బొప్పన సాయి చౌదరి,నాగమణి దంపతులు(ఫైల్ ఫోటో)
సాక్షి, గుడివాడ : కలకలం రేపిన గుడివాడ వృద్ధ దంపతుల హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో పాత నేరస్తుడు జిల్లేల సురేశ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సురేష్‌తో సహా మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలు చేయాలనుకున్న సురేశ్‌కు సెల్వదొరై సహకరించాడు. ఈ నెల 17న గుడివాడ నాలుగోలైన్‌లోని బొప్పన సాయి చౌదరి(72), నాగమణి(67) దంపతుల ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారు.
పథకం ప్రకారం ఆ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకున్నారు. దొంగతనం చేయడానికి ఇంట్లోని పెంపుడు కుక్క అడ్డుగా ఉంటుందని భావించారు. హత్యలకు పదిరోజుల ముందు కుక్కను అతి దారుణంగా చంపేశారు. ఇంటి వెనకాల ఉన్న ఇనుప కంచెను తొలగించి లోపలికి ప్రవేశించారు. అడ్డువచ్చిన వృద్ధ దంపతులను తీవ్రంగా కొట్టి చంపారు. ఆ తర్వాత ఇంట్లోని నగలు, డబ్బులు దోచుకుని ఇంటి బయట ఉంచిన కారుతో సహా పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment