ఆపద్బాంధవుడు కానిస్టేబుల్‌ సదాశివ | Karnataka Police Constable Helps Kashmir Woman Missing Documents | Sakshi
Sakshi News home page

ఆపద్బాంధవుడు కానిస్టేబుల్‌ సదాశివ

Published Sat, Jan 11 2020 8:36 AM | Last Updated on Sat, Jan 11 2020 8:36 AM

Karnataka Police Constable Helps Kashmir Woman Missing Documents - Sakshi

మార్క్స్‌కార్డులను అందజేస్తున్న కానిస్టేబుల్‌

కర్ణాటక, బొమ్మనహళ్లి : ఉద్యోగం కోసం కశ్మీర్‌ నుంచి బెంగళూరు వచ్చిన ఓ యువతి నగరంలో తన విద్యకు సంబంధించిన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న సమయంలో వాటిని తిరిగి అందజేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. కశ్మీర్‌కు చెందిన మరియా అనే యువతి నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. వారం రోజుల క్రితం మాన్యత టెక్‌పార్కులో ఉన్న ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లే క్రమంలో తన విద్యకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు పోగొట్టుకుంది.

ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ సదాశివకు అక్కడ ఒక బ్యాగ్‌ కనిపించడంతో స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాడు. యువతికి సంబంధించిన ఫోన్‌నెంబర్లు లేకపోవడంతో అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఇదే క్రమంలో బాధిత యువతి మరియా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువతి ఫోన్‌ నెంబర్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వాటిని కానిస్టేబుల్‌ సదాశివ ద్వారా ఇప్పించారు. దీంతో మరియా సంగిగెహళ్లి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. వారి వల్లనే తనకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement