సాక్షి, న్యూఢిల్లీ : తీహార్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇటీవల అత్యాచార ఆరోపణల కింద అరెస్టు అయి తీహార్ జైలుకు వచ్చిన ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర జైలు సిబ్బంది, అధికారులతో పాటు మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్‌కు తరలించారు. నిందితుడికి న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు.
(చదవండి : క్వారంటైన్ భయం: రైల్లో నుంచి దూకి..)
అయితే అత్యాచార బాధితురాలికి కరోనా వైరస్ సోకడంతో నిందితుడికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. దీంతో జైలు అధికారులు నిందితుడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో అతనితో పాటు మరో ఇద్దరి ఖైదీలను క్వారంటైన్‌కు తరలించారు. పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉన్న తీహార్ జైలులో కరోనా కేసు వెలుగుచూడడంతో జైలు వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment