'బొకో హరామ్' దాడుల్లో 85మంది మృతి | Nigeria's Boko Haram killed 85 in five days | Sakshi
Sakshi News home page

'బొకో హరామ్' దాడుల్లో 85మంది మృతి

Published Mon, Sep 30 2013 8:50 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

Nigeria's Boko Haram killed 85 in five days

అబుజా : నైజీరియా ఈశాన్య ప్రాంతంలో గత అయిదు రోజుల్లో  'బొకో హరామ్'  అనే ముస్లిం ఉగ్రవాద సంస్థ దాడుల్లో 87మంది దుర్మరణం చెందారు. వారిలో 47మంది విద్యార్థులు ఉన్నారు. యోబ్ రాష్ట్రంలోని గజ్బాలోని వ్యవసాయ కళాశాలపై ఆదివారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.   ఈ ఘటనలో సుమారు 50కిపైగా  విద్యార్థులు మరణించారు. మరణించినవారిలో 18-22 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ఉన్నారు.

భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు.. హస్టల్‌లోకి చొరబడి నిద్రిస్తున్న విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు కొందరు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం విని మిగతా విద్యార్థులు పారిపోవడానికి ప్రయత్నించారు. మిలిటెంట్లు వెంటాడి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ హస్టల్‌కు నిప్పు పెట్టారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. బోకో హరమ్ అనే ఇస్లామిక్‌ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement