ఖాకీల ప్రేమ పెళ్లి | Karnataka Police Constables Love Marriage in Police Station | Sakshi
Sakshi News home page

ఖాకీల ప్రేమ పెళ్లి

Published Tue, Feb 12 2019 12:44 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

Karnataka Police Constables Love Marriage in Police Station - Sakshi

శ్వేతారాణి, సిద్ధరాజుల పెళ్లి దృశ్యం

కర్ణాటక, మైసూరు: తల్లిదండ్రులు ప్రేమను నిరాకరిస్తే ప్రేమికులు పోలీసులను ఆశ్రయించి వివాహాలు చేసుకోవడం సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. అయితే తమ ప్రేమను కన్నవారు కాదనడంతో ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు ఒడనాడి సంస్థ సహాయంతో ప్రేమ వివాహం చేసుకున్న ఘటన సోమవారం మైసూరు నగరంలో జరిగింది. వివరాలు.. హాసన జిల్లా హొళనరసీపుర తాలూకాకు చెందిన శ్వేతారాణి, మైసూరు జిల్లా సిద్దరామయ్యనహుండి గ్రామానికి చెందిన సిద్ధరాజులు బెంగళూరు వివేకానందనగర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టుబుళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది క్రితం ఇరువురి మధ్య ప్రేమ చిగురించడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో తెలిపారు. అందుకు ఇరువురి కుటుంబ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేసినా, పెళ్లాడాలని తీర్మానించుకున్నారు. సోమవారం మైసూరు నగరంలోని ఒడనాడి సంస్థ రక్షణ కోరి సంస్థ కార్యాలయంలోనే కొళ్లేగాల బౌద్దధర్మ పీఠం అధ్యక్షురాలు భంతోదేవి రత్న సమక్షంలో మూడుముళ్లతో ఒక్కటయ్యారు. పలువురు పెద్దలు పోలీస్‌ జంటను ఆశీర్వదించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement