
బాలుడి మృతదేహం
సాక్షి, నాగార్జునసాగర్ : సాగర్ జలాశయ తీరంలో గల కృష్ణవేణి ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని బాలుడి మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నం జలాశయం ఒడ్డుకు బాలుడి మృ తదేహం కొట్టుకు రావడాన్ని గమనించిన మ త్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. రైట్‌బ్యాంకు ఎస్‌ఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరి శీలించారు. బాలుడు వయస్సు సుమారు రెండేళ్లు ఉంటుందని, ఒంటిపై రెడ్ కలర్ టీషర్ట్, రెడ్ కలర్ నిక్కర్ ఉన్నట్టు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన వారు సెల్ : 9440900884 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment