గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్‌కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది.
ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్‌పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు.
ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్‌తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది.
ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్‌రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్‌లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్‌ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment