కవితను దొంగ దెబ్బతీసిన రెజ్లర్ | Video: Salwar kameez-clad Punjabi woman knocks down pro wrestler in fierce fight | Sakshi
Sakshi News home page

కవితను దొంగ దెబ్బతీసిన రెజ్లర్

Published Mon, Jun 20 2016 12:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

కవితను దొంగ దెబ్బతీసిన  రెజ్లర్

కవితను దొంగ దెబ్బతీసిన రెజ్లర్

న్యూఢిల్లీ:  ది గ్రేట్ ఖలీ నిర్వహించిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్  పోటీల సందర్భంగా  మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్   సవాల్ కు దీటైన  జవాబు చెప్పిన  సల్వార్ కమీజ్ పంజాబీ యువతి కవిత  గుర్తుంది కదా... తన  సాహసంతో.. మనోధైర్యంతో... కండలు తిరిగిన  రెజ్లర్ తో పోటీకి దిగి .. చిత్తు చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  అయితే  ప్రతీకారంతో రగిలిపోయిన బీబీ.. సివంగి కవితపై దాడిచేసిన వీడియో ఒకటి తాజాగా  వెలుగులోకి వచ్చింది. ప్రేక్షకుల్లో కూర్చున్న కవితపై ఆనూహ్యంగా  దాడి చేసి.. దొంగ దెబ్బ తీసింది.  తనను ఒడించిందనే అక్కసుతో కవితపై  క్రూరంగా దాడిచేసిన బీబీ బుల్ బుల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి రింగ్ లో ఈడ్చిపారేసిన రెజ్లర్ కు  తనదైన శైలిలో రిటార్ట్ ఇచ్చింది కవిత. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్  చల్ చేస్తోంది. అలాగే  ఈ  వ్యవహారమంతా గందరగోళంగా ఉందన్న కమెంట్లు   కూడా వినిపించాయి.


కాగా  కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్  భాగంగా మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ రింగ్‌లో నుంచి ఓ సవాల్ విసిరింది. దమ్ము, ధైర్యం ఉన్నవాళ్ళెవరైనా వచ్చి తనతో తలపడాలని సవాల్ విసిరింది.  తనతో పోటీ పడే వారు ఎవరైనా ఉన్నారంటూ చెలరేగిపోయిన  బీబీ బుల్ బుల్ ను   నిమిషాల్లో మట్టికరిపించి శభాష్ అనిపించుకుంది.  అయితే పవర్ లిప్టింగ్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ కూడా అయిన కవిత గతంలో హర్యానా పోలీసు శాఖలో ఉద్యోగి. 2015లో చోటు చేసుకున్న ఈ వీడియో తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేసిన  సంగతి తెలిసిందే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement