22 మంది ఉగ్రవాదులు హతం
లాగోస్: బోకోహారమ్ ఉగ్రవాదులపై నైజీరియన్ ఆర్మీ విరుచుకుపడింది. బోర్నో రాష్ట్రంలో జరిపిన సైనిక ఆపరేషన్లో 22 మంది బోకోహారమ్ ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ అధికారి కల్నల్ సాని ఉస్మాన్ వెల్లడించారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు సైనికులు కూడా మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని ఆయన వెల్లడించారు.
లోగోమని ప్రాంతంలో రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లతో విరుచుకుపడిన బోకోహారమ్ ఉగ్రవాదులపై సైన్యం దాడి జరపడంతో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనలో ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్స్ తో పాటు భారీ మొత్తంలో గ్రెనేడ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది.