
న్యూఢిల్లీ: ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు కఠిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా అశ్లీల కంటెంట్‌ను మితిమీరి ప్రసారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫిర్యాదులకు చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
ఓవర్ ది టాప్(OTT) ఫ్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు ఐటీ రూల్స్ (2021) నైతిక విలువలు(Code of Ethics) పాటించాల్సిందే. అలాగే చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులకు కఠిన చర్యలు తప్పవు.
.. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు మితిమీరి ఏ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని, స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. సంబంధిత శాఖ సలహాదారు కాంచన్ గుప్తా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.
Advisory to OTT platforms against nisitha, indecency and obscenity:
Ministry of Information & Broadcasting has issued an advisory to online curated content publishers (OTT platforms) and self-regulatory Bodies of OTT platforms, to ensure strict adherence to India’s laws and the… pic.twitter.com/xMjddk9ns0— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 20, 2025
ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటు పార్లమెంట్ లోనూ చర్చ జరగ్గా..అటు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో యూట్యూబ్‌లాంటి ఫ్లాట్‌ఫారమ్‌లలో అభ్యంతరకర కంటెంట్‌పై నియంత్రణ ఉండాలంటూ సర్వోన్నత న్యాయస్థానం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment