Niger Coup Supporters March in Capital Waving Russian Flags - Sakshi
Sakshi News home page

రష్యా అధ్యక్షుడికి జేజేలు పలుకుతూ నైగర్‌లో ప్రదర్శన.. రాజధానికి భారీగా మద్దతుదారులు..   

Published Mon, Jul 31 2023 1:17 PM | Last Updated on Mon, Jul 31 2023 2:15 PM

Niger Coup Supporters March In Capital Waving Russian Flags - Sakshi

నియామే: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో సైనిక దళాలు తిరుగుబాటు చేసి ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ బజోమ్స్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సైనిక చర్యను ప్రాన్స్ తప్పుబట్టగా వాగ్నర్ దళాధిపతి ప్రిగోజిన్ మాత్రం మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు సైన్యానికి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ భారీ సంఖ్యలో మద్దతుదారులు రాజధానికి తరలి వచ్చారు. 

తిరుగుబాటు పర్వం.. 
కొద్దిరోజుల క్రితం నైగర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటు ఇరుగు పొరుగు దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల క్రితం 2021లో నైగర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ బజోమ్స్ గెలిచారు. కానీ ఆయన పరిపాలనలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద ముఠాలు పేట్రేగుతున్నాయని, అతని చేతగానితనంతో ఫ్రాన్స్ మళ్ళీ తమ గడ్డమీద పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో  తిరుగుబాటు చేసి అధ్యక్షుడిని చెరలో బంధించామని కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే తెలిపారు. 

దేశమంతటా కర్ఫ్యూ.. 
ఈ మేరకు ఒక వీడియోని విడుదల చేస్తూ.. దేశ సరిహద్దులను మూసి వేస్తున్నామని, ఇది మా దేశ అంతర్గత వ్యవహారమని ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. మహమ్మద్ బజోమ్స్ ను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు టీవీ ద్వారా సందేశమిచ్చారు. 

అమెరికా కంగారు.. 
తిరుగుబాటు తదనంతరం సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించగా వారి గొంతు వెనుక స్వార్ధపూరిత కారణాలు కూడా లేకపోలేదంటున్నాయి నైగర్ సైనిక వర్గాలు. నైగర్‌లో అమెరికాకు రెండు డ్రోన్ స్థావరాలున్నాయని సుమారు 800 మంది వారి సైనికులు నైగర్ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. 

జయహో పుతిన్.. 
ఇదిలా ఉండగా రష్యా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్గనీ ప్రిగోజిన్ నైగర్ సైన్యం తిరుగుబాటు సరైనదేనని మద్దతు తెలిపారు. దీంతో నైగర్ తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు భారీగా రాజధాని నియామేకి తరలి వచ్చి  ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ రష్యా జెండాలను ప్రదర్శించారు.          

   

అనుమానమే నిజమైంది..   
1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి నైగర్‌లో తిరుగుబాట్లు జరిగాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత తిరుగుబాటు జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా మహమ్మద్ బజోమ్స్ ఎన్నికైన తర్వాత పలుమార్లు ప్రెసిడెన్షియల్ గార్డ్స్  బృందం నుండి తనకు ముప్పు ఉందని తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఆయన అనుమానమే నిజమైంది.
   
ఇది కూడా చదవండి: ఎత్తైన భవనంపై సాహాసం.. అంతలోనే పట్టుతప్పి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement