చాలామంది వెయిట్ లాస్ జర్నీలో అంత ఈజీగా విజయవంతం కాలేరు. ఎన్నో డైట్‌లు, వర్కౌట్ల అనంతరం స్లిమ్‌గా మారతారు. అయితే కొందరు మాత్రం ఏదో మాయ చేసినట్లుగా తక్కువ వ్యవధిలోనే స్లిమ్‌గా అయ్యిపోతారు. అంత సింపుల్‌గా ఎలా బరువు తగ్గించుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతుంటే..వాళ్లు మాత్రం తాము ఏం చేయలేదని ఇంట్లో వండిన భోజనమే తిన్నమని సింపుల్‌గా చెబుతారు. అలాంటి కోవకు చెందిందే ఈ పంజాబీ నటి, మోడల్, గాయని అయిన హిమాన్షి ఖురానా. ఆమె వెయిట్‌లాస్ స్టోరీ తెలిస్తే కంగుతింటారు.
ఆమె ఏం చేసిందంటే..హిమాన్షి ఖురానా ఒక హెల్త్ ప్రోగ్రామ్‌లో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. మానసిక ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తేనే సత్ఫలితాలను పొందగలమని నమ్మకంగా చెబుతుంది. అయితే తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి జిమ్‌కి వెళ్లలేదని తెలిపింది. వారానికి రెండు సార్లు మాత్రం పైలేట్స్ వర్కౌట్లు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. సాధారణ ఆహారంతోనే తాను 11 కేజీల వరకు బరువు తగ్గినట్లు వెల్లడించింది.
అలాగే ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోనని చెబుతోంది. ఇంట్లో వండేవన్నీ తింటుందట. ముఖ్యంగా పరాఠాలంటే మహా ఇష్టమట. ప్రతిరోజు అవి తినకుండా రోజు ప్రారంభమవ్వదని అంటోంది. అయితే ఇటీవల బరువు తగ్గడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని అందుకోసం అనారోగ్యకరమైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇది అస్సలు సరైనది కాదని అంటోంది.
బరువు తగ్గడం కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం అని నొక్కి చెప్పింది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తే ఆటోమేటిగ్గా బరువు తగ్గడం జరుగుతుందని అంటోంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎలా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో కూడా వివరించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు దారితీసేలా ఒత్తిడికి గురవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తే.. మొత్తం ఆరోగ్యం తోపాటు అధిక బరువు సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని చాలా సింపుల్‌గా చెప్పేసింది నటి, మోడల్ హిమాన్షి ఖురానా.
(చదవండి: నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!)
Comments
Please login to add a commentAdd a comment