బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. ఐఎస్ ఉగ్రవాదులు 25 మంది సిరియా సైనికులను కాల్చిచంపి.. ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టారు. సిరియాలోని పల్మీరా అనే పట్టణంలో ఈ దారుణం జరిగింది.
ఐఎస్ ఉగ్రవాదులు సైనికులను ట్రక్కుల్లో తీసుకుని వచ్చి వరుసగా నిలబెట్టారు. వందలాదిమంది చూస్తుండగా వారిని కాల్చిచంపారు. మే 27న ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. పల్మీరా పట్టణాన్ని ఉగ్రవాదుల తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సైనికులు, ఉద్యోగులను చంపినట్టు తెలిపింది.
25 మంది సైనికులను చంపి వీడియో తీశారు
Published Sun, Jul 5 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement