బతుకుదెరువు.. గుండె బరువు.. తల్లి ఒడిలో నుంచి ఎగిరిపడి! | Road Accident: 8 Years Old Child Died In Mahabubabad | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు.. గుండె బరువు.. తల్లి ఒడిలో నుంచి ఎగిరిపడి!

Published Wed, Feb 8 2023 8:30 PM | Last Updated on Wed, Feb 8 2023 8:42 PM

Road Accident: 8 Years Old Child Died In Mahabubabad - Sakshi

రాణి(ఫైల్‌)

సాక్షి, మహబూబాబాద్‌: బతుకుదెరువు కోసం బయల్దేరిన ఓ కుటుంబానికి గుండె బరువైంది. పొట్టకూటి కోసం ఊరూరా తిరిగి స్టీల్‌ సామగ్రి అమ్మే కుటుంబంలో ఆటో బోల్తా పడి విషాదం నిండింది. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో మంగళవారం ఆటో బోల్తా పడి రేబెల్లి యాలాద్రి–సమ్మక్క దంపతుల కుమార్తె రాణి(3) మృతి చెందింది. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లికి చెందిన యాలాద్రి–సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

వీరు బతుకుదెరువు కోసం ఊరూరా తిరిగి స్టీల్‌ సామగ్రి, అమ్ముతూ, గ్యాస్‌ స్టవ్‌లు మరమ్మతు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈక్రమంలో యాలాద్రి, సమ్మక్క తమ కుమార్తె రాణి కలిసి టాటా ఏస్‌ ట్రాలీ క్యాబిన్‌లో కూర్చున్నారు. వారితో పాటు వెనకాల ట్రాలీలో సమ్మక్క తల్లి వెంకటమ్మ కూర్చుని వరంగల్‌ వెళ్లేందుకు బయల్దేరారు. శనిగపురం శివారు గుండ్లబోడుతండా మూల మలుపు వద్ద గల రైస్‌ మిల్లు ప్రాంతానికి ఆటో చేరుకోగానే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఒక్కసారిగా టాటాఏస్‌ ట్రాలీ అదుపుతప్పి బోల్తాకొట్టింది.

ఈఘటనలో యాలాద్రి పక్కనే ఉన్న సమ్మక్క, చిన్నారి రాణి, ఆటో వెనుకభాగంలో కూర్చున్న వెంకటమ్మ రోడ్డుపై పడిపోయారు. సమ్మక్క, వెంకటమ్మకు స్వల్పగాయాలవగా.. రాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో వారిని ఆస్పత్రికి తరలించగా.. రాణి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్‌ ఎస్సై సీహెచ్‌.అరుణ్‌కుమార్, స్థానికులు తెలిపారు. 
చదవండి: ఇన్‌స్టాలో ఐఫోన్‌ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్‌ విద్యార్థిని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement