స్వప్న ( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్/గుడివాడ: వివాహ బంధాలు విలువ లేకుండా పోతున్నాయనే అభిప్రాయం పెరిగిపోవడానికి కారణం.. కొందరి చేష్టలే!. అలాంటి ఘటనే ఇది. భర్త అనారోగ్యం అనే కారణంతో.. ఎదురింట్లో ఉన్న ఓ మైనర్‌పై మనసు పారేసుకుంది నలుగురు పిల్లల తల్లి. అతనితో శారీరకంగా సంబంధం నడిపింది. ఆపై ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతన్ని ట్రాప్ చేసి.. ఊరు విడిచి పారిపోయింది కూడా.
కృష్ణా జిల్లా గుడివాడలో ఈ కేసు సంచలనం రేపింది. ఎదురింట్లో ఉండే మైనర్‌ను తీసుకొని పారిపోయిన వివాహిత స్వప్నను పొక్సో యాక్ట్ కింద ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆపై బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. అలాగే మైనర్‌కు కౌన్సెలింగ్ ఇప్పించిన పోలీసులు.. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంతో కథ సుఖాంతం అయ్యింది.
భర్త దూరంగా..
కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. భర్త అనారోగ్యం కారణంగానే మైనర్‌తో స్వప్న వివాహేతర సంబంధం నడిపిందని పేర్కొన్నారాయన. గుడివాడ గుడ్‌మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30)కు నలుగురు పిల్లలు. భర్త అనారోగ్యంతో వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో తన ఎదురింటిలో ఉండే మైనర్(15)తో శారీరక సంబంధం పెట్టుకుంది. నెలరోజులు గుట్టుగా అతనితో వ్యవహారం నడిపించింది. ఈ నెల 19న అతనితో పరారయ్యింది. ఈ క్రమంలో మైనర్ తండ్రి గత సోమవారం పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వప్న కూడా కనిపించపోయేసరికి.. అనుమానాలు మొదలయ్యాయి.
స్వప్న, సదరు మైనర్ హైదరాబాద్ బాలానగర్‌లో ఓ గదిలో అద్దెకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసి.. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. స్వప్నను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.
అశ్లీల వీడియోలతో ట్రాప్
ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్.. ‘ఆంటీ’ అంటూ స్వప్న ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి అశ్లీల వీడియోలు చూపించి.. శారీరకంగా లోబర్చుకుంది ఆమె. ఆపై భర్త, పిల్లలను వదిలేసి.. ఇద్దరం కలిసి బతుకుదామని, తన వెంట వచ్చేయమని మైనర్‌ని బలవంతం చేసింది. ఈ క్రమంలో భయం భయంగానే ఆమెతో పాటు హైదరాబాద్ వచ్చేశాడు బాలుడు. అయితే గుడివాడ టూటౌన్ పోలీసులు ఈ కేసు ఛేదించిన విషయం.. వారిద్దరినీ గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని బాలానగర్ సీఐ భాస్కర్ చెప్పడం గమనార్హం.
ఇదీ చదవండి: విశాఖ ఆర్కే బీచ్ నుంచి గాయబ్.. భర్తకు సాయిప్రియ సర్‌ప్రైజ్
Comments
Please login to add a commentAdd a comment