ప్రతీకాత్మక చిత్రం
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): నూతక్కి రవికిరణ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచారు. చుండూరు సీఐ బత్తుల కల్యాణ్‌రాజు అందించిన వివరాలు.. మూల్పూరుకు చెందిన రవికిరణ్ గత నెల 20వ తేదీ నుంచి కనబడకుండా పోవడంతో కుటుంబసభ్యులు అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హత్యకు గురై ఉంటాడన్న అనుమానం రావడంతో విచారణాధికారి సీఐ కల్యాణ్‌రాజు కేసుపై మరింత శ్రద్ధ పెట్టారు. తెనాలికి చెందిన రౌడీ షీటర్ సముద్రాల పవన్‌కుమార్ అలియాస్ లడ్డూ, మరి కొందరు హత్య చేసి ఉంటారని కొన్ని ఆధారాల ద్వా రా గుర్తించారు.
చదవండి: మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే?
దర్యాప్తు కొనసాగుతూ ఉండగా రవికిరణ్ ప్రియురాలే అతడి హత్యకు కారకురాలైందని గుర్తించారు. వేమూరు మండలం చదలవాడకు చెందిన అత్తోట దీప్తి, పవన్‌కుమార్ సుమారు 12 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుంది. అయినా లడ్డూతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది. మూడేళ్ల క్రితం ఆమెకు మూల్పూరుకు చెందిన రవికిరణ్ పరిచయమయ్యాడు. అతడితోనూ వివాహేతర బంధం ఏర్పడింది.
ఈ విషయం లడ్డూకు తెలిస్తే తనను చంపుతాడని భయపడిన ఆమె, కొన్నాళ్లుగా రవికిరణ్‌ను దూరం పెడుతూ వచ్చింది. రవికిరణ్ ఆమెకు తరచూ ఫోన్‌లు చేస్తూ ఉండడంతో తనను అతను వేధిస్తున్నాడని మొదటి ప్రియుడు లడ్డూకు చెప్పింది. అతడు రవికిరణ్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. లడ్డూ మరి కొందరు కలసి కర్రలతో దాడి చేయడంతో రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సంగం జాగర్లమూడి కాలువలో పడేశామని నిందితులు అంగీకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో కర్రలు, రక్తం మరకలను గుర్తించారు. దీప్తి, లడ్డు, మక్కెన వంశీ, నన్నపనేని కృష్ణ, పిల్లి రవికుమార్, తూమాటి ప్రశాంత్ హత్యకు కారకులని గుర్తించారు. వీరిలో ప్రశాంత్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి పొద్దుపోయాక కోర్టు లో హాజరుపరిచినట్లు సీఐ కల్యాణ్‌రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment