దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌ను ఢిల్లీకి తరలించారు.
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌ను ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలు నుంచి శిక్ష అనుభవిస్తున్న అతన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్‌ఐఏ అధికారులు తీహార్ జైలుకు పంపించారు.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అజాజ్, అక్తల్‌ను ముంబైకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ట్రయల్స్ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లే సమయంలో భత్కల్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. భత్కల్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అధికారులు అతన్ని తీహార్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.