ప్యారిస్లో మళ్లీ కాల్పులు: మహిళా పోలీసు మృతి | fresh firing in paris, one police injured | Sakshi
Sakshi News home page

ప్యారిస్లో మళ్లీ కాల్పులు: మహిళా పోలీసు మృతి

Published Thu, Jan 8 2015 2:00 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

ప్యారిస్లో మళ్లీ కాల్పులు: మహిళా పోలీసు మృతి - Sakshi

ప్యారిస్లో మళ్లీ కాల్పులు: మహిళా పోలీసు మృతి

పత్రికా కార్యాలయంపై కాల్పుల ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరోసారి ప్యారిస్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. హై ఎలర్ట్ ఉన్నా కూడా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  ఓ గుర్తు తెలియని వ్యక్తి బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని, ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా పోలీసు అధికారి మరణించారు.

అనుమానితుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి ఫ్రాన్స్ హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ హుటాహుటిన చేరుకున్నారు. ఈ ఘటన ప్యారిస్ దక్షిణ ప్రాంతంలోని పోర్ట్ డి షాటిల్లన్ ప్రాంతంలో జరిగింది. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో కాల్పులు జరిపి 12 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఈ కాల్పులు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement