 
													
ఆదిత్య 369 మెషిన్ అంటూ జరిగిన ప్రచారం ఉత్తదే అని తేలింది.
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. 
టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల  ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో  నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
