సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రక్కసితో ప్రజలంతా యుద్ధం చేస్తుంటే దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారు. ఢిల్లీలోని తిహార్ జైలు వేదికగా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది దీనికి పథకం రచిస్తుండగా ఇరాన్‌కు చెందిన ఉద్రవాద జంట గుట్టువిప్పింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది తిహార్ జైల్లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు నేర్పుతున్నాడు. యువతను ఉద్రదాడులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాడు. అయితే అదే జైల్లో శిక్ష అనుభివస్తున్న ఇరాన్ ఖొరాసన్ మోడ్యూల్‌కు చెందిన జంట ఉగ్రదాడి కుట్ర గురించి పోలీసులుకు సమాచారం ఇచ్చి బయటపెట్టింది.
రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ విచారణ జరపగా.. ఉగ్రవాది కుట్రను బయపెట్టాడు. గతంలో ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు సిరియా వెళ్ళడానికి యత్నించి మహారాష్ట్రలో పోలీసులకు చిక్కింది కూడా ఇతనే అని పోలీసులు గుర్తించారు. దేశంలో స్వతహాగా దాడులకు దిగేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే నిందితున్ని 2018లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా ఘటనతో ఉగ్రవాదిని ఎన్ఐఏ కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు ఎన్‌ఐఏ అధికారులు సమాచారం ఇచ్చారు. (ఐసోలేషన్‌కు కాదు.. జైలుకు వెళ్లాడు)
Comments
Please login to add a commentAdd a comment