Police Constable Tries To Molest Woman Complaint Filed In Mysore - Sakshi
Sakshi News home page

కీచక కానిస్టేబుల్‌: అర్ధరాత్రి మహిళపై..

Published Sat, Jul 17 2021 8:31 AM | Last Updated on Sat, Jul 17 2021 1:18 PM

Mysore: Police Constable Tries To Molest Woman Complaint Filed - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు/కర్ణాటక: మహిళలకు రక్షణగా ఉండాల్సిన ఓ పోలీస్‌ క్రమశిక్షణ తప్పాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మైసూరు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని మెటగళ్లి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ మహబూబ్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు... మైసూరు నగరంలోని రాఘవేంద్ర నగర్లో కానిస్టేబుల్‌ మహబూబ్‌ నివాసం ఉంటున్నాడు.

ఇతని ఇంటి పక్కనే ఉంటున్న ఓ మహిళ ఈనెల 13న అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం వచ్చింది. ఆమెపై కన్నేసిన మహబూబ్‌ ఆమె వెనుకాలే వెళ్లి గట్టిగా పట్టుకుని ఇంటిలోకి లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న మరోవ్యక్తి అడ్డుకోవడానికి యత్నించాడు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మహబూబ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. నజరాబాద్‌ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement