
సాక్షి, విజయవాడ : నగర శివారులో ఉన్న ఓ గ్రామంలో టాటా ఏసీ వాహనం బీభత్సం సృష్టించింది. దారిలో వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అవ్వగా.. ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో క్షతగాత్రులను 108 వాహనంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment