నియామే: నైగర్‌లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకించిన కారణంగా ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీలు చేశారు సైనిక మద్దతుదారులు. దీంతో నైగర్‌లో ఉండే ఫ్రాన్స్ దేశస్తులకు హాని ఉందన్న కారణంతో వారిని వెంటనే వెనక్కు రప్పించనున్నట్లు తెలిపింది ఫ్రాన్స్ ఎంబసీ.
1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందిన నైగర్‌లో 2021లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగాయి. అందులో అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ బజోమ్స్ పరిపాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని సైన్యం ఆరోపిస్తూ ఆయనను గద్దె దించాలని నిర్ణయించుకుంది సైన్యం. ఇటీవలే ఆయను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించారు సైన్యాధ్యక్షుడు కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే.
నైగర్‌లో సైనిక తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫ్రాన్స్ దేశం సైనిక తిరుగుబాటును వ్యతిరేకించగా రష్యా సమర్ధించింది. ఈ నేపథ్యంలో నైగర్‌లో తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు రష్యాకు జేజేలు పలుకుతూ ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో భారీగా ప్రదర్శన చేశారు. దీంతో ఫ్రాన్స్ దేశస్తులకు నైగర్‌లో ప్రమాదమని భావించి వారిని వెనక్కు రాపించే ప్రయత్నం చేస్తోంది ఫ్రాన్స్ ఎంబసీ.
ఇది కూడా చదవండి: కెనడాలో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష..
Comments
Please login to add a commentAdd a comment