విద్యార్థిని అసభ్య చిత్రాలతో బ్లాక్మెయిల్, నిందితుడి అరెస్టు | student clicked in obscene pose, blackmailed in maharashtra | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అసభ్య చిత్రాలతో బ్లాక్మెయిల్, నిందితుడి అరెస్టు

Published Fri, Nov 22 2013 7:31 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

విద్యార్థిని అసభ్య చిత్రాలతో బ్లాక్మెయిల్, నిందితుడి అరెస్టు - Sakshi

విద్యార్థిని అసభ్య చిత్రాలతో బ్లాక్మెయిల్, నిందితుడి అరెస్టు

కాలేజి విద్యార్థినిని లోబర్చుకుని, అసభ్య భంగిమలలో ఆమె ఫొటోలు తీసి, చివరకు బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ సంఘటన మహారాష్ట్రలోని యవత్మల్ ప్రాంతంలో జరిగింది. లలిత్ అరుణ్ గాజ్భయ్యే (25) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడగా, అతడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

ఈ సంఘటనపై మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. నిందితుడి విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని యవత్మల్ ఎంపీ భావనా గవాలీ తాజాగా డిమాండ్ చేశారు. ఓ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న సదరు అమ్మాయిని అతడు వలలో వేసుకుని, తర్వాత ఆమెను ఓ హోటల్ గదికి తీసుకెళ్లి అక్కడ అసభ్య భంగిమలలో ఫొటోలు తీశాడు. తర్వాత ఆ ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటికే రూ. 90 వేల వరకు తీసుకున్నాడు. మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆ తర్వాత డిమాండ్ చేశాడు. దీంతో ఆ యువతి అరుణ్ గాజ్భయ్యేతో పాటు అతడి స్నేహితుడు రాజు రత్నకుమార్ గుప్తా (41)పై కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిద్దరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement