సెంటిమెంట్ ఫలిస్తే... వీరి పెళ్లి ఖాయం! | Arpita Khan's wedding: Moments you can't miss | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్ ఫలిస్తే... వీరి పెళ్లి ఖాయం!

Published Sat, Nov 22 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

సెంటిమెంట్ ఫలిస్తే... వీరి పెళ్లి ఖాయం!

సెంటిమెంట్ ఫలిస్తే... వీరి పెళ్లి ఖాయం!

కలీరా.. ఈ పదానికి అర్థం మనకన్నా ఉత్తరాదివారికి బాగా తెలుసు. పంజాబీ సంప్రదాయాల్లో ఇదొకటి. చేతినిండా ఎరుపు, తెలుపు గాజులు వేసుకుని, వాటికి ఓ ఆభరణాన్ని కట్టుకుని, నూతన వధువు అవివాహితుల తల మీద తన చేతిని అటూ ఇటూ ఊపినప్పుడు ఆ ఆభరణంలో ఉన్న నూలు పోగు లేక ఆకు ఎవరి తల మీద పడితే వాళ్లకి వెంటనే పెళ్లయిపోతుందట. నూతన వధువు అందించే బలమైన ఆ ఆశీర్వాదం కచ్చితంగా ఫలిస్తుందనే నమ్మకం పంజాబీలకు ఉంటుందట. పెళ్లి కూతురి చేతి గాజులకు ఉన్న ఆ ఆభరణం పేరే కలీరా.

ఇటీవల సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి జరిగింది కదా.. ఆ పెళ్లి తర్వాత ఈ ‘కలీరా’ వేడుక కూడా జరిగింది. ఈ వేడుకలో కత్రినా కైఫ్ కూడా పాల్గొన్నారు. అర్పితా తన చేతులను ఊపినప్పుడు సరిగ్గా కత్రినా నెత్తి మీద ఓ ఆకు పడిందట. దాంతో కత్రినా త్వరలో పెళ్లి కూతురు కావడం ఖాయం అని ఆ పెళ్లిలో పాల్గొన్న పెద్దవాళ్లు పేర్కొనడం జరిగింది.  పెద్దవాళ్ల మాటలు విని కత్రినా సిగ్గుల మొగ్గ అయ్యారట. ఆల్రెడీ రణ్‌బీర్ కపూర్‌తో ఆమె లవ్‌లో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. పెళ్లి రణ్‌బీర్‌తోనా? లేక వేరే ఎవరితోనా? అనేది కాలమే చెప్పాలి.
 
ఇక... సల్మాన్ ఖాన్ గురించి చెప్పుకుందాం. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఆయన  ఒకరు. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడంలేదు ఈ కండలవీరుడు. కానీ, ఆయన నడిపిన ప్రేమకథలు చాలానే ఉన్నాయనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. ఇక సల్మాన్ పెళ్లి చేసుకోడని ఎవరికివారు ఫిక్స్ అయ్యారు.

కానీ.. త్వరలో ఆయన పెళ్లి కొడుకు అవుతారని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, అర్పితా కలీరాలోంచి ఓ ఆకు సల్మాన్ నెత్తి మీద కూడా పడిందట.ముద్దుల చెల్లెల్ని అడిగి మరీ.. తన మీద ఆకు పడేట్లు కలీరాని ఊపమని కోరారట సల్మాన్. అన్న అడిగితే చెల్లెలు ఊరుకుంటుందా? చేతులు గలగలలాడించేసిందట. ఇంకేముంది? సల్మాన్ నెత్తి మీద ఆకు పడనే పడింది. సల్మాన్ త్వరలో పెళ్లికొడుకు కావడం ఖాయమని బాలీవుడ్‌వారు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement