'అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం' | IS Terrorists killed Charlie Hebdo magazine news director | Sakshi
Sakshi News home page

'అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం'

Published Wed, Jan 7 2015 7:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

'అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం'

'అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం'

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో చార్లీ హెబ్డో మేగజీన్ న్యూస్ డైరెక్టర్ స్టీఫెన్ షార్బోనియర్ మృతి చెందారు. ప్రముఖ ఫ్రెంచి కార్టూనిస్టులు కాబు, ఛార్బ్, వోలినిస్కీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. స్టీఫెన్ షార్బోనియర్ ను హతమారిస్తు భారీగా నగదు బహుమతి ఇస్తామని అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ 2013లో ప్రకటించింది.

కాగా, కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఫ్రెంచిలో మాట్లాడుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నామంటూ ఉగ్రవాదులు నినాదాలు చేసినట్టు వెల్లడించారు. ఏకే-47 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులకు తెగబడినట్టు తెలిపారు. మరోవైపు పారిపోయిన ఉగ్రవాదుల పట్టుకునేందుకు ప్యారిస్ అంతటా జల్లెడ పట్టారు. ఎక్కడిక్కడ రవాణా వ్యవస్థను నిలిపివేసి సోదాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement