
సాక్షి, రంగారెడ్డి : షాద్ నగర్ చటన్ పల్లి బైపాస్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న టాటా ఏపీ వాహనం ఆగి ఉన్న లారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా..ఇద్దరు చిన్నారులకు సైతం గాయాలయ్యాయి. టాటా ఏసీ వాహనం అద్దాలు పగిలి అందులో మహిళ ఇరుక్కుపోగా స్థానికులు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటికి తీశారు. అనంతరం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment