ఆత్మాహుతి దాడి..11 మంది మృతి | 11 killed in Nigeria suicide bombings | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి..11 మంది మృతి

Published Tue, Jun 16 2015 9:11 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

11 killed in Nigeria suicide bombings

అబుజా: నైజిరియాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన మానవబాంబు దాడిలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ దాడిని చూసి ఒక్కసారిగా ప్రభుత్వ బలగాలు ఉలిక్కిపడ్డాయి. బోకో హారానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మానవ బాంబులుగా తయారై వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారుల ప్రాథమిక సమాచారం.

ఈ ఇద్దరిలో ఒకరు సివిల్ సెక్యూరిటీ గ్రూప్ కార్యాలయంపై దాడి చేయగా మరొకరు పబ్లోకి వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. అబూబకర్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ దాడులపై మాట్లాడుతూ వారు ఒంటి చుట్టూ వైర్లు చుట్టుకొని పెద్దగా కేకలు వేస్తూ ఒకేసారి పక్కపక్కనే ఉన్న కార్యాలయం, పబ్లోకి ప్రవేశించి తమను తాము పేల్చేసుకున్నారని తెలిపాడు. స్థానిక ప్రజలపై ఎలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా సివిల్ సెక్యూరిటీ గ్రూప్ కార్యాలయం కాపాడుతుంది. ఈ నేపథ్యంలోనే వారు దానినే ప్రధాన లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement