ఫ్రాన్సులో కలకలం రేపిన ఉగ్రవాదులను పట్టుకోడానికి ఐదు హెలికాప్టర్లతో ఆపరేషన్ జరుగుతోంది. డమార్టన్ ఎన్ గోయిల్ వద్ద ఉన్న పారిశ్రామిక ప్రాంతం వెలుపల 88 వేల మంది పోలీసులు చేరుకున్నారు. అల్ కాయిదా సానుభూతిపరులైన ఇద్దరు ఉగ్రవాద సోదరులు శుక్రవారం ఉదయం ఓ కారును చోరీ చేశారు. పోలీసులు వాళ్ల కారును వెంబడించడంతో పారిపోయిన ఉగ్రవాదులు ఓ ప్రింటింగ్ ప్రెస్లో దాక్కున్నారు. దాంతో భారీగా ఫ్రెంచి భద్రతా దళాలను అక్కడ మోహరించారు.
అయితే.. కొంతమంది ఉద్యోగులను ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వాట్ బృందాలు కూడా ప్యారిస్ ఈశాన్య ప్రాంతానికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు అక్కడ మరోసారి దాడి చేసే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో భారీగా పోలీసు బృందాలు చేరుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఉగ్రవాదులు సాయుధులని, అత్యంత ప్రమాదకరమైన వాళ్లని ఫ్రాన్సులో ఇప్పటికే ప్రకటించారు.
ఐదు హెలికాప్టర్లతో ఆపరేషన్
Published Fri, Jan 9 2015 3:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement