
ఆవేదనలో తల్లి
రాజోళి: విధి ఆ కుటుంబంతో వింత నాటకమాడింది. భర్త చనిపో యాడని బాధపడాలో.. అతనికి ప్రతిరూపంగా జన్మించిన కొడుకు ను చూసి సంబరపడాలో తెలియని దయనీయస్థితి ఏర్పడింది ఆ తల్లి కి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ (28)కు ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బల పాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది.
కాగా మంగళవారం శివ తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్ర మంలో బైక్ అదుపు తప్పి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శివ భార్య లక్ష్మితో పాటు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శివ మృతి చెందగా, తర్వాత గంట సమయంలోనే పురిటి నొప్పు లతో శివ భార్య అదే ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఒకవైపు భర్త చనిపోయాడనే బాధ.. మరోవైపు కొడుకు రూపంలో మళ్లీ జన్మించాడనే నమ్మకంతో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. పుట్టిన బిడ్డను చూసుకునే భాగ్యం తండ్రికి లేదని, బిడ్డకు తండ్రిని చూపించే అదృష్టం తల్లికి లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment