tata ace vehicle
-
బతుకుదెరువు.. గుండె బరువు.. తల్లి ఒడిలో నుంచి ఎగిరిపడి!
సాక్షి, మహబూబాబాద్: బతుకుదెరువు కోసం బయల్దేరిన ఓ కుటుంబానికి గుండె బరువైంది. పొట్టకూటి కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి అమ్మే కుటుంబంలో ఆటో బోల్తా పడి విషాదం నిండింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో మంగళవారం ఆటో బోల్తా పడి రేబెల్లి యాలాద్రి–సమ్మక్క దంపతుల కుమార్తె రాణి(3) మృతి చెందింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లికి చెందిన యాలాద్రి–సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు బతుకుదెరువు కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి, అమ్ముతూ, గ్యాస్ స్టవ్‌లు మరమ్మతు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈక్రమంలో యాలాద్రి, సమ్మక్క తమ కుమార్తె రాణి కలిసి టాటా ఏస్ ట్రాలీ క్యాబిన్లో కూర్చున్నారు. వారితో పాటు వెనకాల ట్రాలీలో సమ్మక్క తల్లి వెంకటమ్మ కూర్చుని వరంగల్ వెళ్లేందుకు బయల్దేరారు. శనిగపురం శివారు గుండ్లబోడుతండా మూల మలుపు వద్ద గల రైస్ మిల్లు ప్రాంతానికి ఆటో చేరుకోగానే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఒక్కసారిగా టాటాఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈఘటనలో యాలాద్రి పక్కనే ఉన్న సమ్మక్క, చిన్నారి రాణి, ఆటో వెనుకభాగంలో కూర్చున్న వెంకటమ్మ రోడ్డుపై పడిపోయారు. సమ్మక్క, వెంకటమ్మకు స్వల్పగాయాలవగా.. రాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో వారిని ఆస్పత్రికి తరలించగా.. రాణి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్, స్థానికులు తెలిపారు. చదవండి: ఇన్‌స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని -
షాద్ నగర్ చటన్‌పల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి : షాద్ నగర్ చటన్ పల్లి బైపాస్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న టాటా ఏపీ వాహనం ఆగి ఉన్న లారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా..ఇద్దరు చిన్నారులకు సైతం గాయాలయ్యాయి. టాటా ఏసీ వాహనం అద్దాలు పగిలి అందులో మహిళ ఇరుక్కుపోగా స్థానికులు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటికి తీశారు. అనంతరం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఎన్కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, విజయవాడ : నగర శివారులో ఉన్న ఓ గ్రామంలో టాటా ఏసీ వాహనం బీభత్సం సృష్టించింది. దారిలో వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అవ్వగా.. ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో క్షతగాత్రులను 108 వాహనంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనంలో మంటలు
తొండంగి: పెళ్లి బృందంతో వెళుతున్న టాటా ఏస్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపేశాడు. దాంతో వాహనంలోని పెళ్లి బృందం కిందకి దూకి ప్రాణాలు దక్కించుకుంది. ఈ సంఘటన శుక్రవారం తుని మండలం తేటగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పెళ్లి వేడుక ముగించుకున్న 10 మంది ...విశాఖ జిల్లా చింతపల్లికి టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. ఆ క్రమంలో వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వాహనం మాత్రం పూర్తిగా తగలబడిపోయింది. -
చేపల దొంగలు అరెస్ట్
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: అర్థరాత్రి వేళ చెరువులో గుట్టుచప్పుడు కాకుండా చేపలు పట్టి టాటా ఏస్ వాహనంలో మార్కెట్‌కు తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మన్మదకుమార్ కథనం మేరకు.. మిర్యాలగూడ మండలంలోని యాదగిరిపల్లికి చెందిన నాగరాజు, నాగబోయిన నాగరాజు, ఎండీ జానీ, అన్నపురి సతీష్, బంటు వెంకటరమణ, చిత్తూరి కృష్ణ, శ్రీరామోజు శివ, బెరైడ్డి అశోక్‌కుమార్‌లు స్నేహితులు. వీరంతా ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా చెరువుల్లో చేపల దొంగతనానికి పాల్పడుతున్నా రు. ఈ క్రమంలో వారు బుధవారం అర్థరాత్రి టాటా ఏస్ వాహనంలో పోచంపల్లి చెరువు వద్దకు చేరుకున్నా రు. గుట్టు చప్పుడు కాకుండా చేపలు పట్టుకొని వాటిని వాహనంలో మార్కెట్‌కు తరలిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. అనుమానం వచ్చి వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో చేపలు ఉన్నాయి. నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా యువకులే.. నిందితులంతా 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్నారు. మొ త్తం 8 మంది రాగా ప్రధాన నిందితుడు నాగరాజు పరారయ్యారు. వీరిలో ఆటో, లారీ డ్రైవర్లు, ఇద్దరు విద్యా ర్థులు కూడా ఉండటం గమనార్హం. కఠినంగా శిక్షించాలి నిందితులను కఠినంగా శిక్షించాలని మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షుడు చెక్క రమేష్, భిక్షపతి, జంగయ్యలు డిమాండ్ చేశారు. గురువారం పోలీసుస్టేషన్లో ఫిర్యా దు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పోచంపల్లి, రేవనపల్లి, ముక్తాపూర్, పెద్దరావులపల్లి, గౌస్‌కొండ చెరువుల్లో చేపల దొంగతనాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెరువుల వద్ద కపలా ఉన్న వ్యక్తులను మారణ ఆయుధాలతో బెదిరించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.