సినిమాల్లో ఓకే - నెట్లో నో | Shruti Hassan ready to File a case | Sakshi
Sakshi News home page

సినిమాల్లో ఓకే - నెట్లో నో

Published Mon, Apr 28 2014 7:53 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

శృతిహాసన్ - Sakshi

శృతిహాసన్

హీరోయిన్  శృతిహాసన్ ఈ మధ్య ఏదో ఒక విషయమై వివాదాలలో చిక్కుకుంటోంది. అందాలను ఆరబోయడంలో శృతి మించుతున్నారని, గ్లామర్ విషయంలో హద్దులు మీరుతున్నారని ఆమెపై విమర్శలు కూడా  వస్తున్నాయి. ఈ భామ బాలీవుడ్లో ప్రవేశించడం ప్రవేశించడమే తొలి చిత్రం లక్ (హిందీ)లో బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.  ఆ తరువాత 'డిడే' హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో హద్దులుమీరి శంగారాన్ని ఒలకబోసింది.  ఇక తెలుగు చిత్రం రేసుగుర్రంలో అయితే  ఒక పాటలో  హాట్ హాట్ డ్యాన్స్తో  కుర్రకారుకు గుబులు పుట్టించ్చింది. ఆ ఫోటోలతో కూడిన పోస్టర్ల వల్ల చెన్నైలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.   దాంతో  మహిళా సంఘాల వారు ఆందోళనకు దిగారు.  గ్లామర్‌కు కూడా ఒక హద్దు ఉంటుందని వారు కొన్ని చోట్ల ఆ వాల్ పోస్టర్లను చింపేశారు.

ఒక్కో చిత్రంలో ఒక్కో రకంగా తన అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ  తన అశ్లీల ఫోటోలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో  అశ్లీలంగా నటించడానికి అభ్యంతరం తెలపని శృతిహాసన్, ఇప్పుడు తన ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టినవారిపై కేసు వేస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ భామ తెలుగులో ఇంతకు ముందు రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలోని ఆమె గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి కారణం ఆ చిత్ర నిర్మాతగానీ, స్టిల్ ఫోటో గ్రాఫర్‌గానీ అయి ఉంటారని ఆమె అనుమానిస్తున్నట్లు సమాచారం.  ఇటువంటి చిత్రాలను ప్రచురించే ముందు తన అనుమతి తీసుకోవాలన్నది ఆమె అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement