Kashmir youth
-
ఆపద్బాంధవుడు కానిస్టేబుల్ సదాశివ
కర్ణాటక, బొమ్మనహళ్లి : ఉద్యోగం కోసం కశ్మీర్ నుంచి బెంగళూరు వచ్చిన ఓ యువతి నగరంలో తన విద్యకు సంబంధించిన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న సమయంలో వాటిని తిరిగి అందజేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. కశ్మీర్‌కు చెందిన మరియా అనే యువతి నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. వారం రోజుల క్రితం మాన్యత టెక్‌పార్కులో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లే క్రమంలో తన విద్యకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోగొట్టుకుంది. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సదాశివకు అక్కడ ఒక బ్యాగ్ కనిపించడంతో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. యువతికి సంబంధించిన ఫోన్‌నెంబర్లు లేకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఇదే క్రమంలో బాధిత యువతి మరియా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువతి ఫోన్ నెంబర్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వాటిని కానిస్టేబుల్ సదాశివ ద్వారా ఇప్పించారు. దీంతో మరియా సంగిగెహళ్లి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. వారి వల్లనే తనకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. -
అందమైన అమ్మాయిలతో వల..
శ్రీనగర్: కశ్మీరీ యువతను ఉగ్రవాదం వైపునకు ఆకర్షించేందుకు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అందమైన అమ్మాయిలను ఎరగా ఉపయోగించుకుంటున్నాయి. బందిపొరాకు చెందిన సయ్యద్ షాజియా అనే మహిళను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈమె ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ పేర్లతో పలు ఖాతాలను సృష్టించి యువతతో పరిచయం పెంచుకుంటుందనీ, అనంతరం తాను చెప్పిన పని చేస్తే వారిని కలుస్తానని నమ్మబలుకుతుందని పోలీసులు వెల్లడించారు. షాజియా వలలో పడిన యువత, ఆమె చెప్పినట్లుగా ఆయుధాలను రవాణా చేయడం, ఉగ్రవాదులకు మార్గం చూపడం తదితరాలు చేస్తున్నారని తెలిపారు. ఇలా మరికొంత మంది అమ్మాయిలు కూడా ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని షాజియా విచారణలో వెల్లడించింది. ఆమెకు సమాచారం ఇస్తున్న పోలీస్ ఉద్యోగి ఇర్ఫాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ షాజియా నుంచి గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నరు. ఆమె ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆ ఉగ్రవాద సంస్థలో ఎక్కువగా చేరుతున్నారు!
శ్రీనగర్: ఉగ్రవాదం వైపు అడుగులేస్తున్న కశ్మీర్ యువత సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది 126 మంది వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. ఈ ఏడాది జూలై నాటికే 131 మంది అటు వైపు ఆకర్షితులైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై 31 వరకు సేకరించిన సమాచారం ప్రకారం 131 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. వీరిలో సోఫియా జిల్లా నుంచే 35 మంది చేరినట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. సోఫియా, పుల్వామా, అనంత్‌నాగ్, కుల్గామ్, అవంతిపురా జిల్లాల యువత ఎక్కువగా ఉగ్ర భూతం వైపు మళ్లుతున్నారని.. ఇప్పటివరకు చేరిన 131 మందిలో ఈ 5 జిల్లాల నుంచే 100 మంది ఉన్నారని తెలిపారు. అల్ కాయిదాకు మద్దతు సంస్థగా చెబుతున్న అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ వైపు యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని.. దీనికి పుల్వామా జిల్లాకు చెందిన రషీద్ భట్ అలియాస్ జకీర్ ముసా నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలను పక్కనబెడుతూ ముసా ఇచ్చిన సరికొత్త ‘షరియత్ యా షహదత్ (ఇస్లాం చట్టాలను అమలు చేద్దాం లేదా మరణిద్దాం)’ నినాదం వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నాని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసిన ముసా.. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన బుర్హన్ వనీ 2016లో హతమైన తర్వాత అక్కడి యువతను ఆకర్షించడంలో సఫలీకృతుడవుతున్నాడని అంటున్నారు. ముసా చదువులో, ఆటల్లో ముందుండేవాడని.. అంతరాష్ట్ర క్యారమ్ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడాడని చెప్పారు. అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ సంస్థ ఇంకా మొదలవలేదని పోలీసులు చెబుతున్నా.. ఆ సంస్థకు అక్కడి యువతలో ఆదరణ మాత్రం పెరుగుతున్నట్లు అనుమానం. -
నన్ను భారత్ ఆర్మీ కాపాడింది
-
నన్ను భారత్ ఆర్మీ కాపాడింది : ఉగ్రవాది
కశ్మీర్ : నన్ను ఇండియన్ ఆర్మీ కాపాడింది.. ఈ మాట చెప్పింది ఓ కరుడు కట్టిన ఉగ్రవాది. బారాముల్లాలో భారత సైనికులతో పాటు, ప్రజలపై దాడులకు పాల్పడుతూ పట్టుబడిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు. ఓ వీడియో విడుదల చేస్తూ.. హింసను విడనాడాలంటూ తనతోటి స్నేహితులు, మిలిటెంట్లకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరు అజీజ్ అహ్మద్ గోజ్రీ అని చెప్పిన అతడు, తన స్నేహితులు సుహైన్ అభూబ్, మొహసీన్ ముస్తాక్ భట్, నాసిర్ అమిన్ డ్రాజీలను ఉగ్రవాదం విడిచి తమ స్వస్థలాలకు రావాలంటూ కోరాడు.. ఇళ్లను, తల్లిదండ్రులను విడిచి, తప్పుడు మార్గంలో వెళ్తూ.. అడవుల్లో జీవించే తర స్నేహితులు ఇంటికి రావాలంటూ కోరాడు. ఆర్మీ అధికారులు తనను అరెస్టు చేసినప్పుడు, చంపే అవకాశం ఉన్నా, చంపకుండా జీవితాన్ని కాపాడారని వెల్లడించాడు. అంతకు ముందు రోజే పాకిస్తాన్ తనతో భారత భద్రతా బలగాలు చాలా క్రూరమైనవని అంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ అది వాస్తవం కాదన్నాడు. భారత ఆర్మీ అధికారులను కలిస్తే అసలు విషయం బోధపడుతుందన్నాడు. ఇదంతా పాకిస్తాన్ చేసే కుట్రని పేర్కొన్నాడు. పాకిస్తాన్, లష్కరే తోయిబా కాశ్మీరీ యువత జీవితాలతో ఆడుకుంటోందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏప్రిల్ 30న ఉత్తర కశ్మీర్లో భారత భద్రతా బలగాలు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి స్వయం ప్రకాశ్ మాట్లాడుతూ లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని చెప్పడానికి తమ దగ్గర చాలా సాక్షాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అన్నారు. -
ఆ తల్లిది ఆరణ్య రోదనేనా?
శ్రీనగర్ : కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న అక్కడి తల్లిదండ్రులకు.. గుండెకోతే మిగులుతుంది. ఉన్నత భవిష్యత్తును నాశనం చేసుకుని మరీ కశ్మీర్ యువత ఉగ్రవాదంవైపు వాళ్లు అడుగులు వేస్తున్నారు. అలాంటి తల్లుల జాబితాలో అయేషా ఖాన్ కూడా చేరిపోయారు. ఆమె కొడుకు 20 ఏళ్ల మజీద్ ఖాన్.. యూజీలో కామర్స్ రెండో ఏడాది చదువుతున్నాడు. టెన్త్, ఇంటర్లో అతను స్టేట్ ర్యాంకర్ కూడా. పైగా అనంతనాగ్ జిల్లా ఫుట్ బాల్ జట్టు గోల్ కీపర్ కూడా. ఇది చాలదన్నట్లు ఓ ఎన్జీవో తరపున వైద్య సేవలను అందించటంలో సాయం చేస్తుంటాడు. అంతటి మంచోడు ఉన్నట్లుండి వారం క్రితం అదృశ్యమయ్యాడు. ఏమైందోనని అంతా కంగారుపడుతున్న సమయంలో లష్కరే తా ఇయిబాలో చేరినట్లు గత గురువారం వీడియోను రిలీజ్ చేసి కలకలం రేపాడు. అంతే ఆ దృశ్యాలను చూసిన ఆయన తండ్రి(ఇర్షద్ అహ్మద్ ఖాన్.. ప్రభుత్వ ఉద్యోగి) గుండెపోటుతో కుప్పకూలిపోయి మంచానపడ్డాడు. తల్లి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు అయిపోయాయి. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు... దీంతో ఎలాగైనా సరే వెనక్కి వచ్చేయంటూ అతనికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నపేగు దూరం కావటంతో విలపిస్తున్న ఆమెను ఓదార్చటానికి వచ్చిన స్థానిక మహిళల ముఖంలో ఎలాంటి స్పందన కనిపించటం లేదు. కారణం వారిలో చాలా మంది కుటుంబ సభ్యులు ఇలా ఉగ్రవాదంవైపు వెళ్లిపోవటమే. మజీద్‌ను ప్రభావితం చేసిన అంశం? ఇంతకీ మజీద్ ఉగ్రవాదంవైపు వెళ్లటానికి గల కారణంపై స్నేహితులు ఓ కథనం చెబుతున్నారు. యవార్ నిసార్.. మజీద్‌కు అత్యంత సన్నిహితుడు. కొన్నాళ్ల క్రితం ఉగ్రవాదంలో చేరిన యవార్ పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ సమయంలో మృతదేహాంపై పడి మజీద్ ఘోరంగా విలపించాడు. ఆ ఘటన స్థానిక మీడియాలో ప్రముఖంగా కూడా ప్రసారం అయ్యింది. ఈ నేపథ్యంలో స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకే మజీద్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడేమోనని కొందరు స్నేహితులు చెబుతున్నారు. ఇక మజీద్ స్నేహితులు అతని ఫేస్ బుక్ పేజీలో వెనక్కి వచ్చేయంటూ పోస్టులు పెడుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు కూడా అతన్ని వెనక్కి రప్పించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న కొందరు దౌత్యవేత్తల ద్వారా ఉగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అతని నుంచి సానుకూల స్పందన రావటం లేదని తెలుస్తోంది. అక్కడి యువత టెర్రరిస్టులుగా మారటం అన్నది కొన్ని దశాబ్దాలుగా సర్వసాధారణమైపోయింది. అయితే ఈ ఏడాది కాలంలో అది మరింత ఎక్కువైంది. ఈ జూలై నుంచి సెప్టెంబర్ దాకా మొత్తం 41 మంది యువకులు మిలిటెంట్లలలో చేరిపోగా.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 170 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. -
‘పెళ్లికి వెళ్లిన జవాన్‌ను చంపారు.. ఏకం కారా?’
న్యూఢిల్లీ: దుష్ప్రచారాలతో తప్పు దోవపట్టిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ యువత నిలబడే తరుణం ఇదేనని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ పాక్ బలగాలు అక్రమంగా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఈ ఘటనకు వ్యతిరేకంగా పాక్ యూత్ మొత్తం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని విస్తరింపజేయాలని పాక్ కుట్రలు చేస్తుందని, అందులో కశ్మీర్ యువత బలికావొద్దని, సోషల్ మీడియాలో పాక్ చేసే దుష్ప్రచారాన్ని ఆకర్షితులవకుండా మనోధైర్యంతో దానిని తిప్పికొట్టాలని సూచించారు. ‘లెఫ్టినెంట్ ఫయాజ్ కశ్మీర్ లోయకు చెందిన వీర జవాను. ఎంతో కష్టపడి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చోటు సంపాధించుకున్నాడు. గత ఏడాది డిసెంబర్లో రాజ్‌పుటానా రైఫిల్స్‌లో బాధ్యతలు చేపట్టాడు. అతడు చాలా ధైర్యంగల యువకుడు.. ఓ వివాహం వేడుక చూసేందుకు ఇంటికెళ్లాడు. పండుగకు వెళ్లిన ఆ వీర జవానును క్రూరంగా చంపేశారు’ అని ఆర్మీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కశ్మీర్ యువత తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని చెప్పారు. ఈ సమయంలో వారంతా ఏకమయ్యి సరైన మార్గమేమిటో చర్చించుకోవాలని సూచించారు. ఎవరు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారో దాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశారు. -
మిలిటెంట్‌కు గన్ సెల్యూట్
శ్రీనగర్: ఇటీవల భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ అలియాస్ సేథా అంత్యక్రియల్లో అతని సహచర మిలిటెంట్లు పాల్గొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో హాజరై తమ సహచరుడికి ఏకే–47 తుపాకులతో గన్ సెల్యూట్ చేశారు. దాదాపు నలుగురు మిలిటెంట్లు అంత్యక్రియలకు హాజరయ్యారని, పలు నినాదాలు ఇచ్చిన అనంతరం వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఫయాజ్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరయ్యారు. గుంపులో కొందరు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. 2015 ఆగస్టులో జరిగిన ఉధమ్‌పూర్ ఉగ్రదాడిలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఫయాజ్‌పై కేసు నమోదు చేసింది. ఇతని తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. శనివారం కుల్గామ్‌లోని మిర్ బజార్లో రోడ్డుప్రమాదం జరగడంతో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలపై మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో ఫయాజ్‌తో పాటు ముగ్గురు పౌరులు, ఓ పోలీస్ అధికారి మృతి చెందారు. ఐసిస్ ఉగ్రవాదులతో కశ్మీర్ యువత చాటింగ్! కశ్మీర్ లోయలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకునేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోందన్న వాదనలను కొట్టిపారేయలేమని భద్రతా సంస్థలు చెప్పాయి. గత ఆరు నెలలుగా లోయలోని యువకులు సిరియా, ఇరాక్‌లోని ఉగ్రవాద గ్రూపులతో ఇంటర్నెట్ ద్వారా చాటింగ్‌లు చేయడం లాంటివి పెరిగాయని తెలిపాయి. -
అది మనందరి తప్పు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ’మన్‌కీ బాత్’లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం మంచి విషయమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. గతవారం జమ్ముకశ్మీర్ ప్రతిపక్ష నేతలతో భేటీ అనంతరం తొలిసారి ఈ అంశంపై మోదీ మాట్లాడారని, ఇప్పుడు ’మన్‌కీ బాత్’లోనూ దీనిని కొనసాగించారని ట్విట్టర్లో తెలిపారు. ’అది యువత కానివ్వండి, భద్రతాసిబ్బంది కానివ్వండి కశ్మీర్లో ఎవరూ చనిపోయినా అది మనందరికీ నష్టమే’ అంటూ మోదీ పేర్కొన్న వ్యాఖ్యను ఒమర్ ట్వీట్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించారు. ఇక, ’కశ్మీర్లో యువతను హింసవైపు ప్రేరేపిస్తున్న వారు ఒకరోజున వారికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంద’న్న మోదీ వ్యాఖ్యకు సమాధానంగా మరో ట్వీట్ చేస్తూ.. ’సర్.. దురదృష్టవశాత్తు మనందరి ఉమ్మడి తప్పులు, జమ్ముకశ్మీర్ అంశాన్ని సరిగ్గా పరిష్కరించకపోవడం వల్ల యువత ఇలా హింస వైపు మళ్లుతున్నారు’ అని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో గత 51 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 70మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, భద్రతా దళాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. Unfortunately sir a lot of these youngsters have been pushed there by our collective mistakes & mishandling of J&K. https://t.co/MoOrITSBoQ — Omar Abdullah (@abdullah_omar) August 28, 2016