obscene pictures
-
వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!
సాక్షి, అమరావతి: ప్రేమ పేరుతో వంచించి.. యువతి నగ్న చిత్రాలను తీసి లొంగదీసుకున్న కేసులో సూత్రధారి వంశీకృష్ణ అరెస్టుకు విజయవాడ నగర పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో చదువుతున్న అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ పుట్టిన రోజు పార్టీలో పరిచయమైన యువతిని మాచవరంలో ఉంటున్న వంశీకృష్ణ మాయ మాటలతో లొంగదీసుకుని.. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నాడు. తరువాత అతడు ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. అతడు ఆ వీడియోలను ప్రస్తుతం అరెస్టు అయిన స్నేహితుడు జగదీష్‌కు పంపించాడు. అప్పటి నుంచి అమ్మాయిని జగదీష్ లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ దుర్ఘటన జరగడానికి కారకుడైన జగదీష్ స్నేహితుడు వంశీకృష్ణను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడని ఇక్కడికి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం ముందుగా జిల్లా కోర్టులో ఓపెన్ డేటెడ్ వారెంట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ తరువాత సీఐడీ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగదీష్ వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్‌ను పోలీసులు విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాగే ఇంకా ఎవరినైనా బెదిరించి నగ్న చిత్రాలు తీశాడా? అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఆ ఫోన్‌ను సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించే యోచనలో ఉన్నారు. వంశీకృష్ణ, జగదీష్‌లతోపాటు ఇంకా ఎవరైనా ఇలా వ్యవహరించారా కోణంలో పరిశీలిస్తున్నారు. వారిద్దరి స్నేహితుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వారి ద్వారా మరింత కూపీ లాగాలని యత్నిస్తున్నారు. చదవండి: ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..! -
అనంతలో దారుణం.. నెట్లో బాలిక చిత్రాలు
-
అనంతలో దారుణం.. నెట్లో బాలిక చిత్రాలు
అనంతపురం జిల్లా కదిరిలో దారుణం జరిగింది. కదిరి మండలం హనుమంతరాయపల్లికి చెందిన ఓ బాలిక నగ్నదృశ్యాలను చిత్రీకరించిన కొందరు వ్యక్తులు.. వాటిని ఇంటర్నెట్లో పెట్టారు. ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. దుస్తులు కుట్టించుకోడానికి లేడీస్ టైలర్ కవిత వద్దకు వచ్చినప్పుడు ఆమె సమీప బంధువు, గార్లపెంట సొసైటీ బ్యాంకు ఉద్యోగి అయిన నాగరాజు రహస్యంగా తన మొబైల్లో ఆమె నగ్నదృశ్యాలను చిత్రీకరించాడు. తర్వాతి నుంచి కొంత కాలంగా ఆ బాలికను నాగరాజు లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆమె తనకు ఎంతకీ లొంగకపోవడంతో ఆ నగ్నదృశ్యాలను నాగరాజు, అతడి స్నేహితుడు నగేష్ కలిసి ఇంటర్నెట్లో పెట్టారు. బాలిక బంధువులు కొంతమంది వాటిని చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు బాలిక దృశ్యాలను నెట్లోంచి తొలగించారు. నిందితులు కవిత, నాగరాజు, నగేష్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావడంతో పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. కవిత, నాగరాజు కూడా టీడీపీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. దాంతో కేసును తారుమారు చేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. అయితే, ఇప్పటికే తాము పోస్కో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు. -
ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి.. ఫొటోలు పోస్ట్
కోయంబత్తూర్: పలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తన ప్రేయసికి చెందిన అభ్యంతర కర ఫొటోలు పోస్టు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న గౌతం అనే 19 ఏళ్ల యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో పలు ప్రాంతాల్లో తిరిగాడు. అలా తిరగే క్రమంలో వారిద్దరూ కలిసి చాలా ఫొటోలు దిగారు. ఇటీవల ఆమెను లక్ష రూపాయలు ఇవ్వాలని లేదంటే వారిద్దరు అభ్యంతరకర పరిస్థితుల మధ్య దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తానని బెదరించాడు. కానీ, ఆ యువతి పట్టించుకోకపోవడంతో.. ఆమెను భయపెట్టడం కోసం ఓ ఫొటోను ఆయా సామాజిక అనుసంధాన వేధికల్లో పోస్ట్ చేశాడు. దీంతో సదరు యువతి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, విద్యా జీవితం చెడిపోతుందని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. కానీ, తీరు మార్చుకొని గౌతమ్ మరోసారి అలాంటి ఫొటోలు పోస్ట్ చేశాడు. అది కూడా.. ప్రియురాలి పాస్ వర్డ్ దొంగిలించి మరీ ఈ పోస్ట్ చేశాడు. దీంతో తిరిగి అతడిని అరెస్టు చేశారు. -
సినిమాల్లో ఓకే - నెట్లో నో
హీరోయిన్ శృతిహాసన్ ఈ మధ్య ఏదో ఒక విషయమై వివాదాలలో చిక్కుకుంటోంది. అందాలను ఆరబోయడంలో శృతి మించుతున్నారని, గ్లామర్ విషయంలో హద్దులు మీరుతున్నారని ఆమెపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ భామ బాలీవుడ్లో ప్రవేశించడం ప్రవేశించడమే తొలి చిత్రం లక్ (హిందీ)లో బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తరువాత 'డిడే' హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో హద్దులుమీరి శంగారాన్ని ఒలకబోసింది. ఇక తెలుగు చిత్రం రేసుగుర్రంలో అయితే ఒక పాటలో హాట్ హాట్ డ్యాన్స్‌తో కుర్రకారుకు గుబులు పుట్టించ్చింది. ఆ ఫోటోలతో కూడిన పోస్టర్ల వల్ల చెన్నైలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో మహిళా సంఘాల వారు ఆందోళనకు దిగారు. గ్లామర్‌కు కూడా ఒక హద్దు ఉంటుందని వారు కొన్ని చోట్ల ఆ వాల్ పోస్టర్లను చింపేశారు. ఒక్కో చిత్రంలో ఒక్కో రకంగా తన అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ తన అశ్లీల ఫోటోలను ఇంటర్నెట్లో ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో అశ్లీలంగా నటించడానికి అభ్యంతరం తెలపని శృతిహాసన్, ఇప్పుడు తన ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టినవారిపై కేసు వేస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ భామ తెలుగులో ఇంతకు ముందు రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలోని ఆమె గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం ఆ చిత్ర నిర్మాతగానీ, స్టిల్ ఫోటో గ్రాఫర్‌గానీ అయి ఉంటారని ఆమె అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి చిత్రాలను ప్రచురించే ముందు తన అనుమతి తీసుకోవాలన్నది ఆమె అభిప్రాయం. -
ప్రచారం కోసం దిగజారను!
గత వారం, పది రోజులుగా అంతర్జాలంలో ఎక్కడ చూసినా శ్రుతీహాసన్ ఫొటోలే. అవి అలాంటి ఇలాంటి ఫొటోలు కావు. చాలా గ్లామరస్ ఫొటోలన్నమాట. ‘ఎవడు’ సినిమాలో శ్రుతీహాసన్ చేసిన ‘నిన్ను చూడకుంటే చాలు...’ పాటకు సంబంధించిన ఫొటోలివి. మామూలుగా పాటల్లో కథానాయికలు చిట్టి పొట్టి దుస్తుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తుంటారు. వెండితెరపై చూసినప్పుడు కన్నా ఫొటోల రూపంలో చూసినప్పుడు ఆ ప్రదర్శన ఎబ్బెట్టుగా ఉంటుంది. ‘నిన్ను చూడకుంటే...’ పాట విషయంలో జరిగింది అదే. ఆ పాటలో శ్రుతి గ్లామరస్‌గా కనిపించినా, అశ్లీలంగా అయితే లేదు. కానీ, ఫొటోలు మాత్రం చాలా హాట్‌గా ఉన్నాయి. అవి బయటికెలా వచ్చాయో తనకు తెలియడంలేదని, చూసినవాళ్లు ‘ప్రచారం కోసమే ఇలాంటి పోజులిచ్చావా’ అనడిగితే, షాక్ అయ్యానని శ్రుతి పేర్కొన్నారు. ప్రచారం కోసం ఇంతగా దిగజారాల్సిన అగత్యం తనకు లేదని ఒకింత ఆవేదన, ఆగ్రహంతో అన్నారామె. ఈ ఫొటోల గురించి వివరంగా చెబుతూ -‘‘మామూలుగా షూటింగ్ లొకేషన్స్‌లో చిత్ర బృందానికి సంబంధించిన ఫొటోగ్రాఫర్లు రకరకాల కోణాల్లో ఫొటోలు తీస్తుంటారు. అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలను ఆ సినిమాకి సంబంధించినవారే తీసేస్తారు. వాటిని బయటకు వెళ్లనీయరు. కానీ, నా ఫొటోలు బయటికి వచ్చేశాయ్. నేనీ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టదల్చుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నా. వెబ్‌సైట్స్‌లో ఆ ఫొటోలను ఎవరు పెట్టారో తెలుసుకుంటా. నాకు సినిమా వెనక ఉన్న ప్రపంచం గురించి తెలియదు. ఏదేమైనా తెరపై, తెరవెనుక సినిమా కోసం పని చేస్తున్న అందర్నీ నా కుటుంబాన్ని నమ్మినంతగా నమ్మాను. కానీ, నమ్మకద్రోహం చేశారు. అందుకు చాలా చాలా బాధగా ఉంది’’ అన్నారు. -
విద్యార్థిని అసభ్య చిత్రాలతో బ్లాక్మెయిల్, నిందితుడి అరెస్టు
కాలేజి విద్యార్థినిని లోబర్చుకుని, అసభ్య భంగిమలలో ఆమె ఫొటోలు తీసి, చివరకు బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ సంఘటన మహారాష్ట్రలోని యవత్మల్ ప్రాంతంలో జరిగింది. లలిత్ అరుణ్ గాజ్భయ్యే (25) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడగా, అతడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ సంఘటనపై మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. నిందితుడి విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని యవత్మల్ ఎంపీ భావనా గవాలీ తాజాగా డిమాండ్ చేశారు. ఓ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న సదరు అమ్మాయిని అతడు వలలో వేసుకుని, తర్వాత ఆమెను ఓ హోటల్ గదికి తీసుకెళ్లి అక్కడ అసభ్య భంగిమలలో ఫొటోలు తీశాడు. తర్వాత ఆ ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటికే రూ. 90 వేల వరకు తీసుకున్నాడు. మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆ తర్వాత డిమాండ్ చేశాడు. దీంతో ఆ యువతి అరుణ్ గాజ్భయ్యేతో పాటు అతడి స్నేహితుడు రాజు రత్నకుమార్ గుప్తా (41)పై కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిద్దరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.