితా 2022లో క్వీన్ సత్కరించబడిన వారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఆయన్ను చాలా మందికి అమృత్ మాన్ అని పిలుస్తారు. ఆయన చాలా సంవత్సరాలుగా నిరాశ్రయులు, సాయుధ దళాలు, వారసత్వం కళలతో కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు తనవంతు మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఆయన యూకే తొలి పంజాబీ రెస్టారెంట్‌గా అతని ముత్తాత 1946లో స్థాపించిన కోవెంట్ గార్డెన్‌లోని పంజాబ్ రెస్టారెంట్ ఎండీగానే యూకేలో ఎక్కువమందికి తెలుసు. ఈ మేరకు యూకే లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ ఉటింగ్ మాట్లాడుతూ...."సిక్కు సమాజంలో గుర్తింపు పొందిన నాయకుడిగా, అమృత్ మాన్ చాలా మంది సిక్కులు నివసించే విభిన్న దేశంలో వారి గుర్తింపు ఏమిటో, వారి సంస్కృతిని ఎలా కొనసాగించాలో నిర్వచించడంలో సహాయపడటానికి చాలా కష్టపడ్డారు. ఇందులో భాగంగా సాయుధ బలగాలకు అతని మద్దతు అద్భుతంగా ఉంది. అతని సహాయం లేకుండా సిక్కు సమాజంలో ప్రస్తుతం ఉన్న ప్రగతిని సాధించగలమా! అనే సందేహం కలుగుతుంది. ఆయనతో కలిసి అనేక సందర్భాల్లో పనిచేసినందున, ఈ గౌరవానికి ఆయన అర్హులు" అని అన్నారు. ఈ క్రమంలో అమృత్ మాన్ మాట్లాడుతూ..." నేను గౌరవానికి సంబంధించిన ఇమెయిల్ నోటిఫికేషన్‌ను స్వీకరించినప్పుడు నమ్మలేకపోయాను. ఈ గౌరవం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గుర్తింపు దాతృత్వ పనిని మరింతంగా కొనసాగించాలనే తన సంకల్పాన్ని బలపరుస్తుంది అని" అమృత్ మాన్ అన్నారు. (చదవండి: చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!) -
ముగ్గురు పంజాబ్‌వాసులు గల్లంతు
ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామ సమీపాన నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో పడి ముగ్గురు పంజాబ్‌వాసులు గల్లంతయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సాజన్ (19), మనీందర్‌కుమార్(28), గురునాంచంద్(28) మేడేపల్లి, కట్టకూరు గ్రామాల్లో వరికోత మిషీన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి సాగర్ కాలువ వద్ద బహిర్భూమికి వెళ్లిన వీరిలో ఒకరు కాలువలోకి జారి పడ్డారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఇద్దరు కూడా వరద ఉధృతికి గల్లంతైనట్లు తెలుస్తోంది. మం గళవారం ఉదయం కాలువవద్దకు వెళ్లిన గ్రామ స్తులకు ద్విచక్రవాహనం, పాదరక్షలు కనిపించడంతో ఎన్ఎస్పీ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు నీటి ఉధృతి తగ్గేలా చర్యలు చేపట్టగా, ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ నాగరాజు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం మనీందర్‌కుమార్ మృతదేహం లభ్యం కాగా, మిగతా ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. -
బంజారా పాట.. అదిరిపోయే స్టెప్పులతో రష్యన్ల ఆట!
మాస్కో: కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. అలాగే భారతీయ సంగీతంలో ఓ మాయాజాలం ఉంది. పాట సాహిత్యాన్ని అర్థ చేసుకోకపోయినా.. భారతీయ పాటల బీట్స్‌కి ఎవరైనా కాలు కదపవచ్చు. అయితే తాజాగా ఓ రష్యన్ల బృందం పంజాబీలో ‘‘ముండియన్ తు బాచ్ కే’’ అనే ప్రసిద్థ పాటకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. డ్యాన్స్ గ్రూపులోని పురుషులు, మహిళలు భారతీయ వేషధారణలో ఉన్నారు. మహిళలు ఎరుపు లెహోంగా-చోలి ధరించగా.. పురుషులు కుర్తా-పైజామా ధరించి, సరియైన భావ వ్యక్తీకరణలతో నృత్యం చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి నాట్యానికి, నటనకు ఫిదా అవుతున్నారు. వందలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘కళకు సరిహద్దులు లేవు.. మీ డ్యాన్స్‌కి నేను ఫిదా!’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ భారతీయ సంస్కృతిలో 64 కళలు.. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. మీ నృత్య ప్రదర్శన భలే ఉంది.’’ అని రాసుకొచ్చారు. #Russians and #Bhangra beats. pic.twitter.com/fb4lqFgPSn — Rupin Sharma IPS (@rupin1992) July 6, 2021 -
పహిల్వాన్ డోలు
అది చలికాలం. చల్లని నల్లని అమావాస్య రాత్రి. మలేరియా, కలరా రోగాలతో ఆ ఊరంతా భయాక్రాంతుడైన బాలుడి మాదిరి వణికిపోతూ ఉంది. నశించిపోయిన పాత వెదురు బోద గుడిసెల్లో చీకటి– నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకటే చీకటి స్తబ్దత.చీకటి రాత్రి కన్నీరు కారుస్తోంది. స్తబ్దత కరుణతో కూడిన వెక్కిళ్లనూ దుఃఖాన్నీ బలవంతంగా తన హృదయంలో నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. భూమిపైన వెలుతురు అనే మాటే లేదు. ఆకాశంలో నుంచి ఊడబడాలని ఏ నక్షత్రమైనా అనుకున్నా దాని వెలుతురూ, శక్తి మార్గమధ్యంలోనే నశిస్తాయి. మిగతా నక్షత్రాలు దాని భావుకత, అసమర్థతను చూసి కిలకిలా నవ్వుకుంటాయి. నక్కల ఊళలు, గుడ్లగూబల భయంకరమైన కూతలు అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. ఊరిలోని గుడిసెల నుంచి ఏడుపులు, వాంతులు చేసుకునే శబ్దాలు, ‘‘అయ్యో దేవుడా, ఓరి భగవంతుడా!’’ వంటి కేకలు మాత్రం వినపడుతున్నాయి. అమ్మా, అమ్మా అంటూ నీరసించిన గొంతులతో పిల్లల అరుపులు వినబడుతున్నాయి. కానీ వీటివల్ల రాత్రి స్తబ్దతలో ఎలాంటి మార్పులూ లేవు.పరిస్థితులను పసిగట్టే గొప్ప నేర్పు కుక్కలకుంటుంది. అవి పగలంతా గుట్టలపైన మూటల్లా ముడుచుకుని దిగులుగా పడి ఉంటాయి. రాత్రి వేళల్లో అన్నీ కలిసి ఏడుస్తుంటాయి. రాత్రిళ్లు ఈ విధంగా భయంకరంగా గడిచిపోతూ ఉంటే, దొమ్మరివాడి డోలు మాత్రం నిరంతరం మోగుతూ ఉండేది. సాయంత్రం అయినప్పటి నుంచి తెల్లారేదాకా ‘ఫట్.. థా గిడ్... థా.. ఫట్.. థా గిడ్.. థా.. ’ (అంటే.. రా, ఢీకొను రా, ఢీకొను) అనే శబ్దం ఒకే తాళగతిలో మోగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ‘చటాక్ చట్థా.. చటాక్.. చట్ థా’ (అంటే ఎత్తి కింద పారేయి.. ఎత్తి కింద పారేయి) అనే శబ్దాలు వినిపిస్తాయి. మృత్యుముఖంలో ఉన్న ఆ ఊళ్లో ఆ డోలు శబ్దాలే సంజీవని శక్తిగా పనిచేసేవి.లుట్టన్ సింగ్ పహిల్వాన్‌ను హోల్ ఇండియా ప్రజలకు తెలుసునని అంటూ ఉంటాడు. కానీ అతని హోల్ ఇండియా హద్దు ఒక జిల్లా వరకు మాత్రమే. ఆ జిల్లాలోని ప్రజలకందరికీ అతను తెలుసు.లుట్టన్ తల్లిదండ్రులు అతని తొమ్మిదేళ్ల వయసప్పుడే అతన్ని అనాథగా మిగిల్చి చనిపోయారు. అదృష్టం కొద్దీ అప్పటికే అతనికి పెండ్లి అయింది. లేకపోతే తల్లిదండ్రులతో పాటు అతనూ గతించేవాడు. విధవరాలైన అత్త అతన్ని పెంచి పెద్ద చేసింది. బాల్యంలో ఆవులను మేపుతూ, వాటి పాలు తాగుతూ, కసరత్తు చేస్తూ గడిపేవాడు. పల్లె ప్రజలు అతని అత్తను నానా విధాలుగా బాధించేవారు. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అతని బుర్రలో కసరత్తు నేర్చుకోవాలనే బుద్ధి పుట్టింది. క్రమం తప్పకుండా కసరత్తు చేయడం వల్ల బాల్యావస్థలోనే అతని ఛాతీ, బాహువులు బలిష్టంగా తయారయ్యాయి. పుష్టికరమైన కండరాలు ఏర్పడ్డాయి. యవ్వనంలోకి అడుగుపెడుతూనే పల్లెలోకెల్లా మంచి పహిల్వాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతనికి భయపడేవారు తాను రెండు వైపులా చేతులను నలభై ఐదు డిగ్రీల కోణంలో చాపి– పహిల్వాన్ల మాదిరిగా నడిచేవాడు. అతను కుస్తీ కూడా పట్టేవాడుఒకనాడు అతడు కుస్తీ చూడ్డానికి శ్యామ్‌నగర్ జాతరకు వెళ్లాడు. పహిల్వాన్ల కుస్తీలో వాళ్ల పట్టు విడుపులు చూస్తూ ఊరకుండలేకపోయాడు. యవ్వనపు వేడి, మదం వల్ల డోలు శబ్దాలకు అతని రక్తనాళాలు వేడెక్కాయి. ముందు వెనుకా చూడకుండా కుస్తీలో ‘‘సింహం పిల్ల’’తో సవాలు చేశాడుఆ సింహంపిల్ల అసలు పేరు చాంద్ సింగ్. వాడు పంజాబ్ నుంచి తన గురువు బాదల్ సింగ్ వెంట తొలిసారి శ్యామ్‌నగర్ జాతరకు వచ్చాడు. అందమైన యువకుడు. వచ్చిన మూడు రోజుల్లోనే పంజాబ్–పఠాన్ల పహిల్వాన్ల దళంలోని తన సరిజోడు పహిల్వాన్లందరినీ నేల కరిపించి, ‘‘సింహంపిల్ల’’ అనే బిరుదు పొందగలిగాడు. అతను కుస్తీ మైదానంలో లంగోటా బిగించి చెంగు చెంగున విజయగర్వంతో హర్షధ్వనులు చేస్తూ గుర్రంపిల్ల మాదిరిగా ఎగురుతూ ఉండేవాడు. అతని దెబ్బకు అక్కడి యువ పహిల్వాన్లు అందరూ కుస్తీ మాటంటేనే భయపడేవారు. తన బిరుదును నిలుపుకొనేందుకు చాంద్ సింగ్ మధ్య మధ్యలో కుస్తీకి ఎవరైనా ఉంటే రమ్మని కాలు దువ్వేవాడు. వేటలూ, కుస్తీలంటే చెవి కోసుకునే శ్యామ్‌నగర్ వృద్ధ మహారాజా చాంద్సింగ్ను తన దర్బారులో పహిల్వాన్‌గా ఉంచుకోవాలని అనుకుంటుండగానే లుట్టన్ ఆ సింహంపిల్లతో పోటీ పడతానని సవాలు చేశాడు. బిరుదు పొందిన చాంద్ సింగ్.. లుట్టన్ సవాలు విని నవ్వుకున్నాడు. వెంటనే డేగ మాదిరి అతని మీదకు లంఘించాడు.నిశ్శబ్దంగా ఉన్న ప్రేక్షకుల గుంపులో కలకలం మొదలైంది. ‘‘పిచ్చోడు.. పిచ్చి ముండాకొడుకు... చచ్చచ్చ.. చచ్చ’’... ఓహో! గొప్పోడే. లుట్టన్ చాకచక్యంగా దాడిని తప్పించుకుని లేచి నిలబడ్డాడు. మహారాజా కుస్తీని ఆపు చేయించి, లుట్టన్ను తన వద్దకు పిలిపించుకుని సముదాయించాడు. అతని ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పదిరూపాయల నోటు చేతికందించి ‘‘పో.. జాతర చూసి ఇంటికి పో..’’ అన్నాడు. ‘‘లేదు మహారాజా! కుస్తీ పడతాను. తమరు ఆజ్ఞాపించండి.’’‘‘పో.. పిచ్చోడా’’‘‘శరీరంలో శక్తి లేకపోయినా సింహంపిల్లతో కుస్తీ పట్టవచ్చావుటరా.. రాజావారు ఇంతగా నచ్చచెబుతున్నా కుస్తీ మానుకోకపోతే నీకు పుట్టగతులుండవు’’ అని మేనేజరు, భటులు అతన్ని బెదిరించారు.‘‘మీపై ఒట్టు దొరా! మీ ఆజ్ఞయే తరువాయి మహారాజా... కుస్తీ పట్టనివ్వండి దొరా. లేకపోతే ఇక్కడే ఈ రాతికి తల బద్దలుగొట్టుకుని చస్తాను’’ చేతులు జోడించి వేడుకున్నాడు. గుంపులో కలవరం మొదలైంది. పంజాబ్ పహిల్వాన్ల దళం కోపంతో లుట్టన్పై తిట్ల వర్షం కురిపించసాగింది. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. వాళ్లల్లో కొందరు లుట్టన్ తరఫున కేకలు చేస్తూ అతన్ని కుస్తీ పట్టనివ్వండి అని అరిచారు. చాంద్ సింగ్ ఒక్కడే మైదానంలో నవ్వుకుంటూ నిలబడ్డాడు. మొదటి పట్టులోనే తన ప్రత్యర్థి శక్తి ఏమిటో అతనికి అర్థమైంది.రాజావారు గత్యంతరం లేక ఆజ్ఞ జారీ చేశారు. ‘‘సరే కుస్తీ పట్టండి.’’డోలు మోగటం మొదలైంది. ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది. గుంపులో కోలాహలం ప్రారంభమైంది. జాతరలోని దుకాణదారులందరూ దుకాణాలను మూసివేసి ‘‘చాంద్ సింగ్‌కి సమ ఉజ్జీ దొరికాడు. కుస్తీ జరుగుతూంది’’ అని పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘చట్ థా.. గిడ్ థా.. చట్ థా.. గిడ్ థా..’’ ఇంతవరకు మూగబోయిన డోలు పెద్ద శబ్దంతో మోగింది. ‘‘డాక్ డినా, డాక్డినా డాక్ డినా’’ (అంటే వాహా, భలే భలే) శబ్దం చేస్తూ డోలు మోగింది. చాంద్ సింగ్ లుట్టన్ సింగ్‌ను గట్టిగా నొక్కి పట్టాడు.‘‘అయిపోయే! లుట్టన్ సింగ్ బజ్జీ అయిపోయే! సింహంపిల్లతో ఢీకొనడం నవ్వులాటా మరి’’ అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ‘చట్ గిడ్థా, చట్ గిడ్థా, థట్గిడ్థా’ (భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు) అంటూ డోలు మార్మోగింది. లుట్టన్ మెడపై మోచేతిని ఆనించి నేల పడేసే ప్రయత్నంలో చాంద్ సింగ్ ఉన్నాడు.‘అక్కడే పడెయ్యి’ అంటూ బాదల్ సింగ్ తన శిష్యుణ్ణి ఉత్సాహపరచాడు.లుట్టన్ కన్నులు బయటకొచ్చాయి. ఉఛ్ఛ్వాశ నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. గుంపులోని ఎక్కువమంది జనం చాంద్సింగ్ పక్షం చేరి, అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. లుట్టన్ పక్షాన డోలు మాత్రం మోగుతోంది. డోలు మోత ప్రకారం అతను తన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ తలపడుతున్నాడు. ఉన్నట్టుండి డోలు నెమ్మదిగా మోగసాగింది.‘‘డక్ డినా– తిర్కిట్తినా, డక్డినా తిర్కిట్తినా’’ (అంటే పోటీ విరమించుకో, బయటకొచ్చేసేయి) అని లుట్టన్ సింగ్‌కు డోలు చేసిన ఈ శబ్దాలు వినపడ్డాయి. ఉన్నట్టుండి లుట్టన్ పట్టు నుంచి జారుకొని బయటకొచ్చి వెంటనే చాంద్సింగ్పైకి ఉరికి మెడ పట్టేశాడు. ‘‘శభాష్, భలే! మట్టిలో మాణిక్యానివిరా!’’‘‘సరే, ఆహా! బయటికొచ్చాడా?’’ అందువల్లనే కదా జనం లుట్టన్ వైపు మొగ్గారు.‘ఛటాక్ ఛట్ థా.. ఛటాక్ ఛట్ థా’ (ఎత్తి పడెయ్యి, ఎత్తి పడెయ్యి) అని గట్టిగా డోలు మోగింది. లుట్టన్ చాలా చలాకీగా ఎత్తుకు పై ఎత్తు వేసి చాంద్ సింగ్‌ను కింద పడేశాడు.‘థిగ్ థినా, థిగ్ థినా’ (వెల్లకిలా పడెయ్యి, వెల్లకిలా పడెయ్యి) అని డోలు మోగింది.లుట్టన్ సింగ్ శక్తినంతా బిగపట్టి చాంద్ సింగ్‌ను వెల్లకిలా పడేసి ఓడించాడు. ‘థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్’ (శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్) అని డోలు మోగింది.ప్రేక్షకులు ఎవరికి జేజేలు పలకాలో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ల వాళ్ల ఇష్టానుసారం కొంతమంది ‘దుర్గా మాతకు జై’ అంటే మరికొందరు ‘మహావీరునికి జై’ పలికారు. మరికొందరు శ్యామానంద మహారాజుకు జై పలికారు. ఆఖరికి సామూహికంగా జేజేలతో ఆకాశం మార్మోగింది.విజయోత్సాహంతో లుట్టన్ ఎగురుతూ గంతులేస్తూ, తొడలు చరుస్తూ అందరి కంటే ముందు వాద్యగాళ్ల వద్దకు పరుగున వెళ్లి భక్తిపూర్వకంగా డోలుకు నమస్కరించాడు. తర్వాత పరుగున వెళ్లి రాజాగారిని పైకెత్తుకున్నాడు. రాజావారి విలువైన దుస్తులకు మట్టి అంటుకుంది. ‘అరె, అరే .. ఏమిటిది?’ మేనేజరుగారు మందలించారు. రాజావారు మాత్రం అతన్ని తన హృదయానికి హత్తుకొని ఆనంద పారవశ్యంతో ‘‘వర్ధిల్లు పహిల్వాన్ వర్ధిల్లు! నీవు ఈ రాజ్య గౌరవాన్ని నిలబెట్టావు’’ అన్నారు. పంజాబీ పహిల్వాన్లు చాంద్ సింగ్ కన్నీళ్లు తుడవసాగారు. రాజావారు లుట్టన్ సింగ్‌కు బహుమానాలు ఇవ్వటమేగాక అతన్ని ఆస్థానంలో నియమించుకున్నారు. అప్పటి నుంచి లుట్టన్ రాజాస్థానంలో పహిల్వాన్ అయ్యాడు. రాజావారు గౌరవంగా అతన్ని లుట్టన్ సింగ్ అని పిలువసాగారు. మిగతా ఆస్థాన పండితులకు అది నచ్చలేదు. ‘‘ప్రభూ! వీడి జాతి ఏమిటి? వీడిని సింగ్ అని పిలవడం బాగులేదు’ అన్నారు.మేనేజరు క్షత్రియుడు. తన క్లీన్షేవ్డ్ ముఖాన్ని చిట్లిస్తూ ముక్కులోని వెంట్రుకలను లాగసాగాడు. క్షణంలో ఒక వెంట్రుకను లాగేసి దాన్ని నలుపుకుంటూ ‘‘అవును మహాప్రభూ! ఇది అన్యాయమే’’ అన్నాడు.‘‘అతడు క్షత్రియుడు చేయవలసిన పనే చేశాడు’’ రాజావారు చిరునవ్వుతో అన్నారు. ఆ రోజు నుంచే లుట్టన్ సింగ్ పహిల్వాన్ కీర్తి ప్రతిష్ఠలు దూర తీరాలకు వ్యాపించాయి. కొద్ది సంవత్సరాల్లోనే అతడు పేరుగాంచిన పహిల్వాన్లను ఒక్కొక్కరినే మట్టికరిపించాడు. అప్పుడు కాలాఖాన్ అనే మరో పేరుపొందిన పహిల్వాన్ ఉండేవాడు. కాలాఖాన్ లంగోటీ బిగించి, ఆలే అని ప్రత్యర్థి పైకి ఉరికితే, ప్రత్యర్థికి వణుకు పుట్టేదని ప్రతీతి. లుట్టన్ సింగ్ అతన్ని కూడా ఓడించి వాళ్ల భ్రమలను తొలగించాడు.క్రమంగా అతను ప్రదర్శనశాలలో ఒక వస్తువుగా తయారయ్యాడు. జంతు ప్రదర్శనశాలలో ఇనుపబోను ఊపుతూ పులి గాండ్రించినట్లు అతను హా హూ.. హా హూ అని అరిచేవాడు. అతని అరుపులు విని, రాజావారి పులి అరుస్తోంది అనేవారు. జాతరలో అతను మోకాళ్ల వరకు అంగీ వేసుకుని, చిందరవందరగా తలపాగా కట్టి, మదించిన ఏనుగులా ఊగుతూ నడిచేవాడు. దుకాణదారులు తమ అంగడి వద్దకు పిలిచి, ‘‘పహిల్వాన్ గారూ! వేడి వేడి రసగుల్లాలు రెడీగా ఉన్నాయి.. నాలుగైదు ఆరగించండి’’ అని వేళాకోళం చేసేవారు.లుట్టన్సింగ్ పహిల్వాన్ చిన్నపిల్లాడి మాదిరి నవ్వుకుంటూ ‘అరే నాలుగైదు తింటే ఏమవుతుంది? తీసుకురా ఒకటి, రెండు శేర్లు’ అని అక్కడే కూర్చునేవాడు.రెండుశేర్ల రసగుల్లాలు తిని, పది పన్నెండు పాన్ చిలకల్ని నోట్లో కుక్కుకుని, గడ్డానికి పాన్ రసాన్ని కార్చుకుంటూ జాతరలో తిరిగేవాడు. జాతర నుంచి రాజ దర్బారుకి తిరిగొచ్చేటప్పటికి అతని ఆకృతే మారిపోయేది. కండ్లకు రంగుల అభ్రకపు కళ్లజోడు, చేతుల్లో నాట్యం చేసే బొమ్మ, నోట్లో ఇత్తడి పీకను ఊదుకుంటూ నవ్వుకుంటూ తిరిగొచ్చేవాడు. శారీరక వృద్ధి సామర్థ్యాలు పెంపొందుతున్నాయి గాని, బుద్ధి మాత్రం క్షీణిస్తూ చిన్నపిల్లల స్థాయికి చేరుకుంది. కుస్తీ మైదానంలో డోలు శబ్దం వింటూనే తన స్థూలకాయాన్ని ప్రదర్శించడం ప్రారంభించేవాడు. అతనికి సమ ఉజ్జీ దొరికేవాడే కాదు. ఒకవేళ ఎవరైనా అతనితో పోటీ పడాలంటే రాజావారు అనుమతించేవారు కాదు. అందువల్లే పాపం అతను నిరాశతో లంగోటీ బిగించి, దేహానికి మట్టి పూసుకుని, ఎగురుతూ గంతులేస్తూ ఉండేవాడు. తనను దున్నపోతు, ఆంబోతుగా నిరూపించుకుంటూ తిరిగేవాడు. ముసలివాడైన రాజు అతన్ని చూసి మురిసిపోయేవాడు.ఇలా పదిహేనేళ్లు గడిచిపోయాయి. పహిల్వాన్ మాత్రం అజేయుడిగా నిలిచిపోయాడు. కుస్తీ మైదానంలోకి లుట్టన్ సింగ్ తన ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చేవాడు. పహిల్వాన్ అత్త ఎప్పుడో మరణించింది. ఇద్దరు పిల్ల పహిల్వాన్లకు జన్మనిచ్చిన కొద్ది రోజులకు అతని భార్య పరమపదించింది. ఇద్దరు పిల్లలూ తండ్రిని మించిన తనయులు అవుతారు అనేవారు.ఇద్దరినీ పిల్లవాళ్లుగా ఉన్నప్పుడే కాబోయే రాజ మల్లులుగా ప్రకటించారు రాజావారు. అందువల్ల వారి పోషణ భారమంతా రాజదర్బారే చూసేది. ప్రతిరోజూ ప్రాతఃకాలాన్నే పహిల్వాన్ స్వయంగా డోలు వాయిస్తూ పిల్లల చేత కసరత్తు చేయించేవాడు. మధ్యాహ్నంపూట విశ్రమిస్తూనే ఇద్దరికీ ప్రపంచజ్ఞానం బోధించేవాడు.‘‘డోలు ధ్వనులపై దృష్టి కేంద్రీకరించండి. నాకు గురువు ఎవ్వరూ లేరు. ఈ డోలే నా గురువు. ఈ డోలు ధ్వనుల ప్రభావం వల్లనే నేను పహిల్వాన్ కాగలిగాను. కుస్తీ మైదానంలోకి అడుగిడగానే డోలుకు నమస్కారం చేయాలి. తెలిసిందా.’’... ఈ మాదిరి ఎన్నో విషయాలు బోధించేవాడు. ఇవే కాకుండా రాజావారిని ఏవిధంగా సంతోషపరచాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి మొదలైన విషయాలను వారికి బోధించేవాడు.కానీ ఏం లాభం? అతని బోధనలన్నీ వ్యర్థమయ్యాయి. రాజావారు స్వర్గస్తులయ్యారు. రాజ కుమారుడు విదేశాల నుంచి తిరిగొచ్చి రాజ్యపాలనా భారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నాన్నగారి కాలంలోని వైఫల్యాలన్నీ తొలగించి, కట్టుదిట్టాలు చేశాడు. కొన్ని కొత్త మార్పులు చేశాడు. ఆ మార్పుల కారణంగా పహిల్వాన్‌గిరీ ఊడిపోయింది. కుస్తీ మైదానాన్ని గుర్రపు పందేలా మైదానంగా మార్చారు.పహిల్వాన్లు కాబోయే రాజమల్లుల దినసరి భోజన ఖర్చు వివరాలు తెలియగానే ‘టెరిబుల్’ అన్నాడు కొత్త రాజు.రాజాస్థానంలో ఇంకెంత మాత్రం పహిల్వాన్ల అవసరం లేదని స్పష్టంగా హుకుం జారీ చేశాడు. పహిల్వాన్‌కు తన గోడు తెలుపుకునే అవకాశం సైతం దొరకలేదు.అదేరోజు డోలును మెడకు తగిలించుకుని కొడుకులను వెంట తీసుకుని పహిల్వాన్ తన ఊరు చేరుకున్నాడు. ఊరిలో ఒక మూల ఊరివారందరూ కలిసి ఒక గుడిసె వేయించి ఇచ్చారు. అక్కడే ఉంటూ ఊరి యువకులకు, పశువుల కాపర్లకు కుస్తీ నేర్పుతూ వచ్చాడు. తిండితిప్పలు ఊరిలో వాళ్లు చూసేవారు. ఉదయం, సాయంత్రం డోలు వాయిస్తూ శిష్యులకు, తన కొడుకులకు కుస్తీలోని పట్టు విడుపులు నేర్పేవాడు .ఆ ఊరిలోని రైతుల పిల్లలకూ, వ్యవసాయ కూలీల పిల్లలకూ సరైన తిండి లేదు. ఇక కుస్తీ ఎలా నేర్చుకోగలరు? క్రమక్రమంగా పహిల్వాన్ స్కూలు ఖాళీ అయింది. ఆఖరికి డోలు వాయిస్తూ తన ఇద్దరు కొడుకులకే కుస్తీలోని పట్టువిడుపులు నేర్పుతూ ఉండేవాడు. దినమంతా ఇద్దరు కొడుకులు కూలి నాలి చేసి సంపాదించిన సొమ్ముతోనే జీవితం గడిపేవాడు.ఉన్నట్టుండి ఆ ఊరికి ఆపద వచ్చిపడింది. అనావృష్టి. తిండి గింజల లేమి. ఆ తర్వాత మలేరియా, కలరా రెండూ కలసి పల్లెను సర్వనాశనం చేయసాగాయి.ఆ ఊరు ఒక విధంగా ఖాళీ అయింది. ఇండ్లకు ఇండ్లు ఖాళీ అయిపోయాయి. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు శవాలుగా మారేవారు. పల్లెవాసుల్లో కలవరం మొదలైంది. రోజంతా కలవరం, వ్యాకులత, హృదయాన్ని కరిగించే ఏడుపులతో గడిచిపోగా, ప్రజల ముఖాల్లో సూర్యుని వెలుగుతో పాటు కొంచెం వెలుగు కనపడేది. సూర్యోదయం అవుతూనే ఏడుస్తూ, మొత్తుకుంటూ తమ ఇండ్ల నుంచి బయటికొచ్చి ఇరుగుపొరుగు వారితో, బంధువులతో కలసి పరస్పరం ధైర్యం చెప్పుకొనేవారు.‘‘ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం కోడలా, పోయినవాడు పోయాడు. వాడు నీవాడు కాదనుకో. ముందు జరగవలసిన దానిని గురించి ఆలోచించుకో’’ అని..‘‘తమ్ముడూ! ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఎంతకాలం ఏడుస్తావు? శవంపై కప్పేదానికి గుడ్డ కావాలంటావా, దాని అవసరం ఏమిటి? శవాన్ని నదిలో కలిపేసి రారాదా’’ అనే మాటలు ఊరంతా వినిపించేవి.సూర్యాస్తమయం అవుతూనే ఊరివారంతా తమ తమ గుడిసెల్లో దూరి నిశ్శబ్దంగా పడి ఉంటారు. అప్పుడు వాళ్లకు మాట్లాడే శక్తి కూడా ఉండదు. తల్లి పక్కనే ప్రాణాలు కోల్పోతున్న కొడుకును, కొడుకా అని పిలిచే ధైర్యం తల్లులకు ఉండదు.రాత్రి భీకర నీరవ స్తబ్దతను పహిల్వాన్ డోలు మాత్రమే గట్టిగా మోగుతూ సవాలు చేస్తుంది. సాయంకాలం నుంచి ఉదయం వరకు డోలు ఏదో విధంగా మోగుతూ ఆ పల్లెలో చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు, మందులూ మాకులూ లేక తిండితిప్పలు లేని మనుషులకు సంజీవని శక్తిగా పనికొచ్చేది. పిల్లల యువకుల వృద్ధుల శుష్క నేత్రాలలో అప్పుడప్పుడూ కుస్తీ మైదానంలోని దృశ్యాలు లీలగా తాండవిస్తాయి. స్పందన, శక్తి లేని నరాల్లో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆపే శక్తి లేకపోవచ్చు కాని, చనిపోయేవాళ్లు కళ్లు మూసే సమయంలో వాళ్లకు ఎలాంటి కష్టాన్నీ కలిగించకుండా, మృత్యుకూపంలోకి పోయేటప్పుడు ఎలాంటి భయం కలుగకుండా డోలు శబ్దాలు పనికొచ్చేవి. పహిల్వాన్ కొడుకులు యముని పాశంలో చిక్కుకొని భరించలేని బాధతో కొట్టుమిట్టాడుతూ ‘‘నాన్నా, ఎత్తిపడేయి’’ అన్న తాళాన్ని వాయించండి అన్నారు. ‘‘ఛటాక్– ఛట్థా, ఛటాక్– ఛట్థా’’ తాళాన్ని పహిల్వాన్ రాత్రంతా డోలుపై వాయిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో పహిల్వాన్ల భాషలో ‘వీరులారా! ప్రత్యర్థిని ఓడించండి’ అని ఉత్సాహపరుస్తున్నాడు.తెల్లవారేసరికి ఇద్దరు కొడుకులూ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉండటం చూశాడు. ఇద్దరూ బోర్లా పడి ఉన్నారు. ఒకడు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. దీర్ఘ ఉఛ్ఛ్వాశ తీసుకుని నవ్వే ప్రయత్నంలో పహిల్వాన్ ‘‘ఇద్దరు వీరులూ మట్టికరిచారా!’’ అన్నాడు.ఆ రోజు పహిల్వాన్ శ్యామానంద మహారాజా ఇచ్చిన పట్టు లంగోటా ధరించి ఉన్నాడు. శరీరమంతా మట్టి పులుముకొని కసరత్తు చేశాడు. తర్వాత ఇద్దరు కొడుకులను భుజాన వేసుకుని నదిలో పారేసి వచ్చాడు. ఈ విషయం విని పల్లెవాసులు ఆశ్చర్యచకితులయ్యారు. భయభ్రాంతులయ్యారు. ఇంత జరిగినప్పటికీ పహిల్వాన్ డోలు శబ్దాలు రోజూ మాదిరిగానే వినబడసాగాయి. ప్రజల్లో ధైర్యం పుంజుకోసాగింది. ‘‘ఇద్దరు కొడుకులు గతించారు. అయినప్పటికీ పహిల్వాన్ ధైర్యం చూడండి. అతని గుండెనిబ్బరం చూడండి’’ అని తమ సంతానాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు అనుకున్నారు.నాలుగైదు రోజుల తర్వాత ఒకనాటి రాత్రి డోలు శబ్దాలు వినబడలేదు. డోలు మూగబోయింది. రోగగ్రస్తులైన కొందరు శిష్యులు పోయి చూడగా, పహిల్వాన్ శవం వెల్లకిలా పడి ఉంది. రాత్రి నక్కలు బలిష్టమైన అతని ఎడమ తొడ మాంసం తినేశాయి. కడుపును కూడా చీల్చాయి.‘‘నేను చనిపోతే చితిపైన నన్ను వెల్లకిలా పడుకోబెట్టండి. నేను జీవితంలో ఎప్పుడూ బోర్లాపడలేదు. చితికి నిప్పంటించేటప్పుడు డోలు వాయించండి’’ అని అంటుండేవారు మన గురువుగారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అతని శిష్యుల్లో ఒకడన్నాడు.పక్కనే డోలు పడిఉంది. నక్కలు డోలును తినే వస్తువు కాదనుకొని దాని చర్మాన్ని చీల్చేశాయి. -
మలేసియా మంత్రిగా తొలి భారతీయ సిక్కు
కౌలాలంపూర్: మలేసియా కేబినెట్లో భారతీయ సంతతికి చెందిన సిక్కు వ్యక్తికి చోటు లభించింది. మలేసియా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఇండో- మలేసియా సిక్కు వ్యక్తిగా గోవింద్‌సింగ్ దేవ్ రికార్డు సృష్టించారు. పక్కాటన్ హరప్పన్ సంకీర్ణ మంత్రివర్గంలో గోవింద్‌సింగ్ సమాచార, మల్టీమీడియా శాఖ మంత్రిగా నియమితులైయారు. గోవింద్‌సింగ్‌తో పాటు డెమోక్రాటిక్ యాక్షన్ పార్టీకి చెందిన మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎం.కిలసేగరన్ మానవ వనరులశాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గోవింద్‌సింగ్ మలేసియాలోని పుచుంగ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్నారు. గోవింద్ తండ్రి కర్పాల్ సింగ్ మలేసియాలో ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త. గోవింద్‌సింగ్ 2008లో మొదటిసారి మలేసియా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2013, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేశారు. గోవింద్‌సింగ్ దేవ్‌కు మంత్రి వర్గంలో చోటు లభించడంతో సిక్కు సామాజిక వర్గం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మలేసియా జనాభాలో లక్ష జనాభా సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. -
కిరసనాయిలు కంపు
పంజాబీ మూలం : అమృతాప్రీతం అనువాదం: సుంకర కోటేశ్వరరావు బైట ఆడగుర్రం సకిలించింది. ఆ సకిలింతను గుర్తించిన గువేరి ఇంట్లోంచి పరుగున బైటికి వచ్చింది. ఆ గుర్రం తన పుట్టినింటి గ్రామం నుంచి వచ్చింది. ఆమె తన తలను దాని మెడపైన.. అది తన పుట్టింటి గుమ్మం అయినట్లు ఆనించింది.గువేరి తల్లిదండ్రులు చంబా గ్రామంలో ఉంటారు. ఎల్తైన కొండ ప్రాంతాన వున్న తన భర్త ఊరికి అది కొద్ది మైళ్ల దూరంలో ఉంది. అక్కడికెళ్లే రాస్తా వంపులు తిరిగి కొండ దిగువకు జారుతున్నట్లు దిగుడుగా ఉంటుంది. ఈ గుట్ట ప్రాంతం నుంచి చూస్తే సుదూరంగా ఆ రాస్తా అడుగున చంబా గ్రామం పడి వున్నట్లుగా కనిపిస్తుంది. గువేరికి ఎప్పుడైనా తన పుట్టింటిపైన మనసు మళ్లినప్పుడు తన భర్త మానెక్ని వెంటబెట్టుకుని ఈ గుట్ట ప్రాంతానికి వచ్చి ఎండ వెలుతురులో మినుకు మినుకుమంటూ కనిపించే చంబా గ్రామ ఇళ్లను చూసి తన మనసు నిండా గర్వాన్ని, వెలుగుని నింపుకుని యింటికి తిరిగి వెళ్తుంది. సంవత్సరానికొకసారి పంటలు ఇళ్లకు చేరిన తర్వాత కొద్దిరోజులు తల్లిదండ్రులతో గడపడానికి గువేరీని అనుమతించేవారు. ఆమెను చంబాకు తీసుకురావడానికి వాళ్లొక మనిషిని పంపుతారు. చంబా గ్రామం బైటి ప్రాంతాల కుర్రాళ్లను పెళ్లాడిన ఆమె స్నేహితురాళ్లిద్దరు కూడా అదే సమయంలో చంబాలోని తన ఇళ్లకు వస్తారు. వీళ్ల వార్షిక సమావేశాల కొరకు ఈ ఆడపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతిదినం ఎన్నెన్నోగంటలు వాళ్లవాళ్ల అనుభూతులు, సంతోషాలు, విచారాలూ మాట్లాడుకుంటూ గడుపుతారు. వాళ్లు కలిసి వీధులన్నీ తిరుగుతారు. ఆ సమయంలో అక్కడ పంటకోతల పండుగ జరుగుతుంది.అందుకొరకు ఆ ఆడపిల్లలు కొత్తబట్టలను సిద్ధం చేసుకుంటారు. తమమేలి ముసుగు వోణీలకు రంగులద్దించి గంజిపెట్టుకుని తళుకులీనేలా చేసుకుంటారు. చేతుల నిండుగా రంగురంగుల గాజులు వేయించుకుని, చెవులకు కొత్త జూకాలను ధరిస్తారు. గువేరి ఎప్పుడూ పంట కోతలకాలం ఎప్పుడా అని దినాలు లెక్కించుకునేది. ఆకురాలు కాలపు పవనాలు రుతుమేఘాల నుండి ఆకాశాన్ని విముక్తి పరచగానే ఆమె చంబాలోని తమ ఇంటికి దాపున ఉన్నట్లే చిరుభావన పొందేది. ఆమె తన దినచర్య.. పశువులకు మేతపెట్టడం, భర్త తల్లిదండ్రులకు వంట సిద్ధం చేయడం ఆ తర్వాత ఒకచోట చేరబడి పుట్టింటి నుండి తనకొరకు ఎన్ని దినాలకు మనిషి వస్తాడా.. అని లెక్కవేస్తూ ఉండటం...ఇప్పుడు తన వార్షిక సందర్శన సమయం వచ్చింది. గుర్రాన్ని ఆమె సంతోషంగా విశ్వాసంతో స్పర్శించింది. గుర్రంతో వచ్చిన తన పుట్టింటి సేవకుడు నాటూను మన్నన చేసింది. తర్వాతి రోజు ఊరు వెళ్లడానిగ్గాను అంతా సిద్ధం చేసింది. గువేరీలో పొంగుతున్న సంతోషాన్ని మాటలలో చెప్పటం కుదరదు. భావప్రకాశమానమైన ఆమె ముఖం చూస్తే చాలు.ఆమె భర్త మానెక్ కళ్లు మూసుకుని హుక్కా పీలుస్తున్నాడు. ‘‘చంబా ఉత్సవం రోజుకు నువ్వొస్తావుగదూ.. రావూ? కనీసం ఆ ఒక్క దినమైనా నువ్వువచ్చెయ్’’ బ్రతిమిలాడుతూ అడిగిందామె. మానెక్ సమాధానం చెప్పలేదు.‘‘సమాధానం చెప్పవేంది?’’ కొద్దిపాటి ధైర్యం తెచ్చుకుని పదునుగా అడిగింది...‘‘నీకొక విషయం చెప్పనా?’’ మళ్లీ అంది.‘‘నువ్వేం చెప్తావో నాకు తెలుసులే...’’ ‘సంవత్సరానికొక్కసారేగదా నేను నా పుట్టింటికి వెళ్లేది’ అని. అవును, క్రితం నిన్నెప్పుడూ ఆపలేదుగదా!’’‘‘మరి, ఈ ఏడాదెందుకని ఆపాలనుకుంటున్నావు?’’ గట్టిగా నిలదీసింది.‘‘ఈ ఒక్క సంవత్సరం...’’ బ్రతిమాలుతున్నట్లు అన్నాడు.‘‘మీ అమ్మగారి అభ్యంతరమేమీలేదు. మరి నువ్వెందుకు అడ్డుకుంటున్నావు?’’ గువేరీ చిన్న పిల్లలా మంకుపట్టుతో అడిగింది.‘‘మా అమ్మ...’’ మానెక్ పూర్తిగా చెప్పలేక ఆగాడు.బహుకాలం ఎదురుచూసిన ఆ ఉదయం... పొద్దుపొడవకముందే పెందలకడే తయారయింది. తనకు సంతానం లేకపోవడం ఒక సౌలభ్యమైంది. ఉంటే వాళ్లను తనతో వెంటబెట్టుకునేనా వెళ్లాలి. లేదంటే తన భర్త తల్లిదండ్రుల వద్దనన్నా వదలాలి. నాటూ మానెక్ తల్లిదండ్రుల వద్ద సెలవు పుచ్చుకుని గుర్రంపై జీనువేసి సిద్ధం చేశాడు. వాళ్లు ఆమె తలను స్పర్శించి దీవించారు.‘‘నేను నీతో కొంత దూరం వస్తాను’’ అన్నాడు మానెక్. గువేరి అందుకు సంతోషించింది. ఆమె తన దుపట్టా చాటున అతని పిల్లన గ్రోవిని దాచింది. ఖజియార్ గ్రామం తర్వాత రాస్తా నిట్టనిలువుగా చంబావైపు కిందికి దిగుతుంది. గువేరి అక్కడ తను దాచితెచ్చిన మురళిని బైటికి తీసి మానెక్ చేతికిచ్చింది. అతనిచేతిని తన చేతిలోకి తీసుకుంటూ ‘‘ఇప్పుడు వాయించు మురళిని’’ అంటూ అడిగింది. కానీ మానెక్ ఆలోచనలనే కోల్పోయి ఆమె కోర్కెను లక్ష్యపెట్టలేదు.‘‘నువ్వెందుకని మురళిని వాయించవు?’’ మంచిగా ఒప్పించాలనే ధోరణిలో అడిగింది. మానెక్ ఆమెవంక దీనంగా చూస్తూ మురళిని తన పెదవులకు చేర్చి ఒక చిత్రమైన వేదనామయ దుఃఖస్వరాన్ని వినిపించాడు. ఇక వాయించలేనన్నట్లు దానిని తిరిగి ఆమెకు ఇస్తూ ‘‘గువేరీ! నువ్వు వెళ్లొద్దు. నేను నిన్ను మళ్లీ అడుగుతున్నా ఈసారికి నువ్వు వెళ్లొద్దు.’’ అర్థిస్తూ అడిగాడు.‘‘ఎందుకని?’’ అడిగిందామె. తిరిగి అంది... ‘‘చూడూ.. నువ్వు ఉత్సవం రోజుకు అక్కడకు వచ్చెయ్. మనిద్దరం కలిసి వచ్చేద్దాం. నేను నీకు మాటిస్తున్నా. నేనక్కడనే ఆగిపోను.’’మానెక్ మళ్లీ అడగలేదామెను. వాళ్లు దారిపక్కన ఆగారు. జంటకు ఏకాంతం కల్పించాలని నాటూ గుర్రాన్ని కొద్ది అడుగుల దూరం అవతలికి తీసుకెళ్లాడు.మానెక్ మనసులో ఏవో కదలికలు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున తనూ తన మిత్రులు చంబాలో జరిగే పంటకోతల ఉత్సవానికని ఇదే రాస్తాపై ఇటువైపు వచ్చారు. ఆ ఉత్సవంలోనే మానెక్ తొలిసారి గువేరీని చూశాడు. ఇద్దరూ ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత మానెక్ గువేరీని ఒంటరిగా కలవడానికి వచ్చేవాడు. అతనామె చేతిని అందిపుచ్చుకొని ‘‘బాగా పొలుపోసుకుని ఇంకా పక్వానికి రాని మొక్కజొన్న కండెలా ఉన్నావు.’’ అని అనడం ఇంకా గుర్తే. సమాధానంగా ఆమె ‘కోతకురాని కండెలకోసం పశువులు ఎగబడతాయి. మనుషులు వాటిని కాల్చుకుని తినడానికి ఇష్టపడతారు’ చివుక్కున చేతిని విడిపించుకుంటూ అంది. ‘నన్ను ఇష్టపడితే నా చేయిపట్టడానికి వెళ్లి మా నాన్ననడుగు’ అని కూడా చెప్పింది.పెళ్లికి ముందు పెళ్లి కొడుకు తరపు పెద్దలు వచ్చి కన్యాశుల్కం నిశ్చయపరచుకోవటం సంప్రదాయం. గువేరి తండ్రి కన్యాశుల్కం ఎంత కోరబోతాడోననే జంకుతో మానెక్ నరాల కంపనతో ఉన్నాడు. కానీ ఆమె తండ్రి ఉన్నవాడు, పట్టణ ప్రాంతాలలో మసలిన వాడూ అవటం వలన ఆయన తన కుమార్తెకు డబ్బు పుచ్చుకోకూడదని ఒట్టుపెట్టుకుని ఉన్నాడు. అయితే ఆమెనో మంచి కుటుంబంలోని యోగ్యుడైన యువకునికి ఇవ్వాలనుకున్నాడు. మానెక్లోని లక్షణాలకు సమాధానపడి నిర్ణయించుకున్నాడు. వెనువెంటనే గువేరీ మానెక్ల వివాహం జరిగింది. గువేరి తన చేతితో అతని భుజాన్ని తట్టడంతో మానెక్ పాత జ్ఞాపకాల నుండి బైటకివచ్చాడు. ‘‘ఏమిటి అంతటి దీర్ఘాలోచనలు?’’ భర్తను ఆటపట్టించాలని అడిగింది. అతని నుండి సమాధానం లేదు.అసహనంతో గుర్రం చేసిన సకిలింతతో ప్రయాణం గుర్తుకు వచ్చి గువేరి లేచింది. మౌనంగా ఉన్న అతన్ని చూస్తూ ‘‘ఇక్కడికి రెండు మైళ్లదూరంలో గందెనపూల అడివి ఉందట నీకు తెలుసా? ఎవరైనా ఆ అడివిగుండా నడిస్తే వాళ్లకి చెముడు ప్రాప్తిస్తుందట’’ అంది.‘‘అవును.’’‘‘నాకనిపిస్తుంది. నువ్వెప్పుడో ఆ అడివిగుండా నడిచివుంటావేమోనని.. నేనేదడిగినా నువ్వు వినిపించుకోవడంలేదు మరి.’’‘‘నిజమే గువేరీ! నువ్వేం చెప్పినా నేను వినలేకపోతున్నాను’’ ఒక దీర్ఘనిట్టూర్పువిడిచి సమాధానంగా అన్నాడు మానెక్.ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కానీ, ఒకరికొకరు అర్థంకావడం లేదు. ‘‘సరే ఇకనేను బయల్దేర్తాను. ఇంటికి వెళ్లు. చాలాదూరం వచ్చావు’’ సౌమ్యంగా అంది గువేరి.‘‘నువ్వింత దూరమూ నడిచావు. ఇక గుర్రం ఎక్కడం మంచిది.’’‘‘ఇదిగో... నీ మురళి, తీసుకో...!’’‘‘దాన్ని నీతోనే పట్టుకెళ్లు’’‘‘మరి ఉత్సవం నాడు వచ్చి దాన్ని వాయిస్తావా?’’ చిరునవ్వుతో అడిగింది. ఆమె కళ్లలో వెలుగులు. చంబావైపు కదిలింది. మానెక్ ఇంటికి తిరిగివెళ్లాడు.ఇంట్లోకి ప్రవేశిస్తూనే నిస్పృహతో మంచంపైన కూలబడ్డాడు.‘‘చాలాసేపు నడిచినట్లున్నావు. పూర్తిగా చంబా వరకూ వెళ్లావా?’’ పెద్ద కంఠంతో అడిగింది తల్లి.‘‘పూర్తిగా కాదులే, గుట్టపై వరకూ మాత్రం వెళ్లా’’ మానెక్ స్వరం బరువుగా ఉంది. ‘‘ముసలమ్మలా అలా కాకి మూలుగుడెందుకు? మగవాడిలా ఉండు’’ క్రూరంగా ఉంది తల్లి.‘‘నువ్వూ ఆడదానివి. ఒక మార్పునాశించే వాళ్లలాగా నువ్వెందుకని ఏడవవు?’’ అంటూ ఒక గట్టి ఎదురు సమాధానం చెబ్దామనుకున్నాడు మానెక్, కానీ మూగగా ఉండిపోయాడు. తల్లి పట్ల, సంప్రదాయంపట్ల విధేయత కలిగిన మానెక్ శరీరం నూతన యువతిపట్ల ప్రతిస్పందించింది. కానీ, అంతర్గతంగా అతని ఆత్మ చచ్చిపోయింది. ఒక పొద్దుటి పూట మానెక్ పొగతాగుతూ కూర్చుని ఉన్న సమయంలో తన పాతమిత్రుడొకరు అటుగా పోతూండటం గమనించి కేకేశాడు.‘‘ఏయ్ భవానీ! పొద్దున్నే ఇంత పెందరాళే ఎక్కడికి వెళ్తున్నావు?’’భవానీ ఆగాడు. అతని భుజాన చిన్న మూటవుంది. ‘‘అంత విశేషంగా ఎక్కడికీ లేదులే!’’ తప్పించుకునే ధోరణిలో బదులిచ్చాడు.‘‘సరే, ఏదోపని మీద ఎక్కడికో వెళ్తున్నావులే కానీ, పొగతాగుతావా?’’ కేకేసి అడిగాడు మానెక్.భవానీ వచ్చి పక్కనే కూర్చున్నాడు. ‘‘నేను చంబా ఉత్సవానికి వెళ్తున్నా’’ చివరికి చెప్పాడు.భవానీ కబురు మానెక్ గుండెలో ముల్లులా గుచ్చుకుంది. ‘‘ఉత్సవం ఈరోజేనా?’’ అడిగాడు.‘‘ప్రతి సంవత్సరం ఇదే రోజున గదా?’’ భవానీ పొడిగా సమాధానం ఇచ్చాడు. ‘‘ఏడేళ్ల క్రితం మనమంతా ఒకటిగా కలిసి వెళ్లి పాల్గొన్నాంగదా! నీకు గుర్తులేదా?’’ భవానీ ఆపైన ఏమీ అనలేదు. కానీ తననతనేమైనా తప్పు పడతాడేమోననే ఆలోచన కలిగి కించపడ్డాడు. భవానీ తన మూటనందుకున్నాడు. ఆ మూటలోంచి అతని పిల్లనగ్రోవి పైకి కనిపిస్తోంది. మానెక్ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు భవానీ. అతను కనిపించినంత దూరం మానెక్ ఆ మురళిపైననే చూపును నిలిపాడు.తర్వాతి రోజు పొద్దువాలిన వేళ మానెక్ పొలంలో వుండగా తిరిగివస్తున్న భవానీని గమనించి బుద్ధిపూర్వకంగా ముఖం వేరేవైపుకు తిప్పుకున్నాడు మానెక్. భవానీతో మాట్లాడ్డానికిగానీ, ఉత్సవం విషయాలు తెలుసుకోవడానికి గానీ అతనికి ఇష్టంలేదు. అయితే భవానీ చుట్టూ తిరిగి, నేరుగా అతని వద్దకే వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. వెలిగిఆరిపోయిన మసిబొగ్గులా విషాదంగా ఉంది అతని ముఖం.‘‘గువేరి చనిపోయింది’’ అన్నాడు. అతని స్వరం సాధారణంగానే ఉంది.‘‘ఏ....మి...టీ..?’’‘‘నీ రెండో పెళ్లి గురించి వినగానే ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించేసుకుంది.’’మానెక్ వేదనతో మూగబోయాడు. తన శరీరమే కాలిపోతున్న అనుభూతితో అలాగే చూస్తూ ఉండిపోయాడు. రోజులు చెల్లిపోతున్నాయి. మానెక్ పొలాలవైపు వెళ్లడానికి అలవడ్డాడు. భోజనం ఎవరైనా పెట్టినప్పుడు తింటాడు. జీవంలేని వాడిలా తయారయ్యాడు. ముఖంలో ఏ భావాలు లేవు. కళ్లలో వెలుగులు లేవు.అతని రెండవ భార్య ‘‘నేనాయన భార్యగాలేను, ఎవరో దారినపోయే దాన్ని తెచ్చిపెట్టుకున్నట్లుంది’’ అంటూ మొరపెట్టుకునేది. అయితే త్వరలోనే ఆమె గర్భవతైంది. తన కోడల్ని చూసుకుని మానెక్ తల్లి ఎంతో సంతోషపడిపోయింది. ఈ విషయం మానెక్తో చెప్పింది. అతను అయోమయంగా చూశాడు. అతని చూపులలో జీవంలేదు.అతని తల్లి కోడలితో కొద్దిరోజులు భర్త పరిస్థితిని భరించమని ధైర్యం చెప్పింది. బిడ్డపుట్టిన తర్వాత అతని ఒడిలో పెడితే తానే మారతాడని ఆమె భరోసాగా అనేది. మానెక్ భార్య మగబిడ్డను కన్నది. మానెక్ తల్లి ఉప్పొంగిపోతూ బిడ్డకు స్నానం చేయించి మంచి బట్టలువేసి ఎత్తుకెళ్లి మానెక్ ఒడిలో ఉంచింది.ఒడిలోని బిడ్డవైపు తేరిపారజూశాడు. చాలాసేపు అలాగే రెప్పవేయకుండా చూశాడు. ఎప్పటిలానే అతని ముఖంలోని ఏ భావాలూ లేవుగానీ, హఠాత్తుగా వెలుగులు ఇంకిన అతని కళ్లు భీతితో పెద్దవయ్యాయి. ఒక్కసారిగా భయంతో పెద్దగా కేకపెట్టాడు.మానసిక అస్థిరతతో స్మృతిని కోల్పోయిన వాడిలా ‘‘వీణ్ని తీసుకెళ్లిపో! కిరసనాయిలు కంపుగొడుతున్నాడు. తీసుకెళ్లిపో వీణ్ని!’’ అంటూ కేకలు పెట్టాడు. -
ప్రముఖ గాయకునిపై కాల్పులు
చండీఘడ్: పంజాబ్‌కి చెందిన ప్రముఖ గాయకుడు పర్మిష్ వర్మపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్మిష్ వర్మ శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో మొహాలిలోని సెక్టర్91 వద్ద కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. పర్మిష్ కాలి భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయింది. సమయానికి స్థానికులు స్పందించి పర్మిష్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పర్మిష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పర్మిష్ వర్మ ‘గాల్ నహీన్ కదానే’ అనే పంజాబీ పాటతో ఒక్కసారిగా ఫేమస్ సింగర్‌గా మారిన విషయం తెలిసిందే. స్థానిక గ్యాంగ్స్టర్లు పర్మిష్‌పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
కవితను దొంగ దెబ్బతీసిన రెజ్లర్
న్యూఢిల్లీ: ది గ్రేట్ ఖలీ నిర్వహించిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పోటీల సందర్భంగా మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ సవాల్ కు దీటైన జవాబు చెప్పిన సల్వార్ కమీజ్ పంజాబీ యువతి కవిత గుర్తుంది కదా... తన సాహసంతో.. మనోధైర్యంతో... కండలు తిరిగిన రెజ్లర్ తో పోటీకి దిగి .. చిత్తు చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రతీకారంతో రగిలిపోయిన బీబీ.. సివంగి కవితపై దాడిచేసిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేక్షకుల్లో కూర్చున్న కవితపై ఆనూహ్యంగా దాడి చేసి.. దొంగ దెబ్బ తీసింది. తనను ఒడించిందనే అక్కసుతో కవితపై క్రూరంగా దాడిచేసిన బీబీ బుల్ బుల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి రింగ్ లో ఈడ్చిపారేసిన రెజ్లర్ కు తనదైన శైలిలో రిటార్ట్ ఇచ్చింది కవిత. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే ఈ వ్యవహారమంతా గందరగోళంగా ఉందన్న కమెంట్లు కూడా వినిపించాయి. కాగా కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ భాగంగా మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ రింగ్‌లో నుంచి ఓ సవాల్ విసిరింది. దమ్ము, ధైర్యం ఉన్నవాళ్ళెవరైనా వచ్చి తనతో తలపడాలని సవాల్ విసిరింది. తనతో పోటీ పడే వారు ఎవరైనా ఉన్నారంటూ చెలరేగిపోయిన బీబీ బుల్ బుల్ ను నిమిషాల్లో మట్టికరిపించి శభాష్ అనిపించుకుంది. అయితే పవర్ లిప్టింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ కూడా అయిన కవిత గతంలో హర్యానా పోలీసు శాఖలో ఉద్యోగి. 2015లో చోటు చేసుకున్న ఈ వీడియో తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే -
భల్లే భల్లే..
పంజాబీ ఫుడ్డా? అంటే? ‘ఏదీ.. సర్దార్జీలు తింటారూ... అదా’ అని కొట్టిపారేయొద్దు. మీకలా చెప్తే అర్థం కాదు గానీ.. ‘ధాబా ఫుడ్డు’ అంటే వెంటనే ఒంటబట్టుద్ది. నోరు ఊరుతోంది కదా! తాజ్ బంజారా లాంటి స్టార్ హోటల్ నుంచి మీకోసం ఈవారం.. భల్లే.. భల్లే ధాబా ట్రీట్. శోర్బా కావల్సినవి: టమాట ముక్కలు - 6 కప్పులు శనగపిండి - టీ స్పూన్ కరివేపాకు - 3-4 రెమ్మలు (ఆకులు మాత్రమే తీసుకోవాలి) కారం - టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత పంచదార - 2 టీ స్పూన్లు నిమ్మరసం - 2 టీ స్పూన్లు నెయ్యి - టీ స్పూన్ ఆవాలు - టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్ ధనియాల పొడి - పావు టీ స్పూన్ తయారి: కప్పు నీళ్లలో శనగపిండి కలపాలి. కడాయిలో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. దాంట్లో టొమాటో గుజ్జు వేసి 4 నిమిషాల సేపు ఉడికించాలి. దీంట్లో కరివేపాకు, కారం, మెత్తటి మిశ్రమం అయ్యేలా కలపాలి. దీంట్లో శనగపిండి మిశ్రమం, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి సన్నని మంటమీద 3-4 నిమిషాలు ఉడికించాలి. విడిగా కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ధనియాల పొడి వేసి పోపు పెట్టి ఈ మిశ్రమాన్ని శోర్బాలో కలపాలి. అతిథికి అందించే ముందు కొత్తిమీరతో అలంకరించాలి. మచ్చి అమృత్సరి కావల్సినవి: కింగ్‌ఫిష్/వంజరం/ కట్ల - చేప ముక్కలు - 600 గ్రా.లు శనగపిండి - కప్పుకారం - టేబుల్ స్పూన్ వాము (ఓమ) - టీ స్పూన్అల్లం ముద్ద - 2 టేబుల్ స్పూన్లువెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - టేబుల్ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత గుడ్డు - 1 చాట్ మసాలా - టీ స్పూన్నిమ్మ ముక్కలు (చక్రాల్లా కోసినవి) - 2 తయారి:శుభ్రపరచిన చేప ముక్కలను గిన్నెలో వేసి, అందులో కారం, ఉప్పు, వాము, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, శనగపిండి వేసి, కలిపి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, కలిపి, చేప ముక్కలను అందులో ముంచి కాగిన నూనెలో వేసి రెండువైపులా గోధుమరంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. పేపర్ నాప్కిన్ (పలచగా ఉండే టిష్యూ పేపర్) మీద వేయించుకున్న ముక్కలు వేయాలి. ఇలా చేస్తే అదనపు నూనెను పేపర్ పీల్చుకుంటుంది. వెంటనే వడ్డిస్తే చేప ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి. చేప ముక్కల పైన చాట్ మసాలా చల్లి, గుండ్రగా కట్ చేసుకున్న నిమ్మముక్కలతో అలంకరించి, గ్రీన్ చట్నీ (దీని తయారీ కింద ఇచ్చాం) తో అందించాలి. స్టార్టర్ పనీర్ కుర్‌కురె కావల్సినవి: అప్పడాలు (పాపడ్స్) - 8 పనీర్ - 400 గ్రా.లు (ముక్కలుగా కోసుకోవాలి) శనగపిండి - అర కప్పు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; కారం - అర టీ స్పూన్; పసుపు - చిటికెడు ధనియాల పొడి - టీ స్పూన్; జీలకర్రపొడి - అర టీ స్పూన్; వాము (ఓమ) - అర టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత ; వంటసోడా - చిటికెడు; చాట్ మసాలా - టీ స్పూన్ ; గ్రీన్ చట్నీ - 4 టేబుల్ స్పూన్లు (దీని తయారీ కింద ఇచ్చాం); నూనె -వేయించడానికి తగినంత తయారి: బేసిన్లో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, వాము, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, పిండి జారుగా కలుపుకోవాలి. జారుగా కలిపిన పిండిలో వంటసోడా, చాట్ మసాలా వేసి, కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి. పనీర్ ముక్కలకు ఒకవైపు గ్రీన్ చట్నీ రాయాలి. అప్పడాలను నలిపి ప్లేట్ అంతా పరచాలి.కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధంగా ఉంచుకున్న పిండిలో పనీర్ ముక్కలను ముంచి, తర్వాత అప్పడాలలో తిప్పి, వేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. (అదనపు నూనె పీల్చుకోవడానికి పేపర్‌నాపికిన్ మీద వేయాలి) అన్ని ముక్కలు వేయించుకున్నాక చాట్ మసాలా పై నుంచి చల్లాలి. వడ్డించే ప్లేట్లో పనీర్ కుర్కురేని సర్ది, టొమాటో కెచప్‌తో గానీ, టొమాటో పచ్చడితో గానీ అందించాలి. మెయిన్ కోర్స్ దాల్ మఖనీ కావల్సినవి: పొట్టు తీయని మినప్పప్పు - కప్పు రాజ్మా - అరకప్పు ; నీళ్లు - 4 కప్పులు; జీలకర్ర - టీ స్పూన్ జీలకర్రపొడి - అర టీ స్పూన్; కారం - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) అల్లం - చిన్న ముక్క (సన్నగా తరగాలి ; వెల్లులి రెబ్బలు - 5 (సన్నగా తరగాలి); మసాలా (లవంగాలు, యాలకులు, మిరియాలు, వేయించిన ధనియాలు కలిపి పొడిచేసినది)- టీ స్పూన్ ; నెయ్యి - 3 టీ స్పూన్లు పాల మీగడ (చిలికినది) - 3 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత కొత్తిమీర ఆకులు - టీ స్పూన్ తయారి: రాజ్మ, మినప్పప్పు రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం ప్రెషర్ కుకర్‌లో వేసి, నీళ్లు పోసి కనీసం 12-15 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. బయట ఉడికించాలంటే పప్పులు మెత్తగా అయ్యేవరకు ఉంచాలి. ఉడికిన పప్పును పెద్ద గరిటతో లేదా పప్పు గుత్తితో గుజ్జుగా చేయాలి. దీంట్లో జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, గరమ్ మసాలా, నెయ్యి వేసి మూత పెట్టకుండా సిమ్‌లో 10-15 నిమిషాల సేపు పప్పు అంతా బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. దీంట్లో పాల మీగడ వేసి మరో 15 నిమిషాలు ఉడికించి దించాలి. గిన్నెలో పోసి కొత్తిమీరతో అలంకరించాలి. ముర్గ్ మకాయ్ కావల్సినవి: చికెన్ (బెస్ట్) - అర అంగుళం చొప్పున 4 ముక్కలు ఉడికించిన మొక్కజొన్న గింజలు - కప్పు నూనె - 1 1/2 టేబుల్ స్పూన్ అల్లం - అంగుళం పొడవు ముక్క (సన్నగా తరగాలి) వెల్లుల్లి రెబ్బలు - 5-6 (సన్నగా తరగాలి) టొమాటో గుజ్జు - 3 మధ్యస్థంగా ఉండే టొమాటోలతో చేయాలి కారం - టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్ ధనియాల పొడి - టేబుల్ స్పూన్ పెరుగు - 2 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ - అంగుళం చొప్పున 2 ముక్కలుఉప్పు - రుచికి తగినంతకొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారి: నాన్‌స్టిక్ పాన్ లేదా కడాయిలో నూనె వేసి వెల్లుల్లిని వేయించుకోవాలి. దీంట్లో టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి. కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపిన చికెన్ ముక్కలు టొమాటో గుజ్జులో వేసి 5-6 నిమిషాలు ఉడికించాలి. యోగర్ట్ / పెరుగు, మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. దీంట్లో మసాలా వేసి మిశ్రమం చిక్కపడేంతవరకు, చికెన్ ముక్కలు ఉడికేంత వరకు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి, దించాలి. మాంసాహారాన్ని ఇష్టపడేవారికి ఈ కూర బాగుంటుంది. చాట్ మసాలా కావల్సినవి: జీలకర్ర - టేబుల్‌స్పూన్; దనియాలు - టేబుల్ స్పూన్; సోంపు గింజలు- పావు టీ స్పూన్; వాము - పావు టీ స్పూన్; ఇంగువ - పావు టీ స్పూన్; లవంగాలు - 5; టీ స్పూన్ - కారం; మామిడిపొడి (ఆమ్చూర్ పౌడర్) - 2 1/2 టేబుల్ స్పూన్లు; నల్ల ఉప్పు- టేబుల్ స్పూన్; ఉప్పు - 1 1/2 టీ స్పూన్; నల్లమిరియాలు - టేబుల్ స్పూన్; శొంఠి పొడి - టీ స్పూన్; పుదీనా పొడి (ఎండు పుదీనా ఆకులను పొడిచేయాలి) - అర టేబుల్ స్పూన్ తయారి: పెనంలో పై దినుసులన్నీ వేసి, వేయించి చల్లారనివ్వాలి. వేయించినవి పొడి చేసుకొని దాంట్లో మామిడి పొడి, నల్ల ఉప్పు, ఉప్పు, ఇంగువ కలిపి మరొక్కసారి బ్లెండ్ చేయాలి. దీనిని గాలి చొరని మూత ఉన్న సీసాలో పోసి కావల్సినప్పుడు వాడుకోవాలి. గ్రీన్ చట్నీ కావల్సినవి: పుదీనా ఆకులు - అర కప్పు; కొత్తిమీర ఆకులు - అర కప్పు; పచ్చిమిర్చి - 4 వెల్లుల్లి రెబ్బలు - 3-4 చాట్ మసాలా - 2 టీ స్పూన్లు; నిమ్మరసం - అర టీస్పూన్ ఉప్పు- తగినంత ; నీరు - తగినంత తయారి: పుదీనా, కొత్తిమీర ఆకులను శుభ్రం చేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చాట్ మసాలా, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో అర ముక్క నిమ్మరసం పిండి, చెంచాతో బాగా కలపాలి. గాజర్ కా హల్వా కావల్సినవి: గాజర్ గడ్డ లేదా క్యారెట్ తురుము - 2 కప్పులు; వెన్న తీసిన పాలు - 2 కప్పులు; పాల పొడి- 6 టేబుల్‌స్పూన్లు పంచదార- 4 టీ స్పూన్లు; యాలకుల పొడి - అర టీ స్పూన్; కుంకుమపువ్వు - చిటికెడు తయారి: కడాయిలో క్యారెట్, పాలు కలిపి మెత్తగా ఉడికించాలి. (ప్రెషర్ కుకర్‌లో పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచితే సరిపోతుంది) దీంట్లో పాల పొడి, పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి 4 నిమిషాలు ఉడికించాలి. అడుగు అంటుకోకుండా దించేంతవరకు గరిటెతో తిప్పుతుండాలి. దీనిని వేడిగా అందించాలి. ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసుకోవచ్చు. చెఫ్స్: కమల్ రానా, గౌతమ్ సుబేది హోటల్ తాజా బంజారా, హైదరాబాద్ ఫొటోలు: శివ మల్లాల -
సెంటిమెంట్ ఫలిస్తే... వీరి పెళ్లి ఖాయం!
కలీరా.. ఈ పదానికి అర్థం మనకన్నా ఉత్తరాదివారికి బాగా తెలుసు. పంజాబీ సంప్రదాయాల్లో ఇదొకటి. చేతినిండా ఎరుపు, తెలుపు గాజులు వేసుకుని, వాటికి ఓ ఆభరణాన్ని కట్టుకుని, నూతన వధువు అవివాహితుల తల మీద తన చేతిని అటూ ఇటూ ఊపినప్పుడు ఆ ఆభరణంలో ఉన్న నూలు పోగు లేక ఆకు ఎవరి తల మీద పడితే వాళ్లకి వెంటనే పెళ్లయిపోతుందట. నూతన వధువు అందించే బలమైన ఆ ఆశీర్వాదం కచ్చితంగా ఫలిస్తుందనే నమ్మకం పంజాబీలకు ఉంటుందట. పెళ్లి కూతురి చేతి గాజులకు ఉన్న ఆ ఆభరణం పేరే కలీరా. ఇటీవల సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి జరిగింది కదా.. ఆ పెళ్లి తర్వాత ఈ ‘కలీరా’ వేడుక కూడా జరిగింది. ఈ వేడుకలో కత్రినా కైఫ్ కూడా పాల్గొన్నారు. అర్పితా తన చేతులను ఊపినప్పుడు సరిగ్గా కత్రినా నెత్తి మీద ఓ ఆకు పడిందట. దాంతో కత్రినా త్వరలో పెళ్లి కూతురు కావడం ఖాయం అని ఆ పెళ్లిలో పాల్గొన్న పెద్దవాళ్లు పేర్కొనడం జరిగింది. పెద్దవాళ్ల మాటలు విని కత్రినా సిగ్గుల మొగ్గ అయ్యారట. ఆల్రెడీ రణ్‌బీర్ కపూర్‌తో ఆమె లవ్‌లో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. పెళ్లి రణ్బీర్తోనా? లేక వేరే ఎవరితోనా? అనేది కాలమే చెప్పాలి. ఇక... సల్మాన్ ఖాన్ గురించి చెప్పుకుందాం. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఆయన ఒకరు. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడంలేదు ఈ కండలవీరుడు. కానీ, ఆయన నడిపిన ప్రేమకథలు చాలానే ఉన్నాయనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. ఇక సల్మాన్ పెళ్లి చేసుకోడని ఎవరికివారు ఫిక్స్ అయ్యారు. కానీ.. త్వరలో ఆయన పెళ్లి కొడుకు అవుతారని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, అర్పితా కలీరాలోంచి ఓ ఆకు సల్మాన్ నెత్తి మీద కూడా పడిందట.ముద్దుల చెల్లెల్ని అడిగి మరీ.. తన మీద ఆకు పడేట్లు కలీరాని ఊపమని కోరారట సల్మాన్. అన్న అడిగితే చెల్లెలు ఊరుకుంటుందా? చేతులు గలగలలాడించేసిందట. ఇంకేముంది? సల్మాన్ నెత్తి మీద ఆకు పడనే పడింది. సల్మాన్ త్వరలో పెళ్లికొడుకు కావడం ఖాయమని బాలీవుడ్‌వారు అంటున్నారు.