జోహన్నెస్‌బర్గ్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారులు ఎక్కడున్నాయో తెలుసా? దక్షిణాఫ్రికాలో. అక్కడ ప్రయాణం అంటే బెంబేలెత్తిపోవాల్సిందే. ఇంటికి తిరిగొచ్చేదాకా ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. మోస్టు డేంజరస్ రోడ్లలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంటర్నేషన్ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ జుటోబీ తాజా అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమయ్యింది.
అపాయకరమైన రోడ్ల విషయంలో మొత్తం 56 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, రెండో స్థానంలో థాయ్‌లాండ్, మూడో స్థానంలో అగ్రరాజ్యం అమెరికా, నాలుగో స్థానం ఇండియా నిలిచాయి. ఇక బాగా సురక్షితమైన రోడ్లు ఎక్కడున్నాయంటే నార్వేలో ఉన్నాయట. ఈ విషయంలో రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో స్వీడన్ నిలిచాయి. అపాయకరమైన, సురక్షితమైన రోడ్లు ఉన్న దేశాలో ఏమిటో తేల్చేందుకు అధ్యయనకర్తలు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య, ప్రయాణంలో సీటు బెల్టు ధరించే వారి సంఖ్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించిన మరణాలు, రోడ్లపై చట్టబద్ధమైన గరిష్ట వేగ పరిమితి తదితర అంశాల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. జుటోబీ అధ్యయనంలో వెల్లడైన విషయాలను దక్షిణాఫ్రికాలో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జస్టిస్ ప్రాజెక్టు ఎస్‌ఏ(జేపీఎస్‌ఏ) చైర్‌పర్సన్ హోవార్డ్ డెంబోవిస్కీ తోసిపుచ్చారు. జుటోబీ సంస్థ కాలంచెల్లిన గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేసిందని చెప్పారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment