
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్: కశ్మీరీ యువతను ఉగ్రవాదం వైపునకు ఆకర్షించేందుకు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అందమైన అమ్మాయిలను ఎరగా ఉపయోగించుకుంటున్నాయి. బందిపొరాకు చెందిన సయ్యద్ షాజియా అనే మహిళను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈమె ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ పేర్లతో పలు ఖాతాలను సృష్టించి యువతతో పరిచయం పెంచుకుంటుందనీ, అనంతరం తాను చెప్పిన పని చేస్తే వారిని కలుస్తానని నమ్మబలుకుతుందని పోలీసులు వెల్లడించారు.
షాజియా వలలో పడిన యువత, ఆమె చెప్పినట్లుగా ఆయుధాలను రవాణా చేయడం, ఉగ్రవాదులకు మార్గం చూపడం తదితరాలు చేస్తున్నారని తెలిపారు. ఇలా మరికొంత మంది అమ్మాయిలు కూడా ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని షాజియా విచారణలో వెల్లడించింది. ఆమెకు సమాచారం ఇస్తున్న పోలీస్ ఉద్యోగి ఇర్ఫాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ షాజియా నుంచి గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నరు. ఆమె ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment