చండీఘడ్: పంజాబ్‌కి చెందిన ప్రముఖ గాయకుడు పర్మిష్ వర్మపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్మిష్ వర్మ శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో మొహాలిలోని సెక్టర్91 వద్ద కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. పర్మిష్ కాలి భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయింది.
సమయానికి స్థానికులు స్పందించి పర్మిష్‌ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పర్మిష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పర్మిష్ వర్మ ‘గాల్ నహీన్ కదానే’ అనే పంజాబీ పాటతో ఒక్కసారిగా ఫేమస్ సింగర్‌గా మారిన విషయం తెలిసిందే. స్థానిక గ్యాంగ్‌స్టర్లు పర్మిష్‌పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment